• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ సెల్

KNR: ప్రజల ఫిర్యాదుల తక్షణ పరిష్కారమే లక్ష్యంగా కరీంనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన నూతన రిసెప్షన్, గ్రీవెన్స్ సెల్‌ను సిపి గౌష్ ఆలం బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ట్రాఫిక్ ఉల్లంఘనలు, చలాన్లపై వాహనదారులు ఇక్కడ నేరుగా ఫిర్యాదు చేయవచ్చన్నారు. బాధితులకు నిర్ణీత కాలంలో న్యాయం చేయాలని సిబ్బందిని ఆదేశించారు.

February 25, 2026 / 06:30 PM IST

‘గ్రామాలలో మౌలిక వసతుల కల్పనకు కృషి’

SRCL: గ్రామాలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ రూరల్ మండలం వట్టెంలలో గ్రామపంచాయతీ కార్యాలయ భవన నిర్మాణం పనులకు బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం పల్లెల్లో మౌలిక సదుపాయాలు కల్పించే అంశంపై ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు.

February 25, 2026 / 06:30 PM IST

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన నిర్వహించిన ఎమ్మెల్యే

BDK: అశ్వరావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ బుధవారం విస్తృతంగా ప్రకటించారు. ముందుగా స్వయం సహాయక సంఘాల కోసం కమ్యూనిటీ భవనాల నిర్మాణాలకు శంకుస్థాపన నిర్వహించారు. అనంతరం ఇటీవల ప్రారంభించిన మంచినీటి సరఫరా పథకాన్ని ప్రారంభించారు. మాట్లాడుతూ.. నియోజకవర్గాన్ని అభివృద్ధిలో నడపడమే లక్ష్యం అన్నారు.

February 25, 2026 / 06:30 PM IST

ఇందిరమ్మ ఇళ్లతో పేదల కల నెరవేర్పు – ఎమ్మెల్యే

HNK: ఆత్మకూరు మండలంలోని పెద్దాపురం, గూడెప్పాడు, మల్కపేట గ్రామాల్లో నూతన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో బుధవారం ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి హాజరై రిబ్బన్ కట్ చేసి ఇళ్లను ప్రారంభించి, లబ్ధిదారులను శాలువాలతో సన్మానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదల సొంతింటి కల ఇందిరమ్మ ప్రభుత్వంలో నెరవేరుతోందని, అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేస్తామన్నారు.

February 25, 2026 / 06:28 PM IST

ధన్వాడ ఎస్సైగా వెంకటేష్ గౌడ్

NRPT: ధన్వాడ పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా వెంకటేష్ గౌడ్ బుధవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. మహబూబ్‌నగర్ వీఆర్ నుంచి ధన్వాడకు వెంకటేష్ గౌడ్ బదిలీపై వచ్చారు. ధన్వాడ ఎస్సై రాజశేఖర్ రాజాపూర్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయ్యారు. వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ.. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకై కృషి చేస్తానని తెలిపారు.

February 25, 2026 / 06:27 PM IST

అలంపూర్ ఎమ్మెల్యే కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

GDWL: అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు నియోజకవర్గ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తానన్నారు. ఉండవల్లి మండలం అలంపూర్ చౌరస్తా క్యాంప్ ఆఫీసులో 46 మంది లబ్ధిదారులకు రూ.4.66 కోట్ల విలువైన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. లబ్ధిదారులు చెక్కులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బీఆర్ఎస్ శ్రేణులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

February 25, 2026 / 06:27 PM IST

సర్వీస్ రోడ్డు నిర్మాణ పనులు పరిశీలించిన ఎంపీ

సంగారెడ్డి జిల్లా కొల్లూరు వద్ద నిర్మిస్తున ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ నంబర్ 2 సర్వీస్ రోడ్డు నిర్మాణం పనులను ఎంపీ మాధవనేని రఘునందన్ రావు బుధవారం పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులు పూర్తి చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం రహదారుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యమిస్తుందన్నారు.

February 25, 2026 / 06:26 PM IST

బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించాలి: కలెక్టర్

NRML: జిల్లాలో బాల్యవివాహాలు,మాదక ద్రవ్యాల వినియోగం,రోడ్డు ప్రమాదాలను పూర్తిగా నిర్మూలించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఎస్పీ జానకి షర్మిలతో కలిసి బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. గత సంవత్సరం 45, ఈ ఏడాది 2 బాల్యవివాహాలను అడ్డుకున్నట్లు పేర్కొన్నారు.

