• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

విద్యార్థులకు పరీక్షల కిట్ అందజేసిన మాజీ కార్పొరేటర్

RR: శేరిలింగం పల్లి నియోజకవర్గం హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని అలీ తలాబ్ చెరువు వద్ద ఉన్న తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్, జూనియర్ కాలేజీలో క్షత్రియ యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పదవ తరగతి, జూనియర్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు పరీక్షల కిట్ (జామెట్రీ బాక్స్, ప్యాడ్, కలములు) విద్యార్థులకు మాజీ కార్పొరేటర్ నర్నె శ్రీనివాస్ రావు అందచేశారు.

February 21, 2026 / 03:48 PM IST

ప్రమాణ స్వీకారం చేసిన బీజేపీ కౌన్సిలర్లు

NZB: బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో శనివారం ముగ్గురు బీజేపీ కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. సబ్ కలెక్టర్ వికాస్ మహాతో ఆధ్వర్యంలో 11వ వార్డు కౌన్సిలర్ కొలిపాక రేణుక బాలరాజు, 29వ వార్డు కౌన్సిలర్ రాజులదేవి లక్ష్మీ పూజిత పవన్ కుమార్, 33వ వార్డు కౌన్సిలర్ గుంత అబ్బవ్వ గంగాధర్ పదవీ బాధ్యతలు చేపట్టారు.

February 21, 2026 / 03:46 PM IST

ఆటో ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

NZB: బోధన్ పట్టణంలోని ఫైర్ స్టేషన్ ఎదురుగా శనివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం.. నిజామాబాద్ మాణిక్ బండార్‌కు చెందిన రాజ్ కుమార్ కాలినడకన వెళ్తుండగా వెనక నుంచి వచ్చిన ఆటో బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతడికి 108 సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించి, జిల్లా ఆస్పత్రికి తరలించారు.

February 21, 2026 / 03:45 PM IST

పోలీసుల అదుపులో మాజీ ఎమ్మెల్యే..!

NZB: బాన్సువాడలో శుక్రవారం రాత్రి ఘర్షణలో గాయపడ్డ కార్యకర్తలను పరామర్శించేందుకు బాన్సువాడకు వెళ్తున్న నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణను పోలీసులు భిక్కనూర్ టోల్ గేట్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను భిక్కనూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

February 21, 2026 / 03:43 PM IST

ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి: సుమన్ కుమార్

SDPT: ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించి పోలీస్ శాఖకు సహకరించాలని ఏసీపీ సుమన్ కుమార్ కోరారు. సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాళ్ ఆదేశాల మేరకు రేపటి నుంచి ఈనెల 28 వరకు రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహిస్తామన్నారు. ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించడం, ట్రాఫిక్ నిబంధనల అమలు కఠినతరం చేయడం ఈ వారోత్సవాల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.

February 21, 2026 / 03:41 PM IST

బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ దరఖాస్తు చేసుకోండి: కలెక్టర్

ఖమ్మం జిల్లాలో 2026-27 విద్యా సంవత్సరానికి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఎంపిక కోసం గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలు మార్చి 25లోగా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. స్టేట్/సెంట్రల్ బోర్డు గుర్తింపు, గత ఐదేళ్లలో 7వ, 10వ తరగతుల్లో 90% పైగా ఉత్తీర్ణత, మెరుగైన సదుపాయాలు ఉండాలని ఆయన స్పష్టం చేశారు.

February 21, 2026 / 03:38 PM IST

‘తల్లిదండ్రులు విద్యార్థులపై శ్రద్ధ చూపాలి’

NRPT: పదవ తరగతి పరీక్షలు సమీపిస్తుండడంతో పిల్లలు చదువుకునేలా ఇంటి దగ్గర తల్లిదండ్రులు శ్రద్ధ చూపాలని మీర్జాపూర్ ఉన్నత పాఠశాల హెచ్ఎం జనార్దన్ రెడ్డి సూచించారు. శనివారం మిర్జాపూర్ ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశాన్ని నిర్వహించారు. 100% ఉత్తీర్ణతకోసం ఉపాధ్యాయులు ఎంతో శ్రమిస్తున్నారని అందుకు తగ్గట్లు విద్యార్థుల తల్లిదండ్రులు శ్రద్ధ చూపాలన్నారు.

February 21, 2026 / 03:36 PM IST

ఘనంగా సేవాలాల్ మహారాజ్ జయంతి

BDK: చండ్రుగొండ మండలం పోకలగూడెం గ్రామంలో శనివారం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి భోగ్ బండారో నిర్వహించారు. ముందుగా సేవాలాల్ మహారాజ్ చిత్రపటాన్ని ఎడ్ల బండిపై ఊరేగింపు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుగులోతు బాబు నాయక్ పాల్గొని భోగ్ బండరో నిర్వహించారు. మహారాజ్ చూపించిన అడుగుజాడల్లో నడవాలని ఆయన పిలుపునిచ్చారు.

