• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

నూతన పంచాయతీ భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే

KNR: శంకరపట్నం మండలం ముత్తారం గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ ఛైర్మన్ డా. కవ్వంపల్లి సత్యనారాయణ ఘనంగా ప్రారంభించారు. ఈ భవనంతో గ్రామ సభలు, సమావేశాలు, ప్రభుత్వ పథకాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారం మరింత సులభంగా, పారదర్శకంగా జరుగుతాయని ఆయన తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు.

February 20, 2026 / 08:31 PM IST

‘నిర్ణీత సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి’

ADB: ఈనెల 22న ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించనున్న గురుకుల పాఠశాల అర్హత పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఉదయం 10 గంటల లోపు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని కో-ఆర్డినేటర్ లలిత కుమారి శుక్రవారం తెలిపారు. జిల్లాలో మొత్తం 13 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. విద్యార్థులు తమ వెంట హాల్ టికెట్, ఆధార్ కార్డును తీసుకురావాలని సూచించారు.

February 20, 2026 / 08:31 PM IST

సీఎంఆర్ఎఫ్ మంజూరు పత్రం అందజేసిన తలసాని

HYD: అనారోగ్యానికి గురైన మహిళకు CMRF మంజూరు పత్రాన్ని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అందజేశారు. సనత్‌నగర్‌లోని బీకేగూడకు చెందిన బొడ్డు స్వప్న అనారోగ్యంతో బాధపడుతోంది. CMRF దరఖాస్తు చేయగా రూ.2 లక్షల ఆర్థిక సహాయం మంజూరైంది. శుక్రవారం వెస్ట్ మారేడుపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే మంజూరు పత్రాన్ని అందజేశారు.

February 20, 2026 / 08:26 PM IST

మంత్రి తుమ్మలతో షబ్బీర్ అలీ కీలక భేటీ

కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి, రైతాంగ సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ చురుకైన అడుగులు వేస్తున్నారు. శుక్రవారం కామారెడ్డిలోని ఆయన నివాసంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వ్యవసాయ, సాగునీటి రంగాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై వారు సుదీర్ఘంగా చర్చించారు.

February 20, 2026 / 08:24 PM IST

జిల్లా వ్యాప్తంగా 19 పరీక్షా కేంద్రాల ఏర్పాటు: DIEO

ASF: ఈనెల 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల కోసం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా 19 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు DIEO రాందాస్ శుక్రవారం తెలిపారు. 5,025 మంది మొదటి సంవత్సరంలో, 4,691 మంది సెకండ్ ఇయర్ విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని తెలిపారు. ప్రతిరోజూ ఉ.9 గంటల నుంచి మ.12 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు.

February 20, 2026 / 08:23 PM IST

ఆర్టీసీ బంపర్ ఆఫర్.. ఏసీ బస్సుల్లో డిస్కౌంట్

HYD: ఎండాకాలం వచ్చేస్తోంది.. మార్చి నుంచి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముంది. దీంతో సిటీలో బయటకు వెళ్లాలంటే భయమేసే పరిస్థితులు నెలకొంటాయి. అందుకే ప్రయాణికుల కోసం ఆర్టీసీ అధికారులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. గ్రేటర్‌లో తిరిగే ఏసీ బస్సుల్లో 30 శాతం డిస్కౌంట్ ఇవ్వాలని నిర్ణయించారు. నగరంలో దాదాపు 90 ఏసీ బస్సులు సిటీలో తిరుగుతున్నాయి.

February 20, 2026 / 08:19 PM IST

వాటర్ ప్లాంట్, ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే

WGL: చెన్నారావుపేట మండలంలోని అక్కల్ చేడ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు, వాటర్ ప్లాంట్‌ను స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వంలోనే పేద ప్రజల సొంత ఇంటి కళ నెరవేరుతుందని, గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ముందుకు సాగుతుందన్నారు.

February 20, 2026 / 08:18 PM IST

కల్తీ యూరియా కలకలం.. రైతులఆందోళన

రామన్నపేట మండలంలో డీలర్ల వద్ద కొన్న యూరియా నకిలీదంటూ కొమ్మాయిగూడెం రైతులు ఆరోపించారు. ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకున్న 6 బస్తాలలో 3 తెరిచి చూడగా నల్లటి మట్టి పెళ్లల వంటివి కనిపించాయని, బరువు కూడా తక్కువగా ఉందని నరసింహ, గణేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎరువుల కొరతతో ఇబ్బందులు పడుతుంటే, కల్తీ యూరియాతో మోసం చేస్తున్నారని వాపోయారు.

