Today Horoscope:ఈ రోజు మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ సమయంలో మంచి పని ప్రారంభించాలి. ఏ గడియ బాగుంటుంది. అనే వివరాలు తెలుసుకోవాలంటే హిట్ టీవీ వెబ్ న్యూస్లో ఉన్న రాశి ఫలాలు చూడగలరు.
మేష రాశి
కొత్తగా చేపట్టే పనులకు ఆటంకాలు ఉంటాయి.. అయినప్పటికీ విజయం సాధిస్తారు. అనారోగ్య బాధలను అధిగమిస్తారు. ప్రయాణ సమయాల్లో జాగ్రత్త అవసరం. వృత్తి, వ్యాపార రంగాల్లో ఆర్థిక నష్టం కలుగకుండా జాగ్రత్త వహించాలి. ఆత్మీయుల సహాయ సహకారాల కోసం వేచి చూస్తారు. దైవదర్శనం లభిస్తుంది.
వృషభ రాశి
బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. ఆకస్మికంగా ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అధికారులతో జాగ్రత్తగా మెలగడం మంచిది. అనవసరంగా భయ భయపడుతారు.
మిథున రాశి
శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరతాయి. నూతన వస్తు, వస్త్ర, వాహన, ఆభరణ ద్వారా లాభాలను పొందుతారు. ఆకస్మికంగా ధన లాభం ఉంటుంది. శుభవార్తలు వింటారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. అనుకున్న ముఖ్యమైన కార్యక్రమం పూర్తవుతుంది.
కర్కాటక రాశి
వ్యవసాయ రంగంలోని వారికి లాభదాయకంగా ఉంటుంది. తొందరపాటు వల్ల ప్రయత్నకార్యాలు చెడిపోతాయి. చెడును కోరేవారికి దూరంగా ఉండటం మంచిది. ఆకస్మిక భయం, ఆందోళన ఆవహిస్తాయి. శారీరకంగా బలహీనంగా ఉంటారు.
సింహ రాశి
కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. విదేశయాన ప్రయత్నం సులభంగా నెరవేరుతుంది. మనోవిచారం పొందుతారు. ఆకస్మిక ధన నష్టం పట్ల జాగ్రత్త వహించడం మంచిది. నూతన కార్యాలు వాయిదా వేసుకుంటారు. ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తోంది.
కన్య రాశి
తలచిన కార్యాలు విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. బంధు, మిత్రుల మర్యాద పొందుతారు. అనారోగ్యబాధలు ఉండవు. సహ ఉద్యోగులకు సహకరించే అవకాశం లభిస్తుంది. ఆలోచనలు ప్రణాళికాబద్ధంగా ఉంటాయి. అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి.
తుల రాశి
శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరతాయి. శుభవార్త వింటారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందంగా ఉంటారు. ప్రయత్న కార్యాలన్నింటీలో విజయం సాధిస్తారు. కీర్తి, ప్రతిష్ఠ అధికం అవుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.
వృశ్చిక రాశి
కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. కొత్తగా పనులు చేపట్టకుండా ఉంటే మంచిది. ఆత్మీయుల సహాయ సహకారాల కోసం సమయం వెచ్చించాల్సి ఉంటుంది.
ధనుస్సు రాశి
కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆకస్మికంగా ధనలాభం పొందుతారు. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు నెరవేరుతాయి.
మకర రాశి
అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు ఉన్నాయి. గృహంలో మార్పును కోరుకుంటారు. ఇతరుల విమర్శలకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ఆకస్మిక ధనవ్యయం అయ్యే అవకాశం ఉంది. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. రుణ ప్రయత్నాలు చేస్తారు.
కుంభ రాశి
శుభవార్త వింటారు. నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. విందు, వినోదాల్లో పాల్గొంటారు. చర్చలు, సదస్సులు ఆకర్షిస్తాయి. మనోధైర్యం కలిగి ఉంటారు.
మీన రాశి
కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటారు. పేరు, ప్రతిష్ఠలు లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు. బంధు, మిత్రులు కలుస్తారు. ఆకస్మిక ధన లాభం ఉంటుంది.