• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

కమాండ్ కంట్రోల్ మెయింటెనెన్స్‌కు నిధులు మంజూరు

HYD: బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని ఐకానిక్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది. మూడేళ్ల పాటు ఈ భవనాన్ని అద్దాల మేడలా మెరిపించేందుకు రూ. 8.35 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించింది. ఇందులో భాగంగా 24/7 టెక్ సపోర్ట్, మెకనైజ్డ్ క్లీనింగ్, గ్లాస్ ఫెసాడ్ మెయింటెనెన్స్ పనులు చేపట్టనున్నారు. ఈ టవర్ అంతర్జాతీయ స్థాయిలో ఉండేలా అధికారులు రూపొందించారు.

February 21, 2026 / 11:47 AM IST

మున్సిపాలిటీ బాధ్యతలు స్వీకరించిన ఛైర్మన్

SRCL: వేములవాడ మున్సిపాలిటీ నూతన ఛైర్మన్‌గా పుల్కం రాజు శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరై నూతన ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌తో పాటు కౌన్సిల్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఛైర్మన్ ప్రమాణస్వీకారం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, రాజు అభిమానులు తెలిపారు.

February 21, 2026 / 11:47 AM IST

మంచినీటి కోసం పైప్ లైన్ ఏర్పాటు

MDK: నిజాంపేట మండల పరిధిలోని షాకత్‌పల్లిలో శనివారం మంచినీటి పైప్‌లైన్ పనులను సర్పంచ్ సునీతబాబు ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకుని గ్రామంలో తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గ్రామస్థులు నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని కోరారు.

February 21, 2026 / 11:43 AM IST

‘పార్టీలకు అతీతంగా ప్రజాసేవ చేయాలి’

RR: షాద్‌నగర్ మున్సిపల్ ఛైర్మన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన బసవేశ్వర్‌ను వీర శైవ సమాజం సభ్యులు అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కులమతాలకు అతీతంగా, లింగ వర్ణ వివక్ష లేకుండా, పార్టీలకు అతీతంగా ప్రజా సేవ చేసి మున్సిపాలిటీని అత్యద్భుతంగా తీర్చిదిద్దాలని కోరారు. అన్ని వార్డులకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

February 21, 2026 / 11:40 AM IST

ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనం: KTR

HYD: SLBC సొరంగం ప్రమాదం జరిగి ఏడాదికావస్తున్నా కార్మికుల మృతదేహాలను వెలికితీయడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీమంత్రి KTR విమర్శించారు. కాంగ్రెస్ నేతలు ప్రజా శ్రేయస్సుపై శ్రద్ధపెడితే ఇలాంటి విషాదాలు జరగవని ట్వీట్ చేశారు. సంవత్సరం గడుస్తున్నా మృతదేహాల వెలికితీతలోకానీ సొరంగం పనుల్లోగాని ఎటువంటి పురోగతి లేకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వం చేతకానితనానికి నిదర్శనమన్నారు.

February 21, 2026 / 11:35 AM IST

‘మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తా’

KMM: మధిర మున్సిపల్ వైస్ ఛైర్మన్‌గా ఎన్నికైన కోన ధని కుమార్‌ని కోన వారి కుటుంబ సభ్యులు శనివారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. ప్రజల ఆశీస్సులతో సాధించిన ఈ విజయాన్ని కుటుంబ గౌరవంగా భావిస్తున్నామని వారు పేర్కొన్నారు. మధిర మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తానని కోన ధని కుమార్ స్పష్టం చేశారు.

February 21, 2026 / 11:33 AM IST

‘పని దినాల లక్ష్యం చేరుకునేలా క్షేత్రస్థాయిలో చర్యలు’

ASF: 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పని దినాల లక్ష్యం చేరుకునేలా క్షేత్రస్థాయిలో చర్యలు చేపడుతున్నామని ఆసిఫాబాద్ జిల్లా DRDO దత్తారాం శనివారం ప్రకటనలో తెలిపారు. నిత్యం ఉపాధి హామీ సిబ్బందితో సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. గడువులోగా లక్ష్యం చేధించేలా ప్రణాళికలు అమలు పరుస్తున్నామని పేర్కొన్నారు.

February 21, 2026 / 11:33 AM IST

‘ఓటరు జాబితాను సరి చేసుకోవాలి’

MDK: రామాయంపేట మండల వ్యాప్తంగా ఓటరు జాబితాలో తప్పు ఒప్పులను సరి చేసుకోవాలని తహశీల్దార్ రజనీకుమారి సూచించారు. ఓటర్ జాబితాలో చనిపోయిన వారి ఓట్లు తొలగించే కార్యక్రమం చేపడుతున్నామని, ఎవరైనా చనిపోతే బీఎల్ఓ వద్ద ఫామ్-8 ద్వారా దరఖాస్తు చేసి చనిపోయిన వారి పేరు తొలగించాలని సూచించారు. ఏవైనా తప్పు ఒప్పులు ఉంటే సరిచేసుకునే అవకాశం ఉందని అన్నారు.

