మేషం
మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. సంభాషణలో ఓపికగా ఉండండి. పూర్వీకుల ఆస్తి డబ్బు సంపాదించే సాధనంగా మారుతుంది. మానసిక ప్రశాంతత ఉంటుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటారు. పేరు, ప్రతిష్ఠలు లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. అంతటా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు. బంధు, మిత్రులు కలుస్తారు.
వృషభం
నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. కీర్తి, ప్రతిష్ఠలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఇతరులకు ఉపకారం చేయడానికి వెనుకాడరు. రుణబాధలు తొలగిపోతాయి. శత్రుబాధలు ఉండవు. మానసిక ప్రశాంతత కోసం ప్రయత్నించండి. కుటుంబం పట్ల సరైన శ్రద్ధ వహించండి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. విద్యా పనుల్లో ఆటంకాలు ఏర్పడవచ్చు.
మిథునం
మీపై మీకు పూర్తి విశ్వాసం ఉంటుంది. స్వీయ నియంత్రణలో ఉండండి. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది, కానీ అనవసర ఆందోళనలు కూడా ఉంటాయి. అనవసరమైన కోపం , చర్చలకు దూరంగా ఉండండి. ఉద్యోగంలో కొంత అదనపు బాధ్యతలు పొందుతారు. బంధు మిత్రులతో జాగ్రత్తగా మెలగడం మంచిది. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది. ధననష్టాన్ని అధిగమించడానికి రుణప్రయత్నం చేస్తారు.
కర్కాటకం
ఈ రాశివారు అధిక కోపం తగ్గించుకోవాలి. విదేశయాన ప్రయత్నం సులభమవుతుంది. కుటుంబ కలహాలకు తావీయకూడదు. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. పిల్లలతో జాగ్రత్త వహించడం మంచిది. వృత్తి, ఉద్యోగ రంగంలోనివారికి ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం.. కుటుంబంలో ఆనందం ఉంటుంది. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఆదాయం పెరుగుతుంది.ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి
సింహం
మీకు కొన్ని ఒడిదొడుకులు ఉండవచ్చు. మీరు చేపట్టే పనులకు కుటుంబం నుంచి మద్దతు లభిస్తుంది. స్నేహితుని సహాయంతో ఉద్యోగావకాశాలు పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. పిల్లలకు సంతోషాన్ని కలుగజేస్తారు.
కన్య
ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరం. వ్యాపారం విస్తరించే ప్రణాళికలు విజయవంతం అవుతాయి. చదువులపై ఆసక్తి పెరుగుతుంది. విద్యా , మేధోపరమైన పని సంతోషకరమైన ఫలితాలను ఇస్తుంది. ఉన్నత విద్య కోసం పెట్టుబడి పెడతారు. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. వృత్తి, ఉద్యోగరంగాల్లో నష్టపోయే అవకాశం ఉంది. కుటుంబంలో మార్పులు కోరుకుంటారు. ఒక మంచి అవకాశాన్ని జారవిడుచుకుంటారు.
తుల
ఈ రాశివారి కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. వ్యాపారం విస్తరిస్తారు. ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలు లాభిస్తాయి. వ్యాపారంలో లాభాలొస్తాయి. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది.అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలున్నాయి. గృహంలో మార్పును కోరకుంటారు. ఇతరుల విమర్శలకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. ఆకస్మిక ధనవ్యయం అయ్యే అవకాశం ఉంది.
వృశ్చికం
మీ మాటల ప్రభావం పెరుగుతుంది. వ్యాపారంలో ఆర్థిక లాభాలు పెరుగుతాయి. మీరు స్నేహితుల నుంచి మద్దతు పొందుతారు. ఆరోగ్యం గూర్చి జాగ్రత్తపడటం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశయాన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది. కుటుంబ కలహాలకు దూరంగా ఉంటే మేలు. సహనం అన్నివిధాలా శ్రేయస్కరం. డబ్బును పొదుపుగా వాడతారు.
ధనుస్సు
మీకు కుటుంబం నుంచి మద్దతు లభిస్తుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి మద్దతు పొందుతారు, కానీ మీరు కొన్ని ప్రత్యేక ప్రయోజనం కోసం వేరే ప్రదేశానికి వెళ్లవలసి ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మనసులో ప్రశాంతత, సంతోషం కలుగుతాయి. వాహన సౌఖ్యం పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబంలో ఆనందోత్సాహాలు లభిస్తాయి.
మకరం
పిల్లల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు.అధికారులతో గౌరవింపబడుతారు. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తిచేసుకుంటారు. అనారోగ్య బాధలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయుట మంచిది. నూతనవ్యక్తులు పరిచయమవుతారు.ఉద్యోగంలో అనవసర వాదనలకు దూరంగా ఉండండి. కుటుంబ సమస్యలతో ఇబ్బంది పడతారు. మీరు కార్యాలయంలో మరింత కష్టపడవలసి ఉంటుంది.
కుంభం
ఈ రోజు మీరు సంతోషంగా ఉంటారు. ఉద్యోగంలో ప్రమోషన్‌కు అవకాశం ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు కూడా పెరుగుతాయి. వృత్తిరీత్యా అనుకూల స్థానచలనం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. పోట్లాటలకు దూరంగా ఉండటం మంచిది. అనారోగ్య బాధలను అధిగమించడానికి ఔషధసేవ తప్పదు. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో తొందరపాటు పనికిరాదు.
మీనం
మీ ప్రయత్న కార్యాల్లో విజయాన్ని పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబం అంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఒక ముఖ్యమైన పని పూర్తికావడంతో మిక్కిలి ఆనందిస్తారు. కీర్తి, ప్రతిష్ఠలు పొందుతారు. శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. వ్యాపారం విస్తరించాలి అనుకునే ప్రణాళికలు అమలు చేస్తారు. పిల్లల కారణంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి.