AP: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏటా వైభవంగా జరుగుతుంటాయి. ఇందులో వివిధ వాహనాలపై ఊరేగే ఉత్సవమూర్తులు కిలోల కొద్దీ బంగారు, వజ్ర ఆభరణాలతో దర్శనమిస్తుంటారు. క్రీ.శ 966లో జరిగిన తొలి బ్రహ్మోత్సవంలో దాదాపు 207 గ్రా. స్వర్ణాభరణాలతో మాత్రమే శ్రీవారు దర్శనమిచ్చారని చరిత్ర. ఈ ఏడాదిలోనే భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని తొలిసారి శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు.