»Son In Law Of A Butcher Who Cut His Wife And Aunt To Death
Kurnool : భార్య, అత్తను నరికి చంపిన కసాయి అల్లుడు
కర్నూలు జిల్లా(Kurnool)లో దారుణం జరిగింది.పెళ్లైన రెండు వారాలకే కట్టుకున్న భార్య, అత్త, మామల పై అల్లుడు (Son-in-law) విచక్షణరహితంగా కత్తితో దాడి చేశాడు. నవ వధువు కాళ్ల పారాణి సైతం ఇంకా ఆరలేదు. ఇంతలో కుటుంబ కలహాలు వచ్చాయి. పట్టుమని 14రోజులు గడవకముందే ఏకంగా భార్యను అడ్డువచ్చిన అత్తను కత్తితో నరికి చంపేశాడు(killed). కాళ్లు కడిగి కన్యాదానం చేసిన మామపైనా దాడికి తెగబడ్డాడు.
కర్నూలు జిల్లాలో(Kurnool) దారుణం జరిగింది.పెళ్లైన రెండు వారాలకే కట్టుకున్న భార్య, అత్త, మామల పై అల్లుడు (Son-in-law) విచక్షణరహితంగా కత్తితో దాడి చేశాడు. నవ వధువు కాళ్ల పారాణి సైతం ఇంకా ఆరలేదు. ఇంతలో కుటుంబ కలహాలు వచ్చాయి. పట్టుమని 14రోజులు గడవకముందే ఏకంగా భార్యను అడ్డువచ్చిన అత్తను కత్తితో నరికి చంపేశాడు(killed). కాళ్లు కడిగి కన్యాదానం చేసిన మామపైనా దాడికి తెగబడ్డాడు. స్థానికులు అడ్డుకోవడంతో మామ కాస్త ప్రాణాలతో బయటపడ్డారు. కర్నూలు చింతల మునినగర్కు చెందిన శ్రావణ్ హైదరాబాద్లో ఓ బ్యాంకులో పనిచేస్తున్నాడు. తెలంగాణలోని వనపర్తికి (Vanaparthi) చెందిన వెంకటేశ్వర్లు,రమాదేవి(45) దంపతులు రుక్మిణి(21) అనే కుమార్తెతో కలిసి సుబ్బలక్ష్మీనగర్లో నివాసం ఉంటున్నారు.
జంటకు మార్చి 1న వనపర్తిలో కుటుంబ సభ్యులు అంగరంగ వైభవంగా పెళ్లి (Wedding) జరిపారు. ఈ దాడిలో అక్కడికక్కడే భార్య రుక్మిణి, అత్త రమాదేవిలు ప్రాణాలు విడిచారు. అయితే వారిని కాపాడుకునేందుకు ప్రయత్నించిన మామ వెంకటేశ్వర్లుపైనా శ్రవణ్ కత్తితో దాడికి పాల్పడ్డాడు. దీంతో మామ తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంకటేశ్వర్లును ప్రభుత్వ ఆసుపత్రికి (hospital) తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు(Doctors) తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న డీఎస్పీ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.