Electric shock: సిద్ధిపేట జిల్లాలో తండ్రి, కొడుకులు చనిపోయారు. పొలం గట్టుపై తెగిపడిన విద్యుత్ తీగను తాకి తండ్రి చనిపోగా.. అతన్ని వెతుకుతూ వెళ్లిన కొడుకు అదే తీగ తగిలి దుర్మరణం చెందాడు. గజ్వేల్ మండలం జాలిగామకు కనకయ్య వరిమడిలో నీరు ఉన్నాయా లేదా అని చూడటానికి టార్చ్‌లైట్ పట్టుకొని తెల్లవారుజామున 5 గంటలకు పొలానికి వెళ్లాడు. గట్టుపై తెగిపడి ఉన్న ఎల్టీ తీగను చూడకుండా తాకడంతో షాక్ కొట్టింది.
తండ్రి వెళ్లి చాలా సమయం అయ్యిందని, పెద్ద కుమారుడు భాస్కర్ ఫోన్ చేశాడు. తండ్రి లిఫ్ట్ చేయలేదు. కాల్ లిఫ్ట్ చేయట్లేదని తమ్ముడు కరుణాకర్‌కి చెప్పి.. ఇద్దరు కలిసి పొలంకి వెళ్లారు. గట్టు మీద ఉన్న తీగను చూడకుండా భాస్కర్ అదే తీగ తగిలింది. అతనితో వెళ్లిన పెంపుడు కుక్క కూడా ఆ తీగను తాకి చనిపోయింది. షాక్ తగిలిన వెంటనే కుక్క అరవడంతో కరుణాకర్ అప్రమత్తం అయి వెంటనే విద్యుత్‌ను ఆపేశాడు. తీగలు ఎక్కువ రోజులు కావడం వల్లే తెగి ఉంటాయని అధికారులు అంచనా భావిస్తున్నారు.