Today Horoscope:ఈ రోజు మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ సమయంలో మంచి పని ప్రారంభించాలి. ఏ గడియ బాగుంటుంది. అనే వివరాలు తెలుసుకోవాలంటే హిట్ టీవీ వెబ్ న్యూస్లో ఉన్న రాశి ఫలాలు చూడగలరు.
మేష రాశి:అనారోగ్య సమస్యలను అధిగమిస్తారు. నూతన కార్యాలకు ఆటంకాలు ఉంటాయి. అయినప్పటికీ సక్సెస్ అవుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో ధన నష్టం ఏర్పడకుండా అలర్ట్గా ఉండాలి. ఆత్మీయుల సహాయ, సహాకారాల కోసం వేచి ఉంటారు. దైవ దర్శనం లభిస్తుంది.
వృషభ రాశి:కొత్త పనులు మొదలు పెడతారు. మానసిక ఆనందం పొందుతారు. ప్రతి విషయంలో వ్యయ, ప్రయాసలు తప్పవు. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. వృత్తిరీత్యా కొత్త సమస్యలు ఎదుర్కొంటారు. బంధుమిత్రులతో కలహాలు ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది.
మిథున రాశి:నూతన వస్తు, వస్త్ర, వాహన ఆభరణ లాభాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభ కార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. బంధుమిత్రులతో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన కార్యక్రమం పూర్తి అవుతుంది.
కర్కాటక రాశి:విదేశాల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనారోగ్య బాధలు తప్పవు. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించుట మంచిది. అనవసర వ్యయ ప్రయాసలు ఉంటాయి. ప్రయాణాలు ఎక్కువ చేయాల్సి ఉంటుంది.
సింహ రాశి:విదేశాల కోసం ప్రయత్నం నెరవేరుతుంది. మనో విచారం ఉంటుంది. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంది. నూతన పనులు వాయిదా వేసుకుంటారు.
కన్య రాశి:ఆర్థిక ఇబ్బందులు ఉండవు. నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. స్నేహితులను కలుస్తారు. ఇతరులకు సలహాలు, సూచనలు ఇస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ధైర్య సాహాసాలతో పనులు పూర్తి చేస్తారు. శుభవార్తలు వింటారు.
తుల రాశి:ఇంతవరకు అనుభవించిన కష్టాలు క్రమేణ తొలగిపోతాయి. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆకస్మిక ధన లాభం ఉంటుంది. ప్రముఖ వ్యక్తిని కలుస్తారు.
వృశ్చిక రాశి:కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటారు. మానసిక చంచలంతో ఇబ్బంది పడతారు. సోమరితనంగా ఉంటారు. పిల్లల పట్ల మిక్కిలి జాగ్రత్త వహిస్తారు. కొన్ని మంచి అవకాశాలు కోల్పోతారు. ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఉండవు.
ధనుస్సు రాశి:అనుకూల స్థాన చలనం కలిగే అవకాశం ఉంది. గృహంలో మార్పు కోరుకుంటారు. ఇతరుల విమర్శలకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. ఆకస్మిక ధన వ్యయం అయ్యే అవకాశం ఉంది. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. రుణ ప్రయత్నాలు చేస్తారు.
మకర రాశి:అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు ఉన్నాయి. గృహంలో మార్పు కోరుకుంటారు. ఇతరుల విమర్శలకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. ఆకస్మిక ధన వ్యయం కలిగే అవకాశం ఉంది. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది, రుణ ప్రయత్నాలు చేస్తారు.
కుంభ రాశి:బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అధికారులతో జాగ్రత్తగా మెలగుట మంచిది. అనవసర భయం ఆవహిస్తుంది.
మీన రాశి:ఆకస్మిక ధనలాభ ఉంది. కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటుంది. పేరు ప్రతిష్ఠలు లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు. బంధుమిత్రులు కలుస్తారు.