»Jagityala Korutla Mandal Suspicious Death Of Elder Sister The Younger Sister Ran Away With Her Boyfriend
Viral News: అక్క మృతి..చెల్లెలు ప్రియుడితో పరార్!
అక్క అనుమానాస్పద స్థితిలో ఇంట్లో శవం అయి కనిపించింది. అదే రోజు చెల్లెలు తన ప్రియుడితో పారిపోయింది. మరోవైపు ఇంట్లో వోడ్కా, బ్రీజర్, నిమ్మకాయలు ఉన్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Jagityala, Korutla mandal Suspicious death of elder sister. The younger sister ran away with her boyfriend
Viral News: బంధువుల ఇంటికి హైదరాబాద్(Hyderabad) వెళ్లి వచ్చే సరికి ఇంట్లో దారుణం జరిగింది. 24 ఏళ్ల గారాల కూతురు శవమై కనిపించింది. అదే రోజు చిన్న కూతురు తన ప్రియుడితో పారిపోయినట్లు సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఈ సంఘటన జగిత్యాల(Jagityala) జిల్లా కోరుట్ల(Korutla ) పట్టణం భీమునిదుబ్బ(Bhimunidubba) ప్రాంతంలో జరిగింది. ఈ రెండు ఘటనలతో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఘటనా స్థాలాన్ని పరిశీలించిన పోలీసులు కీలక పలు అనుమానాలను వ్యక్తం చేశారు. వారు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
భీమునిదుబ్బలో బంక శ్రీనివాస్‌రెడ్డి, మాధవి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కూతుర్లు దీప్తి(24), చందన, కుమారుడు సాయి ఉన్నారు. దీప్తి హైదరాబాద్‌కు చెందిన ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగి, అయితే వర్క్ ఫ్రమ్ కారణంగా ఇంటినుంచే పని చేస్తోంది. చిన్న కూతురు చందన బీటెక్ కంప్లీట్ చేసి ఇంటి వద్దే ఉంటుంది. కోడుకు బెంగళూరులో చదువుకుంటున్నాడు. బంధువుల ఇంట్లో ఒక ఫక్షన్ ఉండటంతో శ్రీనివాస్‌రెడ్డి, మాధవి ఆదివారం హైదరాబాద్‌కు వెళ్లారు. సోమవారం రాత్రి ఇద్దరి కూతుర్లతో ఫోన్ మాట్లాడారు. మంగళవారం మధ్యాహ్నం దీప్తికి ఎన్ని సార్లు ఫోన్ చేసిన లిఫ్ట్ చేయడం లేదని, చందనకు చేస్తే తన మొబైల్ స్విచ్ ఆఫ్ వచ్చింది.
ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఇంటిపక్కన వారికి ఫోన్ చేసి విషయం చెప్పారు. తీరా వారు వచ్చి చూసే సరికి దీప్తి శవమై కనిపించింది. విషయం తెలుసుకున్న వారు గుండెలు బాదుకుంటు ఇంటికి వచ్చారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ రవీందర్‌రెడ్డి, కోరుట్ల, మెట్పల్లి సీఐలు ప్రవీణ్‌కుమార్, లక్ష్మీనారాయణ, ఎస్సై కిరణ్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. దీప్తి మృతదేహం సోఫాలో పడి ఉంది. వంట గదిలో వోడ్కా, బ్రీజర్, వెనిగర్, నిమ్మకాయలు ఉన్నాయి. మరోవైపు చందన కనిపించకుండా పోవడంతో.. ఆమె ఆచూకీ కోసం పోలీసులు బస్టాండ్‌లోని సీసీ కెమెరాలను పరిశీలించగా ఓ యువకుడితో కలిసి మంగళవారం ఉదయం 5 గంటలకు నిజామాబాద్ వెళ్లే బస్సు ఎక్కినట్లు తెలుసుకున్నారు. తండ్రి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. చందన, ఆమె వెంటున్న యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలిపారు. మద్యం తాగిన తరువాత ఇద్దరు కలిసి దీప్తిని హత్య చేశారా? అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అక్క అనుమానస్పద మృతి.. బాయ్ ఫ్రెండ్‌తో కలిసి పారిపోయిన చెల్లెలు
కోరుట్ల – భీమునిదుబ్బలో నివాసం ఉండే బంక శ్రీనివాస్ రెడ్డి, మాధవి దంపతులకు ముగ్గురు సంతానం కాగా పెద్ద కూతురు దీప్తి సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ చేస్తూ వర్క్ ఫ్రం హోం చేస్తుంది. చిన్న కూతురు చందన బీటెక్ పూర్తి చేసి ఇంటి… pic.twitter.com/evy44vzLO3