• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

‘ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలి’

NRML: జిల్లాలో నిర్వహించనున్న ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షలను ఎటువంటి లోటుపాట్లు లేకుండా ప్రశాంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఇంటర్ పరీక్షలు మార్చి 18 వరకు, పది పరీక్షలు ఏప్రిల్ 16 వరకు 47 కేంద్రాలలో జరుగుతాయని తెలిపారు. పరీక్షా కేంద్రాలలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని అన్నారు.

February 24, 2026 / 02:12 PM IST

బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించండి సారూ

MDK: నిజాంపేట మండలం నందిగామలో కుంగిన బ్రిడ్జి ప్రయాణికులకు శాపంగా మారింది. అధికారులు వేసిన తాత్కాలిక రహదారి అధ్వానంగా తయారవ్వడంతో రామాయంపేట-సిద్దిపేట మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. నిత్యం వేల వాహనాలు తిరిగే ఈ మార్గంలో భారీ వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అవుతోంది. అధికారులు తక్షణమే స్పందించి శాశ్వత బ్రిడ్జి పనులు ప్రారంభించాలని కోరారు.

February 24, 2026 / 02:07 PM IST

ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయండి: హరీశ్ రావు

SDPT: రేపటి నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నేపథ్యంలో పరీక్షలు రాసే విద్యార్థులకు మాజీ మంత్రి హరీశ్ రావు ఆల్ ది బెస్ట్ చెప్పారు. పరీక్షలు రాసే విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో రాయాలని, భయపడద్దని సూచించారు. కష్టపడి చదివిన దాన్ని ఇష్టంతో రాసి మంచి ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. మీ మంచి భవిష్యత్‌కు ఇది పునాది లాంటిదని, పరీక్షలు బాగా రాయాలని కోరారు.

February 24, 2026 / 02:05 PM IST

‘పటిష్ట బందోబస్తు మధ్య ఇంటర్ పరీక్షలు’

GDWL: ఇంటర్ పరీక్ష సెంటర్ల వద్ద ఎవరైనా అల్లరి చేసినా లేదా కాపీయింగ్‌కు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు మంగళవారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. జిల్లాలో 14 కేంద్రాల్లో జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. పరీక్ష కేంద్రాల చుట్టూ 144 సెక్షన్ అమలులో ఉంటుందని స్పష్టం చేశారు.

February 24, 2026 / 02:05 PM IST

మండలం ఏర్పాటులో గందరగోళం.. ప్రజలకు తిప్పలు

SRPT: అనంతగిరి మండలంలో రెవెన్యూ, పోలీస్ పరిధుల మధ్య సమన్వయం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2016లో 19 గ్రామాలతో మండలం ఏర్పడినా, తిమ్మాపురం, తమ్మరబండపాలెం వంటి గ్రామాల్లో గందరగోళం నెలకొంది. రెవెన్యూ పనులకు ఒకే చోట, పోలీస్ సేవల కోసం మరోచోట వెళ్లాల్సి వస్తుంది. ఈ విభజన సమస్యను పరిష్కరించి పాలనను క్రమబద్దీకరించాలని స్థానికులు కోరుతున్నారు.

February 24, 2026 / 02:03 PM IST

ఆధునిక గోదాముకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే

KNR: తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో 18,300 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన భారీ గోదాము నిర్మాణానికి మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు మంగళవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు పంట నిల్వ సౌకర్యాలు మెరుగుపరచడమే లక్ష్యమని అన్నారు.

February 24, 2026 / 02:01 PM IST

కలెక్టర్‌ను కలిసిన జిల్లా వైద్యాధికారి

కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ రవీందర్ గౌడ్ కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో వైద్య సేవలు ప్రజలకు చేరువయ్యేలా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. కామారెడ్డిని అనారోగ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని వైద్యాధికారిని కోరారు.

February 24, 2026 / 02:00 PM IST

రేపే మెగా జాబ్ మేళా

NZB: జిల్లా నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం బుధవారం ఉద్యోగ మేళా నిర్వహిస్తునట్లు జిల్లా ఉపాధి అధికారి మధుసూదన్ రావు తెలిపారు. ఇంటర్, డిగ్రీ, బీ.ఫార్మా, డీ. ఫార్మా, ఎం. ఫార్మా పూర్తి చేసిన వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ధ్రువపత్రాలతో జిల్లా ఉపాధి కార్యాలయానికి రావాలని సూచించారు. వయస్సు 18 నుంచి 35 లోపు అర్హులని వెల్లడించారు.

February 24, 2026 / 02:00 PM IST

‘భూ సమస్యల పరిష్కారంలో సర్వేయర్ల పాత్ర కీలకం’

WNP: రాబోయే రోజుల్లో ప్రజల భూసమస్యల పరిష్కారంలో లైసెన్స్డ్ సర్వేయర్ల పాత్ర కీలకమని, కాబట్టి నూతన లైసెన్సు సర్వేయర్లు నిష్పాక్షికంగా, పారదర్శకంగా వ్యవహరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. ఇవాళ జిల్లా సర్వేశాఖ ఆధ్వర్యంలో ఐడీవోసీ సమావేశ మందిరంలో నూతన లైసెన్స్డ్ సర్వేయర్లకు లైసెన్స్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

February 24, 2026 / 02:00 PM IST

కల్వకుర్తిలో న్యాయవాదుల రిలే నిరాహార దీక్ష

NGKL: న్యాయవాదులకు రక్షణ చట్టం తీసుకురావాలని కోరుతూ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కల్వకుర్తి పట్టణంలో మంగళవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, న్యాయవాదులు కృష్ణయ్య, ప్రశాంత్, జంగయ్య తదితరులు కూర్చున్నారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే న్యాయవాదుల రక్షణ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు.

February 24, 2026 / 01:43 PM IST

మహిళా భవన నిర్మాణానికి భూమి పూజ

VKB: దోమలో MLA రామ్మోహన్‌రెడ్డి సహకారంతో రూ.10 లక్షల వ్యయంతో మహిళా డ్వాక్రా వర్క్ షెడ్జ్ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించినట్లు సర్పంచ్ మాలి శివకుమార్‌రెడ్డి తెలిపారు. మహిళల స్వయం ఉపాధి అభివృద్ధికి ఈ వర్క్ షెడ్జ్ ఉపయోగపడుతుందని, మహిళా సంఘాల కార్యకలాపాలకు తోడ్పడుతుందన్నారు. వార్డు సభ్యులు, గ్రామ ప్రజా ప్రతినిధులు, నాయకులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

February 24, 2026 / 01:40 PM IST

రజక సంఘం ఆధ్వర్యంలో బెజ్జంకిలో నిరసన

SDPT: రజకులపై జరిగిన దాడిలో చిన్నారి మృతి చెందిన ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బెజ్జంకి మండల రజక సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. నిందితులను తక్షణం అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని, న్యాయం చేయాలని మండల అధ్యక్షుడు ధీటి రాజు డిమాండ్ చేశారు. వివిధ కుల సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

February 24, 2026 / 01:38 PM IST

పేద కుటుంబాలకు అండగా నిలబడతాం: ఎమ్మెల్యే

MDCL: అవసరంలో ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా వచ్చే సహాయాలను సమర్థవంతంగా అందిస్తామని మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖరరెడ్డి తెలిపారు. పేద కుటుంబాలకు అండగా నిలవడం తమ బాధ్యత అని మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ రూ. 2 లక్షల 25 వేల విలువైన ఎల్‌వోసీని అందజేశారు.

February 24, 2026 / 01:38 PM IST

గడువులోపే పనులు పూర్తి చేయాలని: ఎమ్మెల్యే

HYD: జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్దే లక్ష్యంగా చేపట్టిన పనులు ప్రజలకు సకాలంలో అందేలా నాణ్యతతో, గడువులోపే పూర్తి చేయాలని MLA నవీన్ యాదవ్ అన్నారు. మంగళవారం యూసుఫ్ గూడ క్యాంపు కార్యాలయంలో యూసఫ్‌గూడ సర్కిల్ DGM రవీంద్రనాథ్ వర్మ , బోరబండ సర్కిల్ DGM సురేష్ కుమార్ తదితరులు ఆయనను కలిశారు. ప్రజాసమస్యలపై సమన్వయంతో పనిచేస్తూ మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు.

February 24, 2026 / 01:37 PM IST

గడువులోపే పనులు పూర్తి చేయాలి: ఎమ్మెల్యే

HYD: జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్దే లక్ష్యంగా చేపట్టిన పనులు ప్రజలకు సకాలంలో అందేలా నాణ్యతతో, గడువులోపే పూర్తి చేయాలని MLA నవీన్ యాదవ్ అన్నారు. మంగళవారం యూసుఫ్ గూడ క్యాంపు కార్యాలయంలో యూసఫ్‌గూడ సర్కిల్ DGM రవీంద్రనాథ్ వర్మ , బోరబండ సర్కిల్ DGM సురేష్ కుమార్ తదితరులు ఆయనను కలిశారు. ప్రజాసమస్యలపై సమన్వయంతో పనిచేస్తూ మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు.

February 24, 2026 / 01:37 PM IST