• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షకు 317 మంది గైర్హాజరు

NRML: సోమవారం నిర్వహించిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం గణితం పత్రం–1 ఏ, వృక్షశాస్త్రం, రాజకీయ శాస్త్రం పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 7,392 మంది విద్యార్థుల్లో 7,075 మంది హాజరై పరీక్ష రాయగా, 317 మంది గైర్హాజరయ్యారని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి పరశురాం తెలిపారు.

March 2, 2026 / 03:21 PM IST

‘గుడిసె వాసులకు ఇంటి పట్టాలను ఇవ్వాలి’

HNK: గుడిసె వాసులకు ఇంటి పట్టాలను ఇవ్వాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి తోట బిక్షపతి అన్నారు. పలివెల్పులలో గుడిసె వాసులతో సీపీఐ నేతలు సమావేశం నిర్వహించి మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి ఆచరణలో అరకొర అమలు చేసి గొప్పలు చెప్పుకుంటున్నాయని, స్థానికంగా కనీస మౌలిక సదుపాయాలు సైతం కల్పించకపోవడం బాధాకరమని అన్నారు.

March 2, 2026 / 03:21 PM IST

గుంతల రోడ్డును చదును చేయించిన సర్పంచ్

NLG: దామెర భీమనపల్లిలో రహదారిపై ఉన్న గుంతలను సర్పంచ్ జిల్లా అలివేలు ఆధ్వర్యంలో పూడ్చివేయించారు. గ్రామంలోని 6వ వార్డులో రోడ్డు అధ్వాన్నంగా తయారై ప్రయాణికులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో ఆమె స్పందించారు. సొంత చొరవతో మట్టి పోయించి గుంతలను పూడ్చి రోడ్డును చదును చేయించారు. గ్రామంలో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టాలని స్థానికులు కోరారు.

March 2, 2026 / 03:19 PM IST

‘విద్యార్థులు కష్టపడి చదువు ఉత్తమ ఫలితాలు సాధించాలి’

HNK: పదవ తరగతి విద్యార్థులు కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలను సాధించాలని తహసిల్దార్ విజయలక్ష్మి అన్నారు. పరకాల గర్ల్స్ హై-స్కూల్ లోని 10వ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ చేశారు. విద్యార్థులు ఏకాగ్రతతో కష్టపడి చదవాలని, చదువు మన తలరాతను మారుస్తుందని తహసిల్దార్ అన్నారు. ఆర్ఐ దామోదర్, స్కూల్ ఇన్‌ఛార్జ్ పద్మజ, ఎస్ఎఫ్ఐ ఉపాధ్యక్షుడు కళ్యాణ్ ఉన్నారు.

March 2, 2026 / 03:19 PM IST

జిల్లా గ్రంథాలయ ఛైర్మన్‌పై అట్రాసిటీ కేసు నమోదు

SRPT: భూ రిజిస్ట్రేషన్ వివాదంలో మాజీ కౌన్సిలర్ నెమ్మది బాబుపై దాడికి పాల్పడి, కులం పేరుతో దూషించిన ఘటనలో జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ వంగవీటి రామారావు, ఆయన కుమారుడిపై కేసు నమోదైంది. బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ శిక్షణ కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై గోపాల్ రెడ్డి తెలిపారు.

March 2, 2026 / 03:16 PM IST

రాహుల్ గాంధీకి స్వాగతం పలికిన స్పీకర్

VKB: అనంతగిరిలో నిర్వహిస్తున్న డీసీసీ అధ్యక్షుల శిక్షణ శిబిరానికి విచ్చేసిన లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఎస్ఏపీ కళాశాల హెలిప్యాడ్ వద్ద ఘన స్వాగతం లభించింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, సీఎం రేవంత్ రెడ్డి, మున్సిపల్ ఛైర్‌పర్సన్ గడ్డం అనన్య ఆయనకు సాదరంగా ఆహ్వానం పలికారు.

