పెళ్లిలో సంతోషంగా ఉండగా.. ఇలా సందర్భం లేదు.. ఏదీ లేదు అకస్మాత్తుగా గుండెపోటు రూపంలో మృత్యువు వచ్చేస్తోంది. అందరి ఇళ్లల్లో తీవ్ర విషాదం నింపుతోంది. ఓ యువకుడు డీజే (DJ Sounds) శబ్ధాలకు తట్టుకోలేక మృత్యుబాట పట్టాడు. అపరిమిత డీజే సౌండ్ ను తట్టుకోలేక పెళ్లయిన రోజే అతడు కన్నుమూశాడు. దీంతో ఆ పెళ్లింట తీవ్ర విషాదం నిండింది.
హర్యానా(haryana)లోని అంబాలా యమునా నగర్-పంచకుల(Yamuna Nagar -Panchkula) హైవేపై ఘోర రోడ్డు(road accident) ప్రమాదం సంభవించింది. వెనుక నుంచి లోడుతో వేగంగా వెళుతున్న ట్రైలర్ ట్రక్కు.. బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా, మరో నలుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇండోనేషియా(Indonesia)లో రాజధాని జకర్తా(jakarta) పరిధిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ఇంధన నిల్వ డిపోలో సంభవించిన ప్రమాదంలో 17 మంది(17 people) మృతి(died) చెందగా..మరో 50 మందికిపైగా గాయాలయ్యాయి.
నిమిషాల వ్యవధిలో ఇద్దరు కార్మికులు మృతి చెందడం తోటి కార్మికులను దిగ్భ్రాంతికి గురి చేసింది. వెంటనే పనులు ఆపేసి వారు పక్కకు వెళ్లిపోయారు. మృతుడు రాజు నిజామాబాద్ లోని వినాయకనగర్ లో తల్లిదండ్రుల వద్ద ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ బతికేవాడు. ఇంకా పెళ్లి కాలేదు.
పెద్దా లేదు.. చిన్న లేదు.. వయసుతో సంబంధం లేకుండా గుండె చప్పుడు (Heart Beat) ఆగిపోతున్నది. ఇటీవల ఇలాంటి సంఘటనలు చూస్తుంటే హృదయం ద్రవిస్తోంది. జిమ్ చేస్తుండగా.. నడుస్తుండగా.. ఆట ఆడుతుండగా.. పెళ్లిలో సంతోషంగా ఉండగా.. ఇలా సందర్భం లేదు.. ఏదీ లేదు అకస్మాత్తుగా వస్తున్న మృత్యువు వారి ఇళ్లల్లో తీవ్ర విషాదం నింపుతోంది.
హైదరాబాద్ లో (Hyderabad) భారీగా స్టెరాయిడ్ ఇంజక్షన్స్ పట్టుబడ్డాయి. జిమ్ కు వెళ్తోన్న యువకులే టార్గెట్ గా మాఫియా రెచ్చిపోతుంది. ఈ ఇంజక్షన్ (injection) ద్వారా తక్కువ సమయంలో శరీరాన్ని అనుకున్న ఆకృతిలో తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. బాడీ ఫిట్ నెస్ కోసమంటూ ఇంజెక్షన్లను అంటగడుతోంది. పక్కా సమాచారంతో దాడులు చేసిన అధికారులు భారీగా స్టెరాయిడ్ (Steroid) ఇంజెక్షన్లను పట్టుకున్నారు.
ఆంధ్రప్రదేశ్(ap) రాష్ట్రానికి పెట్టుబడల వెల్లువ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి 13 లక్షల కోట్ల రూపాయలు వస్తున్నాయని ఏపీ సీఎం జగన్(cm jagan) తెలిపారు. ఈ క్రమంలో తాజాగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ(Nitin Gadkari) ఏపీకి 20 వేల కోట్ల రూపాయలు ప్రకటించారు.
Cyber Crime : దేశంలో సైబర్ నేరాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఒకవైపు పోలీసులు, అధికారులు ప్రజలను నిత్యం ఈ విషయంలో అప్రమత్తం చేస్తున్నా కూడా... ఏదో విధంగా మోసపోతూనే ఉన్నారు. తాజాగా ఓ కంపెనీ సైబర్ నేరగాళ్లు ఉచ్చులో చిక్కి దాదాపు రూ.7లక్షలు కోల్పోయింది. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కర్ణాటకలో బీజేపీ(bjp) ఎమ్మెల్యే మాదల్ విరూపాక్షప్ప(Madal Virupakshappa) కుమారుడు ప్రశాంత్ మాదల్(Prashanth Madal) రూ.40 లక్షల లంచం(bribe) తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. లోకాయుక్త(lokayukta) అవినీతి నిరోధక శాఖ అధికారులు గురువారం సాయత్రం పక్కా ప్లాన్ ప్రకారం పట్టుకుని అరెస్ట్ చేశారు. ఆ క్రమంలో అతని కార్యాలయంలో దాదాపు రెండు కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు.
బాధితుడికి న్యాయం చేయాల్సి ఉండగా ఉల్టా అతడిపైకి తిరగబడ్డారు. బూతులు తిడుతూ.. ఎక్కువ చేస్తే లేని కేసులు నమోదు చేస్తానని హెచ్చరించారు. పైగా ఆమె ఓ మహిళ కావడం గమనార్హం. దీనికి సంబంధించిన కాల్ రికార్డ్ వైరల్ అయ్యింది.
సోషల్ మీడియా (social media) వచ్చాక కొందరి పిచ్చి వెర్రితలలు వేస్తోంది. పదిమందికీ చేరువవ్వాలన్న ఆరాటం కొందరితో పిచ్చి పనులు చేయిస్తోంది. విచక్షణ కోల్పోయి గోప్యంగా ఉంచాల్సిన వాటిని కూడా బయటపెట్టేసుకుని కష్టాలను కొనితెచ్చుకుంటున్నారు.
తీవ్ర గాయాలవడంతో బాలుడి కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. ఏం జరిగిందని ఆరా తీయగా పిల్లాడు నోరు విప్పాడు. ఈ దారుణ ఘటన విషయమై బాలుడి తల్లిదండ్రులు మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ (Mylardevpally Police Station)లో ఫిర్యాదు చేశారు. కాగా గాయాలపాలైన బాలుడిని ఆస్పత్రికి తరలించారు.
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్(Gauri Khan)పై ముంబయిలో చీటింగ్ కేసు(cheating case) నమోదైంది. ఓ వ్యక్తి తాను ప్లాట్ కోసం 86 లక్షలు చెల్లించినప్పటికీ చెప్పిన ప్రకారం ప్లాట్ అందించలేదని ఓ రియల్ ఎస్టేట్ సంస్థతోపాటు ప్రచారం చేసిన గౌరీ ఖాన్ పై కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఓ భర్త(husband) తన భార్య(wife)ను 11 ఏళ్లుగా వేధింపులకు గురి చేసినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన ఏపీలోని సత్యసాయి జిల్లా(sathya sai district)లో చోటుచేసుకుంది. న్యాయవాది(lawyer) అయిన మధుబాబు అనే వ్యక్తి అతని తల్లి సహా సోదరుని తప్పుడు మాటలు విని ఆమెను వేధించినట్లు తెలిసింది. ఈ ఘటనపై విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.