Devotees Rush In Temples: కార్తీక మాసంలో పౌర్ణమికి విశిష్ట స్థానం ఉంది. ఆ రోజున దీపం వెలిగిస్తే మంచిదని పండితులు చెబుతుంటారు. ఒక్కక్కరి పేరు మీద వత్తులు వెలగించి ఆ మహాశివుడిని (shiva) కోరుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో తెల్లవారుజామున 3 గంటల నుంచి భక్తుల రద్దీ నెకలొంది.
భద్రచాలంలో (bhadrachalam) సీతారామచంద్ర స్వామి వారి క్షేత్రం, రాజమండ్రిలో (rajahmandry) గోదావరి, విజయవాడ (vijayawada) అమ్మ వారి ఆలయం, శ్రీశైలం (srisailam), శ్రీకాళహస్తి (srikalahasti), ద్రాక్షారామం (draksharamam), వేములవాడలో (vemulawada) భక్తులు పోటెత్తారు. ఉదయం ఆలయం వద్దకు చేరుకుని అక్కడ దీపాలు వెలగించారు. కొన్నిచోట్ల నదుల్లో స్నానం చేసి.. దీపం వెలగించారు. విజయవాడలో కృష్ణా నది తీరంలో స్నానం చేసి దీపం వెలిగించారు. తన కోరికలను తీర్చాలని ఆ దేవ దేవుడిని కోరుకున్నారు.
హైదరాబాద్లో కూడా ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. ఉదయం నుంచే మహిళలు పిల్లలతో వచ్చి, దీపం అంటించారు. పంచామృతంతో అభిషేకం చేయించారు. ఆ మహాశివుడికి అభిషేకం చేశారు. శివుని నామస్మరణతో శైవ క్షేత్రాలు మారుమోగాయి.