బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన అధికార పార్టీ నేతపై పోలీసులు కేసు నమోదు(Police Case) చేశారు. మైనర్ బాలికపై అధికార పార్టీ నేత అఘాయిత్యానికి పాల్పడిన ఘటన కామారెడ్డి జిల్లా(Kamareddy District) ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలో చోటుచేసుకుంది. గండిమాసాని పేట్ గ్రామానికి చెందిన 16 ఏళ్ల మైనర్ బాలికపై బీఆర్ఎస్ పార్టీ(BRS) నేత జగన్ గౌడ్(Jagan Goud) అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీ(BRS) నేత జగన్ గౌడ్ (Jagan Goud)కు ఇటుకల బట్టీలున్నాయి. ఆ ఇటుక బట్టీలోకి పనిచేయడానికి వచ్చిన మైనర్ బాలికను జగన్ గౌడ్ అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడు జగన్ గౌడ్ మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా పనిచేసినట్లు సమాచారం. నిందితుడిది అధికార పార్టీ కావడంతో ఇంత వరకూ కేసు నమోదు కాలేదని, అతనిపై ఆలస్యంగా కేసు నమోదు(Case File) చేసినట్లు పోలీసులు తెలిపారు.
నిందితుడు జగన్ గౌడ్(Jagan Goud)పై నాయకుల ఒత్తిడి వల్ల పోలీసుల ఆలస్యంగా కేసు నమోదు చేసినట్లు బాధితులు తెలుపుతున్నారు. జగన్ గౌడ్ పై ఫోక్సో, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో కేసును వాపసు తీసుకోవాలని స్థానిక నాయకుల నుంచి బాలిక కుటుంబానికి బెదిరింపులు వస్తున్నట్లు బాధిత కుటుంబీకులు తెలుపుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.