»Horoscope Today Todays Horoscope 2024 April 7th Astrology
Horoscope Today: నేటి రాశిఫలాలు(2024 April 7th).. కుటుంబంలో కలహాలు ఏర్పడుతాయి.
ఈ రోజు(2024 April 7th) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.
మేషం
పూర్తి ఆరోగ్యంతో ఉంటారు. నూతన వస్తు, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. రుణబాధలు పోతాయి. ధైరసాహసాలతో పనులు మొదలు పెడుతారు. ధనలాభం ఉంది.
వృషభం
ప్రయాణాలు చేస్తారు. సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్తగా పడాలి. ఆకస్మిక ధననష్టం ఏర్పడుతుంది. కొన్ని కార్యక్రమాలు వాయిదా వేసుకోవాలి. అనారోగ్యబాధలు అధికమౌతాయి.
మిథునం
మీమీ రంగంలలో జాగ్రత్తగా ఉండటం మంచిది. పిల్లలపట్ల శ్రద్ధవహించాలి. స్వల్ప అనారోగ్య బాధలు ఏర్పడుతాయి. కలహాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. భయానికి లోనవుతారు.
కర్కాటకం
సన్నిహితులతో జాగ్రత్తగా మెలగాలి. అనుకోని కలహాలు ఏర్పడుతాయి. రుణప్రయత్నాలు ఫలిస్తాయి. మొదలుపెట్టిన పనులకు అవరోదాలు ఎదురవుతాయి. కుటుంబ విషయాల్లో మార్పులు గమనిస్తారు.
సింహం
అనుకున్నది జరగదు. అనారోగ్య బాధలు అధికమౌతాయి. టైమ్‌కు తినడానికి ప్రయత్నిస్తారు. మీ మనస్థత్వం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. పిల్లలపట్ల శ్రద్ధ అవసరం.
కన్య
స్త్రీల వలన ధనలాభం ఉంది. శుభకార్యల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. మీమీరంగాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆత్మీయులను కలవాలనే ప్రయత్నం విఫలమవుతుంది. కొన్ని విషయాల్లో ఆందోళన చెందుతారు. వృథా ప్రయాణాలు ఎక్కువ చేస్తారు.
తుల
శుభవార్త కోసం ఎదురుచూస్తారు. మీమీ రంగాల్లోనివారికి అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభం ఉంది. రాజకీయరంగంలో మంచి అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు విజయం సాధిస్తారు. సన్నిహితులను కలుస్తారు.
వృశ్చికం
మనసుకు నచ్చిన వ్యక్తులను కలుస్తారు. భయాందోళనలు దూరమవుతాయి. కావల్సినవారితో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. శతృబాధలు వేదిస్తాయి. అప్పు అనుకున్న సమయంలో అందదు. కుటుంబంలో కలహాలు ఉంటాయి.
ధనుస్సు
మంచి వార్తలు వింటారు. సన్నిహితులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ధనలాభాన్ని పొందుతారు. కొత్త వస్తు, ఆభరణాలను ఖరీదు చేస్తారు. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి.
మకరం
మొదలుపెట్టిన పనులు ఆలస్యంగా పూర్తి అవుతాయి. అకాల భోజనం వల్ల అనారోగ్యాన్ని పొందుతారు. ఒక విషయం మిమ్మల్ని మనస్తాపానికి గురిచేస్తుంది. వీలైనంతవరకు సత్యమే చెప్పండి. భయాందోళనలకు లోనవుతారు.
కుంభం
కొత్త పరిచయాలు అంత మంచివి కావు. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అపకీర్తి రాకుండా జాగ్రత్తగా ఉండాలి. మానసిక శాంతిని పొందుతారు. సోదరులతో కలహాలు ఏర్పడే అవకాశం ఉంది.
మీనం
మంచి పేరు తెచ్చుకుంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఇతరులకు ఉపకారం చేస్తారు. అప్పులు తొలగిపోతాయి. శత్రుబాధలు పెద్దగా ఉండవు. ధనలాభం ఉంటుంది.