మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు (Komireddy Ramulu) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో భాదపడుతున్న ఆయన అపోలో ఆస్పుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు (Komireddy Ramulu) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో భాదపడుతున్న ఆయన అపోలో ఆస్పుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన భార్య కొమిరెడ్డి జ్యోతి కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు. మెట్పల్లి 2004-2009లో జనత ఎమ్మెల్యేగా (Independent MLA) రాములు గెలిచారు. కాంగ్రెస్ అనుబంధ శాసనసభ్యుడిగా కొనసాగారు. జనతా పార్టీ నుంచి గెలిచిన.. కాంగ్రెస్ శాసనసభ్యుడిగానే రాములు పనిచేశారు. ఆ సమయంలో టీడీపీ నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు బరిలో ఉన్నారు.
కొమిరెడ్డి రాములు మున్నురు కాపు సామాజిక వర్గానికి చెందిన నేత.. నియోజకవర్గంలో ఆయనకు మంచి పట్టు ఉంది. భార్య జ్యోతి, ముగ్గురు కుమారులు ఉన్నారు. కొమిరెడ్డి కరంచంద్, విజయ్ ఆజాద్ ఉన్నారు. గత ఎన్నికల్లో బీఎస్పీ నుంచి కొమిరెడ్డి కరం పోటీ చేసి ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లో కూడా పోటీ చేయాలని అనుకుంటున్నారు. విజయ్ ఆజాద్ కూడా ఇదివరకు ప్రత్యక్ష రాజకీయాల్లో యాక్టివ్గా తిరిగారు. చిన్న కుమారుడు లండన్లో బిజినెస్ చూసుకునేవారు.
మెట్పల్లి నియోజకవర్గం (Metpally Constituency) ఆ తర్వాత జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో కోరుట్ల(Korutla) అసెంబ్లీ స్థానంలో కలిసిపోయిన సంగతి తెలిసిందే. కొమిరెడ్డి రాములు మృతిపట్ల కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు(Kalvakuntla Vidyasagar Rao) సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆయన కోరారు.