Lord Shiva: శ్రీకాళహస్తి (Srikalahasti) ఈటీసీ కేంద్రంలో పురాతన శివాలయం ఉంది. శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో గంగయ్య పూజారిగా ఉన్నారు. పూజలు నిర్వహిస్తుండగా పరమశివుడి ప్రతిరూపం కళ్లు తెరిచినట్టు కనిపించింది. ఉదయం అభిషేక పూజ చేసి.. అలంకారం చేసిన తర్వాత స్వామి వారు కళ్లు తెరిచినట్టు గమనించారు. మధ్యాహ్నం స్థానికులతో వచ్చి శివలింగాన్ని పరిశీలించారు. అప్పుడు కూడా అలానే ఉన్నారు. తర్వాత పూజారి అందరికీ చెప్పగా.. స్థానికులు ఆలయానికి క్యూ కట్టారు. శివలింగానికి పూజలు చేసి, పిండి దీపాలు పెడుతున్నారు.
మాజీ కౌన్సిలర్ సుమతి, వైసీపీ నేతలు అక్కడికి చేరుకున్నారు. భక్తుల రద్దీ పెరగడంతో స్థానికులను నియంత్రిస్తూ స్వామి దర్శనం కల్పించారు. విషయం తెలుసుకున్న శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ తారక శ్రీనివాసులు ఆలయానికి వచ్చారు. స్వామి వారు కళ్లు తెరిచి ఉండటంతో భక్తులు స్వామివారిని చూసేందుకు క్యూ కట్టారని.. పూజలు చేస్తున్నారని వివరించారు. ఈ ప్రాంతానికి శివుడు (shiva) మేలు చేయాలని.. సస్యశ్యామలంగా ఉంచాలని కోరుకున్నారు. శివుడు (shiva) కళ్లు తెరిచాడనే విషయం ఆ నోటా ఈ నోటా అందరికీ తెలిసి.. స్వామి వారిని దర్శించుకునేందుకు బారులు తీరారు.