February 21, 2026 / 03:36 PM IST

మాతృభాష తీపిని ఆస్వాదించాలి: MLA నాయిని

HNK: మాతృభాష తీపిని ఆస్వాదించాలని, తెలుగు ఇతిహాసాలను చదవాలని, అమ్మ భాషను మరువవద్దని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ వేడుకలలో నిర్వహించిన వ్యాస రచన పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ఎమ్మెల్యే అభినందించారు. ఎన్ని భాషలు నేర్చుకున్నా కన్నతల్లి లాంటి మాతృభాషను విస్మరించకూడదని అన్నారు.

February 21, 2026 / 03:35 PM IST

ఇచ్చోడా డిగ్రీ కళాశాలలో ఘనంగా మాతృభాష దినోత్సవం

ADB: ఇచ్చోడా మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు విభాగం ఆధ్వర్యంలో శనివారం అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వైస్ ప్రిన్సిపాల్ సరస్వతి మాట్లాడుతూ.. ప్రతి వ్యక్తి రోజువారీ జీవితంలో మాతృభాషను నిత్యం వినియోగిస్తూ, దానిని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని, మాతృభాష పరిరక్షణ ద్వారానే మన సంస్కృతి, మన ఉనికి నిలబడుతుందన్నారు.

February 21, 2026 / 03:34 PM IST

వోల్టేజ్ సమస్య రాకుండా చర్యలు

VKB: కుల్కచర్లలో MPDO కార్యాలయం పక్కన ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ అధిక లోడ్ పడడంతో‌లో వోల్టేజ్ సమస్యతో వినియోగదారులు బాధపడుతున్నారు. వచ్చిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని అధిక సామర్థ్యం గల ఏర్పాటు చేసి కరెంటు సమస్యలను పరిష్కరిస్తామని AE నాగరాజు తెలిపారు. మండల కేంద్రంతో పాటు గ్రామాలలో కరెంటు సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

February 21, 2026 / 03:33 PM IST

‘అడుగంటుతున్న భూగర్భ జలాలు.. ఎండుతున్న పొలాలు’

MHBD: ఇనుగుర్తి మండల కేంద్రానికి చెందిన రైతు గంజి ఉప్పల్ రెడ్డి తన మూడెకరాల వ్యవసాయ భూమిలో మొక్కజొన్న పంట సాగు చేస్తున్నాడు. వేసవికాలం రాకముందే భూగర్భ జలాలు అడుగంటుతుండడంతో బావుల్లో నీరు లేక రైతుల పంట పొలాలు ఎండిపోతున్నాయి. దీంతో చేసేదేమిలేక గంటకు రూ.5వేలు వెచ్చించి, 10 గంటలకు రూ.50 వేలు ఖర్చు చేసి పొక్లైనర్ సహాయంతో పూడిక తీసినట్లు తెలిపారు.

February 21, 2026 / 03:32 PM IST

గొర్రెల, మేకల పెంపకదారుల సంఘ డైరీ ఆవిష్కరణ

KNR: మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చేతుల మీదుగా కరీంనగర్ జిల్లా గొర్రెల మేకల పెంపక దార్ల సంఘం డైరీ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మహేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి కాలువ సురేష్ యాదవ్, శంకరపట్నం మండల అధ్యక్షులు కేశవేణి రవీందర్ యాదవ్, గౌరవ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

February 21, 2026 / 03:32 PM IST

భవన నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

HNK: హన్మకొండలో మున్నూరు కాపు సంఘ భవన నిర్మాణ పనులను స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పరిశీలించారు. మున్నూరుకాపు భవనం గ్రౌండ్ లెవల్ పనులు పూర్తైన క్రమంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మాణం చేపట్టాలని, అన్ని వర్గాల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం సమాన ప్రాధాన్యతను కల్పిస్తుందని ఎమ్మెల్యే అన్నారు.

February 21, 2026 / 03:31 PM IST

ICS మల్టీకల్చరల్ ఈవెంట్‌కు ఆహ్వానం

MBNR: బ్రిస్బేన్‌లో నిర్వహించనున్న ‘ICS మల్టీకల్చరల్ ఈవెంట్ 2026’కు మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్‌కు ముఖ్య అతిథిగా హాజరుకావాలని ఆహ్వానం అందింది. నివాసంలో ICS క్వీన్స్‌లాండ్ అధ్యక్షులు సూర్యనారాయణ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి ఆహ్వాన పత్రికను అందజేశారు. తెలుగు సంస్కృతిని విదేశాల్లో చాటిచెప్పేలా కార్యక్రమం రూపొందించినట్టు పేర్కొన్నారు.

February 21, 2026 / 03:30 PM IST