తండ్రి లేడు.. తల్లి కూలీ పనులు చేస్తూ కష్టపడి చదివిస్తోంది. బుద్ధిగా చదువుకుంటున్న అమ్మాయిని తోటి విద్యార్థులు కన్నేశారు. ఆమెను ఆట పట్టించడం మొదలుపెట్టారు. ఆమెకు ప్రలోభాలు చూపించి లొంగ దీసుకున్నారు. పెళ్లి చేసుకుంటామని మాయమాటలు చెప్పి అఘాయిత్యానికి పాల్పడ్డారు. కాళ్లు మొక్కుతా వదిలేయండి అని బతిమిలాడినా వినలేదు. అడవికి తీసుకెళ్లి ఒక్కరు కాదు ఏకంగా ముగ్గురు అత్యాచారం చేశారు. పాశవికంగా ప్రవర్తించడ...
ఏపీలోని పల్నాడు జిల్లా లో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వెల్దుర్తి మండలంలోని ఉప్పలపాడు దగ్గర పెళ్లి కారును టిప్పర్ లారీ డీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలకి చేరుకుని పరిశీలించారు. అతి వేగమే ఈ ప్రమాదన్నికి కారణమని తెలుస్తుంది. కేసు నమోదు చేసుకుని...
ప్రేమ కోసం ఎంతటి సాహసమైనా చేయాలని అనిపిస్తుంది. ఇక మనసుకు నచ్చిన వాళ్లు చెబితే ఎంతటి పనులనైనా చేయడానికి వెనుకాడం. ఇక అమ్మాయి కోరితే అరక్షణంలో తీసుకుని ఇచ్చే ప్రియులు కూడా ఉంటారు. అట్లాంటి వ్యక్తే మహారాష్ట్రలోని థానే జిల్లాకు చెందిన 19 ఏళ్ల యువకుడు. ప్రేయసి కోసం దొంగతనాలకు అలవాటు పడ్డాడు. ప్రేయసి కోరిందల్లా తీసుకొచ్చి ఇచ్చేందుకు బైక్ దొంగతనాలు చేసి వాటిని అమ్మితే వచ్చిన డబ్బుతో ఆమె కోరికలన్నీ తీ...
కూతురు వయసయ్యే బాలికపై అత్యాచారం చేసి ఆపై బాలికను కర్కశంగా హత్య చేసిన నిందితుడికి ఉరి శిక్ష ఖరారైంది. మానవత్వం లేకుండా అభంశుభం తెలియని బాలికపై పాశవికంగా ప్రవర్తించిన నిందితుడికి ప్రకాశం జిల్లా కోర్టు మరణశిక్ష వేస్తూ సంచలన తీర్పునిచ్చింది. ఘటన జరిగిన రెండేళ్లకు అతడికి శిక్ష పడింది. ప్రకాశం జిల్లాలో 8 సంవత్సరాల బాలికపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన సంఘటన సంచలనం రేపిన విషయం తెలిసిందే. కేసు నమోదు చ...
దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. గణతంత్ర వేడుకలు అట్టహాసంగా నిర్వహించాల్సిన అధికారి కార్యాలయంలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. అయితే వ్యక్తిగత కారణాలతో బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తున్నది. జీవితంపైనే విరక్తితో అఘాయిత్యానికి పాల్పడుతున్నట్లు రాసుకున్న లేఖలో ఆయన తెలిపాడు. అనారోగ్య సమస్యలు భరించలేక అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్...
Crime News : తమ దగ్గర తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వలేదని 16 ఏళ్ల బాలుడిని కొందరు యువకులు చంపేశారు. ఈ ఘటన ఢిల్లీలోని షాహ్ బాద్ డెయిరీ ఏరియాలో చోటు చేసుకుంది. వాళ్లు 16 ఏళ్ల బాలుడికి రూ.18 వేలు ఇచ్చారు. చాలా రోజులు అయినా ఆ బాలుడు వాళ్లకు డబ్బులు తిరిగి ఇవ్వలేదు. దీంతో అతడిపై కక్ష పెంచుకున్న ఆ యువకులు అదును చూసి చంపేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు […]
పెళ్లికి సమయం ముంచుకొస్తుంది. ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి.. పనులు వేగవంతం చేయాలని వరుడు కూడా ఓ చేయి వేశాడు. కుటుంబసభ్యులతో పాటు అతడు పనులు చేస్తున్నాడు. ఎన్నో ఆశలతో వివాహ బంధంలోకి అడుగుపెడుతున్న ఆ యువకుడు కొద్దిసేపటికే కుటుంబాన్ని మొత్తం కన్నీటిలో ముంచి వెళ్లిపోయాడు. అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కన్నుమూశాడు. ఆనందాలు సంతోషాలతో నిండాల్సిన ఆ ఇంట్లో గుండెశోకం మిగిలింది. ఈ సంఘటన తెలంగాణలోని ఆదిలాబ...
