అప్పన్న ఆలయంలోకి శునకం ప్రవేశించింది. దీంతో అర్చకులు అపచారంగా భావించి దర్శనాలను నిలిపివేశారు. రెండు గంటల తర్వాత ఆలయాన్ని శుద్ధి చేసి భక్తులను దర్శనానికి అనుమతించారు.
దసరా అంటే చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా భావిస్తారు. ఈ పండగను ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసం శుక్లపక్షం పదో రోజున జరుపుకుంటారు. ఈ ఏడాది దసరా పండగను అక్టోబర్ 23, 24వ తేదీల్లో జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం విజయదశమి నాడు గ్రహాల అద్భుత కలయిక కారణంగా 5 రాశుల వారికి ఆనందం, సంపద వెల్లివిరుస్తాయని పండితులు చెబుతున్నారు. మరి ఆ రాశులేంటో ఒకసారి చూద్దాం.
తిరుమలలో భక్తజనం మధ్య వేడుకగా శ్రీవారి గరుడ సేవ జరిగింది. లక్షకు పైగా జనం ఈ వేడుకలో పాల్గొన్నారు. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి గరుడ వాహనంపై ఊరేగుతుంటే భక్తులు తన్మయత్వంతో పులకించిపోయారు.
నవరాత్రి సందర్భంగా దుర్గామాతను వివిధ రూపాల్లో అలంకరించి భక్తులు పూజిస్తూ ఉంటారు. అయితే కోల్‌కతాలో మాత్రం వెరైటీగా తమ భక్తిని చాటుకుంటుంటారు. తాజాగా అక్కడ పానీపూరీలతో దుర్గామాత మండపాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆ మండపానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.