మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. 16 ఏళ్ల బాలుడు 58 ఏళ్ల మహిళపై అత్యాచారం చేసి చంపేశాడు. రేవా జిల్లాలోని కైలాష్ పురి అనే గ్రామంలో జనవరి 30న ఈ ఘటన చోటు చేసుకుంది. మహిళ నోట్లో గుడ్డను కుక్కిన ఆ బాలుడు.. తనను నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ దగ్గరికి తీసుకెళ్లి అత్యాచారం చేసి ఆ మహిళపై కొడవలితో దాడి చేశాడు.
ఆ మహిళకు పరిచయం ఉన్న బాలుడే దారుణంగా ఆమెను దారుణంగా చంపేశాడని పోలీసులు విచారణలో తేల్చారు. రెండేళ్ల కింద ఆ మహిళ ఇంటికి బాలుడు ప్రతిరోజూ వెళ్లి టీవీ చూస్తుండే వాడు. అదును చూసి ఆ మహిళ ఫోన్‌ను తస్కరించాడు. దీంతో గ్రామస్తుల మందు ఆ మహిళ.. ఆ బాలుడి పరువు తీసింది. దొంగ అనే ముద్ర వేసింది. దీంతో తనపై ప్రతీకారం తీర్చుకోవాలని సమయం కోసం ఎదురు చూశాడు. జనవరి 30 న తనను కిరాతకంగా చంపేశాడు.
తన భర్త, కొడుకు బయటికి వెళ్లిన సమయం చూసుకొని ఆ మహిళ ఇంట్లోకి దూరి తనను నిర్మాణంలో ఉన్న అదే బిల్డింగ్‌లోని ప్రాంతానికి తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టాడు. తనను చంపేసి మహిళ ఇంట్లో ఉన్న బంగారం, రూ.1000 నగదు ఎత్తుకెళ్లాడు. ఆ మహిళ కుటుంబ సభ్యులు ఆ బాలుడి మీద అనుమానం ఉన్న విషయాన్ని పోలీసులకు చెప్పడంతో అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తానే ఈ నేరం చేసినట్టు ఒప్పుకున్నాడు. దీంతో అతడి మీద కేసు నమోదు చేసి జువెనైల్ హోమ్‌కు తరలించారు.