China: నౌక ఢీకొనడంతో రెండు ముక్కలైన భారీ వంతెన!

భారీ రవాణా నౌక చైనాలో ఓ వంతెనను ఢీకొంది. గ్వాంగ్జూ నగరంలోని పెరల్ నదిపై ఈరోజు ఉదయం ప్రమాదం చోటు చేసుకుంది. వంతెనను నౌక బలంగా ఢీకొనడంతో రెండు ముక్కలైంది.

  • Written By:
  • Updated On - February 22, 2024 / 04:52 PM IST

China: భారీ రవాణా నౌక చైనాలో ఓ వంతెనను ఢీకొంది. గ్వాంగ్జూ నగరంలోని పెరల్ నదిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోజు ఉదయం భారీ నౌక ఫోస్‌మన్ నుంచి గ్వాంగ్జూ వైపు వెళ్తోంది. ఈక్రమంలో లిజింగ్షా వంతెనను బలంగా ఢీకొంది. దీంతో వంతెన రెండు ముక్కలైంది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఈ నౌకలో ఎలాంటి లోడు లేదు. ట్రాఫిక్ కూడా తక్కువగానే ఉంది. అయితే ఈ ప్రమాదంలో ఒక బస్సుతో పాటు అయిదు వాహనాలు నదిలో పడిపోయాయి. ఇద్దరు వ్యక్తులు చనిపోగా మరికొందరు గల్లంతు అయ్యారు. ఈ ఘటన తర్వాత ఆ నౌక వంతెన మధ్యే చిక్కుకుపోయింది. నౌక కెప్టెన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాలింపు చర్యలు కూడా మొదలుపెట్టారు. గాలింపు పూర్తయిన తర్వాతే బాధితులు సంఖ్య పూర్తిగా తెలుస్తుందని అధికారులు చెబుతున్నారు.

ఇది కూడా చూడండి: Farmers protest: ‘ఛలో ఢిల్లీ’కి రెండు రోజులు బ్రేక్ ఇచ్చిన రైతులు.. కారణం ఇదే

Related News

Vladimir Putin: చైనాకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌.. రెండు రోజుల పర్యటన

రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ ఐదవసారి ఎన్నికైన విషయం తెలిసిందే. ఎన్నిక తరువాత తొలిసారిగా ఆయన చైనా దేశంలో పర్యటించనున్నారు. ఆ దేశ అధ్యక్షుడు ఆహ్వానం మేరకు పుతిన్ వెళ్తున్నారు.