మేషం
మీరు చేసే ప్రయత్నకార్యాలన్నీ వెంటనే ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. రుణబాధలు తొలగిపోతాయి. ధైర్యసాహసలతో ముందుకు వెళ్తారు.వారసత్వ ఆస్తిని పొందుతారు. విద్యార్థులు చదువుకు సంబంధించిన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.
వృషభం
ఈ రోజు మీకు కొంత గందరగోళంగా అనిపిస్తుంది. ఉద్యోగులకు కార్యాలయంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అనవసర చర్చలకు దూరంగా ఉండండి. ఆకస్మిక ధననష్టం పట్ల జాగ్రత్త అవసరం. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. స్వల్ప అనారోగ్యబాధలు ఉంటాయియ.వృధాప్రయాణాలు చేస్తారు
మిథునం
మీ మనస్సు ప్రశాంతత ఉంటుంది.అదే సమయంలో అనవసర ఆందోళనలు ఉంటాయి. చర్చలకు దూరంగా ఉండడం మంచిది. మీరు ఉద్యోగంలో అదనపు బాధ్యతలు పొందుతారు. మీపై మీకు పూర్తి విశ్వాసం ఉంటుంది. ఏ విషయంలోనీ అత్సుత్సాహం ప్రదర్శించవద్దు. అనారోగ్య బాధలు అధికమవుతాయి. అకారణంగా కలహాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అనవసర భయానికి లోనవుతారు. విద్యార్థులు చంచలంగా ప్రవర్తిస్తారు. వ్యాపార రంగంలోనివారు జాగ్రత్తగా ఉండటం మంచిది
కర్కాటకం
మీ ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధుమిత్రులతో జాగ్రత్తగా మెలగడం మంచిది. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది. ధననష్టాన్ని అధిగమించడానికి రుణప్రయత్నం చేస్తారు. కుటుంబ విషయాల్లో మార్పులు ఉంటాయి.ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగంలో కొంత అదనపు బాధ్యతను పొందవచ్చు. మీరు అధికారుల నుంచి మద్దతు పొందుతారు. సంభాషణలో సంయమనం పాటించండి. పనిభారం పెరగవచ్చు. లాభదాయకమైన కొత్త అవకాశాలు ఉంటాయి.
సింహం
కోరుకునేది ఒకటైతే జరిగేది మరొకటవుతుంది. అనారోగ్య బాధలు స్వల్పంగా ఉన్నాయి. వేళప్రకారం భుజించడానికి ప్రాధాన్యమిస్తారు. చంచలం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మనోనిగ్రహానికి ప్రయత్నించాలి. పిల్లలపట్ల ఏమాత్రం అశ్రద్ధ మంచిది కాదు
స్వీయ నియంత్రణలో ఉండండి. కోపం తగ్గించుకోవాలి. కుటుంబంలో మతపరమైన కార్యక్రమాలు జరుగుతాయి. పూర్వీకుల వ్యాపారాన్ని పునఃప్రారంభించవచ్చు. ఆస్తి ద్వారా ఆదాయం పెరుగుతుంది. తండ్రి సాంగత్యం లభిస్తుంది.
కన్య
మీ వృత్తి, ఉద్యోగరంగాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆత్మీయులను కలవడంలో విఫలమవుతారు. అనవసర వ్యయప్రయాసలవల్ల ఆందోళన చెందుతారు. వృథా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. స్త్రీలమూలకంగా ధనలాభం ఉంటుంది. ఊహించనికార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది.సహనం తగ్గుతుంది. మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. కళ , సంగీతం పట్ల ఆసక్తి పెరుగుతుంది. కార్యక్షేత్రంలో శ్రమ ఎక్కువగా ఉంటుంది.
తుల
ఈ రాశివారు ఈ రోజు చాలా సంతోషంగా ఉంటారు. మీరు పూర్తి విశ్వాసంతో ఉంటారు కానీ స్వీయ నియంత్రణలో ఉంటారు. నిర్మాణ సౌఖ్యం పెరుగుతుంది. మీరు మిత్రుడి నుంచి డబ్బు పొందవచ్చు. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. ఉద్యోగంలో పురోగతికి దారులు సుగమం అవుతాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. రాజకీయరంగంలోని వారికి, క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. అన్నింటా విజయాన్నే సాధిస్తారు. బంధు, మిత్రులు కలుస్తారు.
వృశ్చికం
మీరు తల్లిదండ్రుల నుంచి మద్దతు పొందుతారు. మీకు శుభవార్త అందుతుంది. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి. ఉద్యోగంలో స్థలం మారే అవకాశాలు ఉన్నాయి. కుటుంబానికి దూరంగా ఉండాల్సి రావచ్చు. ఖర్చులు పెరుగుతాయి. స్నేహితుడి నుండి కొత్త వ్యాపారం కోసం ప్రతిపాదనను పొందవచ్చు. రుణప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. బంధు, మిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది.
ధనుస్సు
ఈ రాశివారు వ్యాపారంలో లాభాలుంటాయి. వైవాహిక జీవితం బావుంటుంది. కుటుంబంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్లాన్ చేసుకుంటారు. సోదరులు, సోదరీమణుల నుంచి మద్దతు పొందుతారు.శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. నూతన వస్తు, ఆభరణాలను ఖరీదు చేస్తారు.
మకరం
మీ వ్యాపారంలో పురోగతి ఉంటుంది. కుటుంబం నుంచి మద్దతు లభిస్తుంది. తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. జీవితంలో బాధగా ఉన్నట్టు అనిపిస్తుంది. మీపై మీకు పూర్తి విశ్వాసం ఉంటుందినూతనకార్యాలు ఆలస్యంగా ప్రారంభిస్తారు. అల్పభోజనం వల్ల అనారోగ్యాన్ని పొందుతారు. ఏదో ఒక విషయం మిమ్మల్ని మనస్తాపానికి గురిచేస్తుంది. వీలైనంతవరకు అసత్యానికి దూరంగా ఉండటం మంచిది.
కుంభం
మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఓ శుభవార్త వినే అవకాశం ఉంది. కోపం ఎంత త్వరగా వస్తుందో అంతే త్వరగా తగ్గుతుంది. ఇంటా బయటా గౌరవం పొందుతారు. స్నహితుల సహకారం లభిస్తుంది. అపకీర్తి రాకుండా జాగ్రత్త పడటం మంచిది. మనోల్లాసాన్ని పొందుతారు. సోదరులతో వైరం ఏర్పడకుండా మెలగాలి. తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగా తొలగిపోతాయి.
మీనం
ఈ రాశివారి మాటలో సౌమ్యత ఉంటుంది. మీపై మీకు పూర్తి విశ్వాసం ఉంటుంది. పని పరిధిలో మార్పులు ఉండొచ్చు. శ్రమ పెరుగుతుంది. విదేశాలకు వెళ్లే అవకాశం లభిస్తుంది. ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి.ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన వస్తు, ఆభరణాలు పొందుతారు. కీర్తి, ప్రతిష్ఠలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఇతరులకు ఉపకారం చేయడానికి వెనుకాడరు. రుణబాధలు తొలగిపోతాయి.