Horoscope Today: నేటి రాశిఫలాలు(2024 June 15th)..మనోవిచారం పొందుతారు.
ఈ రోజు(2024 June 15th) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.
మేషం
సంఘంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ఈ రోజు చాలా వరకు సుఖాన్ని పొందుతారు. శుభకార్య ప్రయత్నాలు నెరవేరుతాయి. బంధు, మిత్రులతో సరదాగా ఉంటారు.
వృషభం
మనస్సు చంచలంగా ఉండడం వలన ఆందోళన చెందుతారు. దగ్గరివారితో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. అకాల భోజనం వల్ల అనారోగ్య బాధలు ఉన్నాయి. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంది.
మిథునం
శుభవార్తలు వింటారు. శుభకార్యప్రయత్నాలు నెరవేర్చుకుంటారు. కొత్త వస్తు, వస్త్ర, వాహన, ఆభరణ లాభాలను పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంది. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది.
కర్కాటకం
రుణప్రయత్నం నెరవేరుతాయి. క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోరాదు. కుటుంబంలో కలతలు ఏర్పడే అవకాశం ఉంది. చెడు సహవాసం వైపు వెళ్లకుండా ఉండాలి. సన్నిహితులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. అనారోగ్య బాధలు ఉన్నాయి.
సింహం
కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. విదేశయాన ప్రయత్నాలు నెరవేరుతాయి. మనోవిచారం పొందుతారు. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంది. నూతన కార్యాలు వాయిదా వేసుకోక తప్పదు.
కన్య
ఆత్మీయుల సహకారం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు అధికం అవుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. అజీర్ణ బాధలు ఉంటాయి. కీళ్లనొప్పుల బాధలు పెరుగుతాయి.
తుల
వృత్తిరీత్యా ఇబ్బందులు తొలగిపోతాయి. మానసిక ఆందోళన ఉంటుంది. స్త్రీలు చేసే వ్యవహారాల్లో సమస్యలు ఉంటాయి. ఆకస్మిక ధననష్టం ఉంటుంది. మీరు తీసుకునే ఆలోచనల పట్ల శ్రద్ధ అవసరం.
వృశ్చికం
రుణప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో అనారోగ్య బాధలు ఏర్పడే అవకాశం ఉంది. బంధు, మిత్రుల సహాకారం అందదు. చేసే పనుల్లో ఇబ్బందులు వస్తాయి.
ధనుస్సు
మీమీరంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభం ఉంది. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. గౌరవ, మర్యాదలకు ఎలాంటి భంగం వాటిల్లదు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి.
మకరం
స్థానచలనం కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇంటిలో మార్పును కోరుకుంటారు. ఇతరుల విమర్శలకు బాధపడుతారు. ధనవ్యయం అయ్యే అవకాశం ఉంది. రుణప్రయత్నాలు చేస్తారు.
కుంభం
కుటుంబంలో సంతోషాలు ఉంటాయి. ధనధాన్యాభివృద్ధి ఏర్పడుతుంది. ప్రయత్న కార్యాలు అన్ని ఫలిస్తాయి. ఇంటిలో జరిగే మార్పులు సంతృప్తినిస్తాయి. ప్రయాణాలు వలన లాభాలు ఉన్నాయి.
మీనం
అనారోగ్య బాధలు ఉన్నాయి. కొత్త పనులతో ఆటంకాలున్నా సత్ఫలితాలు పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వృత్తి, వ్యాపార రంగాల్లో ధననష్టం ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండాలి.