MLG: ఆశా వర్కర్ల శాంతియుత నిరసనలను అడ్డుకుని ముందస్తు అరెస్టులు చేయడం దుర్మార్గమని CITU జిల్లా మాజీ అధ్యక్షుడు ఎండి దావూద్ మండిపడ్డారు. ఎన్నికల ముందు వాగ్దానం చేసిన 18,000 ఫిక్స్డ్ వేతనం, హెల్త్ కార్డు, ప్రమాద బీమా హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని హెచ్చరించారు.
SRCL: లైసెన్సుడు సర్వేయర్లు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలని ఇంఛార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం 25 మంది సర్వేయర్లకు లైసెన్స్ పత్రాలు ఇంఛార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్‌తో కలిసి పంపిణీ చేశారు.
ADB: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో స్పోర్ట్స్ మీట్‌లో జిల్లాకు సంబంధించిన మహిళా కానిస్టేబుళ్లు రాణించి మూడు బంగారు, నాలుగు కాంస్య, ఒక రజత పతకం గెలుపొందడం జరిగిందని SP అఖిల్ మహాజన్ సోమవారం తెలిపారు. ఈ మేరకు మహిళా కానిస్టేబుల్‌లను అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. జాతీయస్థాయి పోటీలో సైతం రాణించాలని SP ఆకాంక్షించారు.
HYD: శేరిలింగంపల్లిలో దోమల బెడద ఎక్కువగా ఉందని స్థానికులు ఆందోళనకు దిగారు. చెరువుల్లో చెత్త ఎక్కువైపోయి, దోమలకు నిలయంగా మారిందని ఆరోపించారు. దోమల తెరతో నిరసన వ్యక్తం చేశారు. దోమల నివారణ మందు పిచికారి చేయడం మర్చిపోయారని, సిబ్బంది కూడా పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. ఇప్పటికే చాలామంది డెంగ్యూ జ్వరం బారిన పడ్డారని చెప్పారు.
KNR: శంకరపట్నం మండలం ఆముదాలపల్లి గ్రామానికి చెందిన ఎటపు సమ్మయ్య మృతి చెందగా, వారి కుటుంబానికి గ్రామ సర్పంచ్ తాళ్ల పెళ్లి మొగిలి రూ. 5,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మండల మాజీ అధ్యక్షులు పెద్ది శ్రీనివాస్ రెడ్డి, గడ్డం ఓదెలు, గ్రామపంచాయతీ సభ్యులు దొంగల మహేష్, దొంగల శ్రీనివాస్, రవి పాల్గొన్నారు.
JGL: హైదరాబాద్‌లో ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 28న జరిగే రాష్ట్ర మహిళా న్యాయవాదుల సదస్సును జయప్రదం చేయాలని కోరుతూ కోరుట్ల కోర్టు ఆవరణలో సోమవారం కరపత్రాలు, గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సదస్సులో భారత న్యాయ వ్యవస్థ, ముఖ్య న్యాయ అంశాలపై మహిళా న్యాయవాదులకు అవగాహన కల్పిస్తారని రాష్ట్ర జాయింట్ సెక్రటరీ గంగాధర్ తెలిపారు.
SRPT: కోదాడ మండలం నల్లబండ గూడెం గ్రామంలో సోమవారం అనారోగ్యంతో రామారావు మృతి చెందారు. విషయం తెలుసుకున్న కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ఆయన మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
WNP: రెవెన్యూ శాఖలో పెండింగ్‌లో ఉన్న భూభారతి దరఖాస్తులపై తహసీల్దార్ ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం వనపర్తి కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో మండల తహసీల్దార్‌లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రాబోయే వారంలోగా జీరో పెండెన్సీ లక్ష్యంతో పని చేయాలని సూచించారు.
NLG: జిల్లా డైట్ కాలేజీలో స్టాఫ్ ట్యూటర్గా జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయుడికి ‘అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్’ ఇవ్వడాన్ని ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం (జీటీఏ) తప్పుబట్టింది. ప్రభుత్వ పోస్టుల్లో స్థానిక సంస్థల ఉపాధ్యాయులను నియమించడం చట్టవిరుద్ధమని, కోర్టు తీర్పులు, సర్వీస్ రూల్స్‌కు ఇది వ్యతిరేకమని కలెక్టర్‌కు ఇవాళ ఇచ్చిన వినతిలో పేర్కొన్నారు.
RR: సాహెబ్ నగర్‌లో జలమండలి అధికారులను సరూర్ నగర్ మాజీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డ్రైనేజీలు పొంగి పొర్లుతూ ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, దుర్వాసన వెదజల్లుతుందని సమస్యలను వారికి విన్నవించారు. వెంటనే వాటిని శుభ్రపరచాలని, నిలిచిపోయిన పనులను ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.
MDK: మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (UGC) నుంచి స్వయం ప్రతిపత్తి (ఆటోనమస్) హోదా మంజూరు కావడం పట్ల జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ హర్షం వ్యక్తం చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ ప్రొ. హుస్సేన్, అధ్యాపక బృందాన్ని మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. జిల్లాలో ఉన్నత విద్యాభివృద్ధికి ఒక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు.
KMR: పిట్లం మండల కేంద్రం లో కళ్యాణ లక్ష్మి & షాదీ ముబారక్ పథకం కింద లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను సోమవారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ప్రభుత్వమే అండగా ఉంటుందన్న భరోసాను కల్పించడమే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ముఖ్య ఉద్దేశమని తెలిపారు.
RR: న్యాయవాదులపై దాడులను అరికట్టాలని ఉమ్మడి పాలమూరు జిల్లాలోని న్యాయవాదులందరూ సెక్రటేరియట్ వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా షాద్‌నగర్ న్యాయవాద బార్ అసోసియేషన్ అధ్యక్షులు వేణుగోపాల్ రావు ఆధ్వర్యంలో న్యాయవాద బార్ అసోసియేషన్ సభ్యులు పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ.. న్యాయవాద రక్షణ చట్టం అమలు చేయాలని తెలిపారు.
NLG: కొండమల్లేపల్లిలో టీడీపీ ముఖ్య కార్యకర్తల సమావేశం నియోజకవర్గ ఇంఛార్జ్ వస్కుల కృష్ణయ్య ఆధ్వర్యంలో సోమవారం జరిగింది. నల్గొండ పార్లమెంట్ అధ్యక్షుడు కసిరెడ్డి శేఖర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణలో టీడీపీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయడమే మన లక్ష్యమని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో పార్టీ శ్రేణులు ఐకమత్యంతో పనిచేయాలన్నారు.
ASF: జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నితిక పంత్ సోమవారం ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి 8 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ తెలిపారు. అనంతరం సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో మాట్లాడారు. ఫిర్యాదులు ఆన్లైన్లో నమోదు చేయాలని, వాటిపై తీసుకున్న చర్యలు ఎప్పటికప్పుడు సమీక్షించాలని అధికారులకు సూచించారు.