February 25, 2026 / 06:25 PM IST

కాంగ్రెస్ సీనియర్ నాయకుడిని పరామర్శించిన ఎమ్మెల్యే

MHBD: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెదగాని సోమ్మయ్య అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకొని ఇంటికి చేరుకున్న సందర్భంగా వారిని ఇవాళ పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సీ రెడ్డిలు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోని తగిన విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.

February 25, 2026 / 06:24 PM IST

క్రీడ పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు

WNP: తెలంగాణ క్రీడా స్పోర్ట్స్ స్కూల్ హకింపేట్ మరి ఆదేశాలు మేరకు జిల్లా నుంచి 10 మంది బాలురు,10 మంది బాలికలు 4వ తరగతి ప్రవేశానికి వనపర్తి జిల్లాలో ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు యువజన అధికారి సుధీర్ రెడ్డి తెలిపారు. అర్హులైన వారు ఫిబ్రవరి 26 నుంచి మార్చి 4 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. వెబ్‌సైట్లో http:/tgss.telangana.gov.in లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

February 25, 2026 / 06:24 PM IST

120 ఎకరాలు ఆయిల్ ఫామ్

MDK: నిజాంపేట మండలంలో 120 ఎకరాలలో ఆయిల్ ఫామ్ సాగు చేసేందుకు గుర్తించినట్లు లీవ్ ఫామ్ రిసోర్సెస్ కంపెనీ ఫీల్డ్ ఆఫీసర్ సుజాత తెలిపారు. నార్లాపూర్‌లో నారాయణ, లక్ష్మి రైతుల భూముల్లో ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ చేపట్టారు. ఆయిల్ ఫామ్ తోటల ప్లాంటేషన్ చేసిన రైతులు సబ్సిడీ అందజేస్తున్నట్లు వివరించారు. రైతులు ఆయిల్ ఫామ్ తోటలు సాగు చేసేందుకు ముందుకు రావాలన్నారు.

February 25, 2026 / 06:24 PM IST

పోలీసులపై మాజీ ఎమ్మెల్యే ఫైర్

NGKL: పోలీసులపై మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఫైర్ అయ్యారు. బుధవారం జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా మర్రి మాట్లాడుతూ.. ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్న పోలీసు అధికారుల పేర్లు పింక్ బుక్లో రాస్తామన్నారు. అత్యుత్సాహం చూపిన ఏ పోలీసు అధికారిని వదిపెట్టామని హెచ్చరించారు.

February 25, 2026 / 06:23 PM IST

‘విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురికావద్దు’

MNCL: పదవ తరగతి విద్యార్థులు పరీక్ష సమయంలో ఎలాంటి మానసిక ఒత్తిడికి గురికావద్దని పీఎంశ్రీ పాఠశాలల వ్యక్తిత్వ వికాస నిపుణులు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత గుండేటి యోగేశ్వర్ అన్నారు. బుధవారం భీమారంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో మాట్లాడుతూ.. పరీక్షల సమయంలో, పరీక్ష రోజు ఎలా చదవాలో జ్ఞాపకశక్తి పెంచుకునే పద్ధతులను నేర్పించారు.

February 25, 2026 / 06:20 PM IST

‘పరీక్ష రాసే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు ఉండొద్దు’

మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్ష రాసే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ మహమ్మదాబాద్ మండల కేంద్రంలోని ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పరీక్షా కేంద్రాల వద్ద అన్ని రకాల మౌలిక వసతులను ఏర్పాటు చేయాలని సూచించారు.

February 25, 2026 / 06:20 PM IST

విద్యార్థులకు ఏఐ(AI)తో స్మార్ట్ విద్యాబోధన

ADB: ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు ‘లెర్న్ స్మార్ట్ విత్ AI’ కార్యక్రమాన్ని కలెక్టర్ రాజర్షి షా ప్రారంభించారు. బుధవారం ఆదిలాబాద్ ప్రభుత్వ బాలికల ఆశ్రమ పాఠశాలలో ఐటీడీఏ, ధ్యేయ లెర్నింగ్ సొల్యూషన్స్ సంయుక్తంగా ఈ శిక్షణను చేపట్టాయి. కృత్రిమ మేధతో విద్యాబోధన విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తుందన్నారు.

February 25, 2026 / 06:19 PM IST