March 2, 2026 / 03:14 PM IST

‘పనులు నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలి’

BDK: మణుగూరు మండలం రామానుజవర గ్రామ సమీపంలో ప్రధాన రహదారి గుంతలతో ప్రమాదకరంగా మారింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా తక్షణం స్పందించి 50 లక్షల వ్యయంతో మరమ్మత్తులు పనులను చేపట్టారు. ఈ పనులను సోమవారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రత్యక్షంగా పరిశీలించారు. పనులు నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

March 2, 2026 / 03:12 PM IST

ప్రజావాణిలో వినతులు స్వీకరించిన కలెక్టర్

MDK: జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. ఇటీవల కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ప్రతిమ సింగ్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వారం రోజుల్లో సమస్య పరిష్కరించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఆమెతోపాటు జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీఆర్డీవో శ్రీనివాస్ రావు, డీఆర్ భుజంగ రావు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.

March 2, 2026 / 03:12 PM IST

డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు

ఆసిఫాబాద్ జిల్లాలోని కైర్గాం జాతీయ రహదారిపై సోమవారం ద్విచక్ర వాహనం డివైడర్‌ను ఢీకొని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఒకరు గాయపడ్డారు. స్థానికులు గమనించి వెంటనే 108కి సమాచారం అందించారు. గాయపడిన వ్యక్తిని ఆసిఫాబాద్ ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. సమయానికి వైద్య సహాయం అందడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

March 2, 2026 / 03:11 PM IST

బీఆర్ఎస్ పార్టీ మీడియా సమావేశం

SRCL: వేములవాడ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఛైర్మన్ రామతీర్థపు మాధవి మాట్లాడుతూ.. మున్సిపల్ పాలకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క సమావేశం కూడా నిర్వహించకపోవడం పట్ల ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫిబ్రవరి నెలలో మున్సిపల్ సమావేశం ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు.

March 2, 2026 / 03:05 PM IST

మోడల్ స్కూల్ ప్రవేశ గడువు పొడగింపు

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌లో 6వ తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తు గడువును ఈ నెల 10 వరకు పొడిగించారు. మున్సిపల్ మాలోత్ సంగీత తెలిపిన వివరాల ప్రకారం.. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 19 నిర్వహించబడుతుంది. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు రూ.2000 నగదు బహుమతి అందజేయబడుతుంది. ఆసక్తి గల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

March 2, 2026 / 03:03 PM IST

అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం

KMM: ఖమ్మం వెలుగుమట్లలోని పేదల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చిన ఘటనలో నిరాశ్రయులైన పేదలకు న్యాయం చేయాలని సీపీఐ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య డిమాండ్ చేశారు. సోమవారం భూదాన్ బాధితులను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ పీ. శ్రీనివాసరెడ్డికి వినతిపత్రం అందజేశారు.

March 2, 2026 / 03:03 PM IST

ట్రాన్స్ జెండర్‌ల హక్కులపై అవగాహన సదస్సు

నల్గొండలోని అర్జాలబావిలో అరోరా లీగల్ సైన్సెస్ ఇన్‌స్టిట్యూట్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఇవాళ ట్రాన్స్‌జెండర్ హక్కులపై అవగాహన సదస్సు జరిగింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 21 ప్రకారం వారికి ఉన్న రక్షణలను, 2019 చట్టం ద్వారా లభించే విద్యా, ఉపాధి అవకాశాలను వివరించారు. స్మైల్ పథకం, ఆయుష్మాన్ భారత్, టీజీ ప్లస్ పథకాల గురించి వివరించారు.

March 2, 2026 / 03:02 PM IST

‘నిరుద్యోగ కళాకారులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి’

MNCL: తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నిరుద్యోగ కళాకారులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుతూ తెలంగాణ ప్రజా నాట్యమండలి సభ్యులు కోరారు. ఈ మేరకు సోమవారం మంచిర్యాల జిల్లా కలెక్టర్‌కి వినతిపత్రం అందజేశారు. రాబోయే బడ్జెట్‌లో కళాకారులకు కొంత శాతం కేటాయించి, ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడాకారుల మాదిరి రిజర్వేషన్ కల్పించాలన్నారు.

March 2, 2026 / 03:01 PM IST

ప్రజావాణిలో 345 దరఖాస్తుల స్వీకరణ

KNR: ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వెను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ప్రజల నుంచి 345 దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తుల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

March 2, 2026 / 03:00 PM IST