February 21, 2026 / 11:27 AM IST

ఫార్మర్ రిజిస్టీకి మరో 7 రోజులే గడువు..!

NLG: ఫార్మర్ రిజిస్టీకి మరో 7 రోజులే గడువు మిగిలి ఉంది. ప్రతి రైతుకు గుర్తింపు సంఖ్యతో కూడిన కార్డులను మంజూరు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఫార్మర్ రిజిస్టీ ప్రక్రియను ప్రారంభించిన విషయం తెలిసిందే. జిల్లాలో మొత్తం 5,54,347 మంది పట్టాదారు పాసు పుస్తకాలు కలిగిన రైతులు ఉన్నారు. ఇప్పటివరకు 2,41,039 మంది రైతులు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు అధికారులు తెలిపారు.

February 21, 2026 / 11:25 AM IST

దేవాలయ అభివృద్ధికి రూ. 1,50,000 విరాళం

RR: చౌదరిగూడ మండలం లక్ష్మీదేవునిపల్లి గ్రామంలో గణపతి అభయ ఆంజనేయ, శివాలయం, రామాలయం, నవగ్రహాల ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా దేవాలయ అభివృద్ధికి దిలీప్ శర్మ అనే వ్యక్తి రూ. 1,50,000 విరాళంగా అందజేశారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక చరిత్రలో నిలిచిపోయే విధంగా అందించిన ఈ విరాళం ఆలయ నిర్మాణ పనులు, మహోత్సవ ఏర్పాట్లకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు.

February 21, 2026 / 11:25 AM IST

కోతుల దాడి.. వ్యక్తికి గాయాలు

PDPL: మంథని మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు కూచిరాజుపల్లిలో శనివారం ఉదయం 7:00 గంటలకు కోతుల దాడిలో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ఇంటి ముందు బ్రష్ చేసుకుంటున్న అంబటి రాజ్ కుమార్‌పై కోతుల మంద అకస్మాత్తుగా మూకుమ్మడి దాడి చేసింది. ఈ ఘటనలో రాజ్ కుమార్ భుజానికి, చేతులకు, కాళ్లకు గాయాలయ్యాయి.

February 21, 2026 / 11:25 AM IST

ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి: ఏఈ

SRPT: రైతులకు ప్రభుత్వ పథకాలు అందాలంటే ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని వ్యవసాయ శాఖ ఏఈ త్రివేణి అన్నారు. శనివారం గరిడేపల్లి మండలం కొండాయిగూడెంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడుతూ.. పాస్ పుస్తకం, ఆధార్, లింక్ అయిన ఫోన్ నెంబర్‌తో రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. దీనివల్ల బీమా, రుణాలు తదితర ప్రయోజనాలు కలుగుతాయన్నారు.

February 21, 2026 / 11:24 AM IST

శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ పున ప్రతిష్ట

BHPL: జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కొడవటంచలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో పున ప్రతిష్ట కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్న జీయర్ స్వామి ప్రధాన అతిథిగా పాల్గొన్నారు. ఆలయంలో పెద్ద ఎత్తున భక్తులు హాజరై పూజ, ఉత్సవ కార్యక్రమాల్లో భాగస్వామ్యమయ్యారు. ప్రత్యేక ఏర్పాట్లను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, ఈవో మహేష్ సమన్వయంతో చేపట్టారు.

February 21, 2026 / 11:23 AM IST

చెక్కు బౌన్స్ కేసులో ఏడాది జైలు శిక్ష

KMM: ఖమ్మంకు చెందిన శ్రీనివాసరావు వద్ద 2016లో రాజేంద్రప్రసాద్ రూ.10 లక్షలు అప్పు తీసుకున్నారు. తిరిగి చెల్లించేందుకు ఆయన జారీ చేసిన రూ.12 లక్షల విలువైన చెక్కులు బ్యాంక్‌లో బౌన్స్ అవ్వడంతో బాధితుడు కోర్టును ఆశ్రయించారు. కేసు విచారించిన ఖమ్మం న్యాయమూర్తి బిందు, నిందితుడికి ఏడాది జైలు శిక్షతో పాటు రూ.12 లక్షల జరిమానా చెల్లించాలని తీర్పునిచ్చారు.

February 21, 2026 / 11:22 AM IST

పేదింటి ఆడపిల్ల పెళ్లికి మేఘన పెళ్లి కానుక

WNP: పెబ్బేరు మున్సిపాలిటీలో పెదేంటి ఆడపిల్ల పెళ్లికి అండగా నిలబడాలనే సామాజిక బాధ్యతతో శనివారం నూతన మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ తన సొంత ఖర్చులతో ఎమ్మెల్యే మెగా రెడ్డి పెళ్లి కానుక అందజేశారు. ఈ పెళ్లి కానుక లో రూ.3 వేలు, పెళ్లి వస్త్రాలను అందజేశారు. ఆర్థిక సహాయం ఆ కుటుంబానికి ఎంతో కొండంత అండగా నిలిచిందన్నారు.

February 21, 2026 / 11:22 AM IST