February 20, 2026 / 08:16 PM IST

గురుకుల డిగ్రీ ప్రవేశాల పోస్టర్ ఆవిష్కరణ

BDK: మణుగూరు గిరిజన సంక్షేమ గురుకుల బాలుర డిగ్రీ కళాశాల 2026-27 ప్రవేశాల పోస్టర్‌ను ట్రైనీ ఐఏఎస్ సౌరభ్ శర్మ ఆవిష్కరించారు. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. కళాశాలలో ఉచిత విద్య, వసతి, భోజనం వంటి సౌకర్యాలు కల్పించబడతాయి.

February 20, 2026 / 08:16 PM IST

పెండింగ్‌ పనులను త్వరితగతిన పూర్తి చేస్తాం: GM

MNCL: బెల్లంపల్లి ఏరియా GM కార్యాలయంలో GM స్ట్రక్చర్ కమిటీ సమావేశం శుక్రవారం నిర్వహించారు. సమావేశానికి ఏరియా GM విజయభాస్కర్ రెడ్డి అధ్యక్షత వహించారు. సమావేశంలో AITUC ప్రతినిధులు కార్మికుల సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. ప్రతినిధులు లేవనెత్తిన సమస్యలపై GM సానుకూలంగా స్పందించి, నిబంధనల ప్రకారం పెండింగ్‌ పనులను త్వరితగతిన పూర్తి చేస్తానన్నారు.

February 20, 2026 / 08:15 PM IST

రంజాన్ వేళ విద్యుత్ అంతరాయం లేకుండాచూడాలని వినతి

WNP: రంజాన్ పవిత్ర మాసం ప్రారంభమైన నేపథ్యంలో ముస్లిం సోదరులు ఉపవాస దీక్షలు (రోజులు) చేపడుతున్నారు. ప్రార్థనల సమయంలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని కోరుతూ 8 వ వార్డు కౌన్సిలర్ బుసిరెడ్డి శివప్రసాద్ రెడ్డి విద్యుత్ సబ్ ఇంజనీర్‌కు వినతిపత్రం అందజేశారు. ముఖ్యంగా సెహ్రీ, ఇఫ్తార్ సమయాల్లో నిరంతర విద్యుత్ అందించాలని కోరారు.

February 20, 2026 / 08:15 PM IST

రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా దివ్యాంగ విద్యార్థులు ప్రతిభ

ASF: ఈనెల 17న ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం జరిగిన రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన దివ్యాంగ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా శుక్రవారం కలెక్టర్ హరిత విద్యార్థులను అభినందించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. తమ శారీరక పరిమితులను అధిగమిస్తూ పోటీల్లో పాల్గొని విజయాలు సాధించడం ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తుందన్నారు.

February 20, 2026 / 08:15 PM IST

ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్‌పై కలెక్టర్ సమీక్ష

SDPT: ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్‌పై జిల్లా కలెక్టర్ హైమావతి జూమ్ సమావేశంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. మండలాల వారీగా మంజూరు, గ్రౌండింగ్, నిర్మాణ దశల వివరాలు తెలుసుకున్నారు. ప్రతి ఇల్లు గ్రౌండింగ్ కావాలని ఎంపీడీవోలు ప్రణాళికతో పర్యవేక్షించాలని ఆదేశించారు. లబ్ధిదారుల ఖాతాల్లోనే నిధులు జమవుతాయని స్పష్టం చేశారు.

February 20, 2026 / 08:15 PM IST

బీజేపీ సంస్థాగత నియామకాలు

MNCL: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌లో బీజేపీ సంస్థాగత నియామకాలు చేశారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వారికి బాధ్యతలు అప్పగించారు. బీసీ మోర్చా అధ్యక్షులుగా నల్ల రవి, ఎస్సీ మోర్చా అధ్యక్షులుగా ముల్కల్ల కుమార్, బీసీ మోర్చా అధ్యక్షులుగా నాంపల్లి శ్రీనివాస్, మహిళా మోర్చా అధ్యక్ష కార్యదర్శులుగా బైరం లక్ష్మి, అంకం సంగీత నియమితులయ్యారు.

February 20, 2026 / 08:13 PM IST

మెరుగైన సేవలకై జలమండలి.. బస్తీబాట

RR: ప్రజల నుంచి నేరుగా సమస్యలు తెలుసుకునే విధంగా జలమండలి బస్తీబాట ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. జలమండలి ఎండి అశోక్ రెడ్డి శేరిలింగంపల్లి వార్డులోని శంకర్ నగర్‌లో పర్యటించారు. నీటి సరఫరా సమయంలో పలు ఇళ్లలో తనిఖీలు చేసి నీటి నాణ్యతను పరిశీలించారు. రూఫ్ వాటర్, వాన నీటిని భూమిలోకి ఇంకించే విధంగా ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని ప్రజలకు తెలిపారు.

February 20, 2026 / 08:12 PM IST