సినీ పరిశ్రమలో అవకాశాల కోసం వందలు, వేల మంది రోజు తిరుగుతుంటారు. ఎవరైనా కథ వినకపోతారా? ఎవరైనా సినిమాల్లోకి తీసుకోకపోతారా? ఎవరైనా అవకాశం ఇవ్వకపోతారా? అంటూ ఫొటోలు, కథలు, రచనలు పట్టుకుని స్టూడియోలు, ప్రొడ్యూసర్, హీరోహీరోయిన్ల కోసం గాలిస్తుంటారు. ఈ సందర్భంగా కొందరి ఇళ్ల వద్ద పడిగాపులు కాస్తుంటారు. అపాయింట్ మెంట్ కోసం కాళ్లరిగేలా తిరుగుతారు. అలాంటి అమాయకులను కొందరు మోసగాళ్లు చాలా సులువుగా మోసం చేసేస్...
మంచి ఉద్యోగం.. అందమైన భార్య. పెళ్లయి ఆర్నెళ్లు దాటింది. మిగతా అన్ని పనులు చూసుకుని తీరిగ్గా హనీమూన్ కు వెళ్దామని పక్కాగా ప్రణాళిక వేసుకున్నాడు. మలేసియాలో జాలీగా గడిపి వద్దామని ఆ యువకుడు కలలు గన్నాడు. అనుకున్నట్టే హనీమూన్ కోసం మలేసియా వెళ్లాడు. బాలీలో భార్యతో కలిసి సరదాగా తిరుగుతుండగా విధి కాటేసింది. రాకాసి సముద్రం అతడిని పొట్టన పెట్టుకుంది. ఎన్నో ఆశలతో వెళ్లిన ఆ యువకుడు శవమై హైదరాబాద్ కు చేరుకు...
అమెరికాలోని సియాటిల్ నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు యువతి ప్రాణాలు కోల్పోయింది. వేగంగా వచ్చిన పోలీస్ వాహనం ఢీ కొట్టడంతో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు స్పందించి అంబులెన్స్ లో యువతిని హాస్పిటల్ కి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. బాధితురాలు కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన కందుల జాహ్నవిగా గుర్తించారు. ఈమేరకు ప్రమాదం విషయాన్ని జాహ్నవి కుటుంబ సభ్యులకు అధికారుల...
మహారాష్ట్రలో 451 మంది ఖైదీలు మిస్ అయ్యారు. కరోనా సమయంలో ఖైదీలు పెరోల్ పై విడుదలయ్యారు. ఆ సమయంలో కోర్టు ఆదేశాల మేరకు వారిని జైలు నుంచి రిలీజ్ చేశారు. అందులో చాలా మంది పెరోల్ గడువు ముగిసినా కూడా ఇంకా జైలుకు రాలేదు. ఖైదీలు ఇదే మంచి సమయం అనుకుని పరారయ్యారని సమాచారం. అదృశ్యమైన 451 మంది ఖైదీలలో 357 మంది ఖైదీలపై పోలీసులు ఇప్పటికే కేసులు నమోదు చేశారు. వారి ఆచూకీ కోసం తీవ్రంగా […]
మెదక్ జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. చేగుంట మండలం చిన్న శివనూరు గ్రామంలో అర్దరాత్రి గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరు సజీవ దహనం అయ్యారు. గ్రామానికి చెందిన, పిట్టల అంజమ్మ తన ఇద్దరు కుమారులతో కలసి హైదరాబాద్‌లో నివాసం ఉంటుంది. నిన్న మనవరాలు మధు తో కలిసి పెన్షన్, రేషన్ బియ్యం కోసం గ్రామానికి వచ్చింది. అర్ధరాత్రి గ్యాస్ సిలిండర్ పేలి భారీ శబ్దం రావడంలో భయాందోళనకు గురుయ్యారు. వెంటనే పోలీసులు, అగ్నిమా...
ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో నాలుగంతస్థుల బిల్డింగ్ కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మరికొందరు బిల్డింగ్ శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. లక్నోలోని, హజ్రత్ గంజ్ ప్రాంతంలోని ఒక నాలుగంతస్థుల భవనం మంగళవారం రాత్రి కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నారు. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు, జాతీయ విపత్తు నిర్వహణా బృందాలు సహాయక చర్యలు ప్రారంభించాయి. ఇప...
మహారాష్ట్రలోని పూణె సమీపంలో ఉన్న భీమా నది తీరంలో విషాదం చోటు చేసుకుంది. భీమా నది ఒడ్డున ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురి మృతదేహాలు లభ్యం కావడం స్థానికంగా సంచలనం సృష్టించింది. భీమా నది తీరంలో మృతదేహాలు ఉన్నాయనే సమాచారం అందండంతో పోలీసులు అక్కడికి చేరుకొని విచారణ ప్రారంభించారు. నది తీరంలో నాలుగు మృతదేహాలు తేలుతూ కనిపించాయి. ఆ తర్వాత కొంత సేపటికి మరో మూడు మృతదేహాలు కనిపించాయి. వీళ్లంతా ఒకే ఫ్యామిలీకి...
ఓ వ్యక్తి పెళ్లి చేసుకుంటా అని ఓ మహిళకు మాటిచ్చాడు. మాయ మాటలు చెప్పి తనతో సహజీవనం చేశాడు. ఇద్దరూ కొన్ని రోజులు కలిసే ఉన్నారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ.. ఆ మహిళను పక్కన పెట్టడం ప్రారంభించాడు అతడు. పెళ్లి చేసుకో అంటే మాట దాటేశాడు. చివరకు ఏం చేయాలో తెలియక తన గోడును కలెక్టర్ కు విన్నవించుకుంది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో చోటు చేసుకుంది. పాల్వంచలో నివాసం ఉండే […]