Today Horoscope:ఈ రోజు మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ సమయంలో మంచి పని ప్రారంభించాలి. ఏ గడియ బాగుంటుంది. అనే వివరాలు తెలుసుకోవాలంటే హిట్ టీవీ వెబ్ న్యూస్ (Hit TV Web News)లో ఉన్న రాశి ఫలాలు చూడగలరు.
మేషరాశి
మేషరాశి వారు ఈ రోజు తలపెట్టిన కార్యాలన్నీ సకాలంలో జరుగుతాయి. తద్వారా మంచి ఫలితాలను అందుకుంటారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. సంపూర్ణ ఆరోగ్యంతో, సంతోషంగా ఉంటారు. కొత్త వస్తువులు, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ధైర్యంగా ముందుకు వెళ్తారు. రుణ భారం తొలగిపోతాయి.
వృషభరాశి
వృషభరాశి వారు ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త వహించడం శ్రేయస్కరం. కొన్ని ముఖ్యమైన పనులకు వాయిదా వేసుకుంటే మంచిది. వృధా ప్రయాణాలు చేస్తారు. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. దగ్గరివారితో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది.
మిథునరాశి
ఈ రాశి వారు స్త్రీలు, పిల్లల పట్ల మిక్కిలి శ్రద్ధ వహిస్తారు. అనవసర భయానికి లోనవుతారు. అనారోగ్య బాధలు అధికం అవుతాయి. అకారణంగా కలహాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. విద్యార్థులు చంచలంగా ప్రవర్తిస్తారు. వ్యాపార రంగంలోని వారు జాగ్రత్తగా ఉండటం మంచిది.
కర్కాటకరాశి
కర్కాటక రాశి వారు తలపెట్టిన కార్యలకు ఆటంకాలు ఏర్పడుతాయి. బంధుమిత్రులతో జాగ్రత్త వహించడం మంచిది. కుటుంబం విషయంలో నిర్ణయాలను ఆచితూచి తీసుకోవాలి. అనుకోని కలహాలు ఏర్పడే అవకాశం ఉంది. ధన నష్టం అధికం అవుతుంది. రుణ ప్రయత్నం చేస్తారు. అనారోగ్యంతో బాధపడేవారు కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది.
సింహరాశి
సింహరాశి వారు తలచింది జరగదు. అనుకొని సంఘటలను ఎదురవుతాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత వహించడం మంచిది. పిల్లల పట్ల ఏ మాత్రం అశ్రద్ధ పనికిరాదు. సమయానికి భోజనం చేయడానికి ప్రాధాన్యత ఇస్తారు. మనసు నిలకడగా ఉండదు. తద్వారా కొంత ఇబ్బంది ఉంటుంది. మనోనిగ్రహానికి ప్రయత్నించాలి.
కన్యరాశి
కన్య రాశి వారు వృత్తి, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి సాధిస్తారు. ఆత్మీయులను కలవడంలో విఫలం అవుతారు. అనవసర వ్యయప్రయాసల వల్ల ఆందోళన చెందుతారు. వృథా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. స్త్రీల వల్ల ధన లాభం ఉంటుంది. ఊహించని కార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది.
తులరాశి
ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది. రాజకీయరంగం లోని వారికి, క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. అన్నింటా విజయాన్నే సాధిస్తారు. బంధు, మిత్రులు కలుస్తారు. శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లోనివారికి అభివృద్ధి ఉంటుంది.
వృశ్చికరాశి
వృశ్చిక రాశివారు ఆత్మీయులకు ప్రాధాన్యం ఇస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. భయాందోళనలు ఉండవు. ప్రశాంతగా ఉంటారు. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. బంధు, మిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త ఊహించడం మంచిది. శతృబాధలు ఉండే అవకాశం ఉంది.
ధనుస్సురాశి
ధనుస్సు రాశి వారు శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభ వార్తలు వింటారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధన లాభం పొందుతారు. నూతన వస్తు, ఆభరణాలను ఖరీదు చేస్తారు. ముఖ్యమైన కార్యాలు పూర్తవుతాయి.
మకరరాశి
ఈ రాశి వారు తలపెట్టిన కార్యలను అలస్యంగా ప్రారంభిస్తారు. భోజనం తక్కువ చేయడం వలన స్వల్ప అనారోగ్యం కలుగుతుంది. ఏదో ఒక విషయం మిమ్మల్ని మనస్తాపానికి గురిచేస్తుంది. వీలైనంతవరకు అసత్యానికి దూరంగా ఉండటం మంచిది. అనవసర భయాందోళనకు లోనవుతారు.
కుంభరాశి
ఈ రాశివారు అపకీర్తి రాకుండా జాగ్రత్త పడటం మంచిది. మనోల్లాసాన్ని పొందుతారు. సోదరులతో వైరంఏర్పడకుండా మెలగాలి. తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగా తొలగిపోతాయి. నూతన వ్యక్తుల జోలికి వెళ్లకూడదు.
మీనరాశి
మీనరాశి వారికి ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. నూతన వస్తు, ఆభరణాలు పొందుతారు. కీర్తి, ప్రతిష్ఠలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఇతరులకు ఉపకారం చేయడానికి వెనుకాడరు. రుణబాధలు తొలగిపోతాయి.