• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

కష్టపడిన వారికి పార్టీలో తగిన గుర్తింపు: శ్రీనివాసరెడ్డి

ADB: కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణతో పని చేసే వారికి తగిన గుర్తింపు లభిస్తుందని ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం ఆత్మ కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన సంతోష్ రావును శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. సంతోష్ రావు పనిపట్ల నిబద్ధత కలిగిన వ్యక్తి అని పేర్కొన్నారు.

February 20, 2026 / 05:30 PM IST

రూ.10 లక్షల వ్యయంతో పనులు: ఎమ్మెల్యే

RR: నందిగామ మండలం తాళ్లగూడ గ్రామంలో హెచ్ఎండీఏ నిధుల ద్వారా రూ.10 లక్షల వ్యయంతో చేపట్టిన అండర్ డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధికి మౌలిక వసతులు అత్యంత కీలకమని, సీసీ రోడ్డు, డ్రైనేజ్, రోడ్ల అభివృద్ధి ద్వారా గ్రామ ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనం కలుగుతుందన్నారు.

February 20, 2026 / 05:27 PM IST

ఎమ్మెల్యే పాయంకు బ్రహ్మోత్సవాల ఆహ్వానం

BDK: మణుగూరు సింగరేణి ఏరియా పీవీ కాలనీలో నిర్వహించనున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును ఆలయ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా ఇవాళ ఆహ్వానించారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, స్వామివారి ఆశీస్సులతో కార్యక్రమం విజయవంతం కావాలని కమిటీ సభ్యులు తెలిపారు.

February 20, 2026 / 05:27 PM IST

కాంగ్రెస్ నేతలకు కామారెడ్డి ఎమ్మెల్యే సవాల్

KMR: కామారెడ్డిలో రాజకీయ వేడి రాజుకుంది. తనపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి కాంగ్రెస్ నాయకులకు బహిరంగ సవాల్ విసిరారు. కళాశాల ఆస్తుల వ్యవహారంపై నిజానిజాల నిర్ధారణకు శనివారం స్థానిక శిశుమందిర్ పాఠశాల వద్దకు చర్చకు రావాలని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత సంస్థల యాజమాన్యాలు కూడా పాల్గొంటాయని పేర్కొన్నారు.

February 20, 2026 / 05:25 PM IST

విద్యాలయాల్లో అభివృద్ధి పనులపై సమీక్ష

SRCL: జిల్లాలో పీఎంశ్రీ కింద ఎంపిక అయిన స్కూళ్లలో మొదలు పెట్టిన అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఇంఛార్జి కలెక్టర్ గరిమ అగర్వాల్ ఆదేశించారు. పీఎంశ్రీ కింద ఎంపిక అయిన విద్యాలయాల్లో చేపట్టిన అభివృద్ధి పనులపై జిల్లా సమీకృత కార్యాలయంలో శుక్రవారం జిల్లా విద్యాధికారి, టీజీఈడబ్ల్యూఐడీసీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వారికి పలు సూచనలు చేశారు.

February 20, 2026 / 05:20 PM IST

వార్డ్ మెంబర్లకు ముగిసిన మొదటి విడత శిక్షణ

NLG: చిట్యాల మండలం, ఉరుమడ్ల రైతు వేదికలో నూతనంగా ఎన్నికైన వార్డు మెంబర్లకు నిర్వహించిన మొదటి విడత శిక్షణ కార్యక్రమం శుక్రవారంతో ముగిసింది. ఈ కార్యక్రమానికి ఎంపీడీవో జయలక్ష్మి హాజరై మాట్లాడుతూ శిక్షణను సద్వినియోగం చేసుకొని వార్డుల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఎంపీఓ కోటేష్, ట్రైనర్ యూసుఫ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

February 20, 2026 / 05:16 PM IST

తెలంగాణలో రేవంత్‌రెడ్డి రాజ్యాంగం అమ‌లు: గొంగిడి సునీత

BHNG: భారతదేశం అంత‌టా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలవుతుంటే, తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డి రాజ్యాంగం అమలు అవుతుంద‌ని ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీత అన్నారు. శుక్ర‌వారం యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలో ఆమె మాట్లాడుతూ.. మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ దౌర్జన్యంతో అనేక మున్సిపాలిటీలో ఛైర్ పర్సన్ సీట్లను కైవసం చేసుకుంద‌న్నారు.

February 20, 2026 / 05:14 PM IST

దేవరకద్రలో బాధ్యతలు స్వీకరించిన నూతన పాలక వర్గం

MBNR: దేవరకద్ర మున్సిపాలిటీ నూతన ఛైర్మన్‌గా దమయంతి గోవర్ధన్ రెడ్డి, వైస్ ఛైర్మన్‌గా యుగంధర్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి హాజరై నూతన పాలకవర్గాన్ని అభినందించారు. పట్టణ సమగ్ర అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

February 20, 2026 / 05:11 PM IST

పునరుద్ధరణ పనులు పరిశీలించిన కలెక్టర్

KNR: జిల్లా కేంద్రంలోని పురాతన పాఠశాల పరిధిలోగల జిల్లా సైన్స్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మ్యూజియంలో పునరుద్ధరణ పనులను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. అటల్ టింకరింగ్ ల్యాబ్, రోబోటిక్ ల్యాబ్ ఏర్పాటు చేయనున్న గదులను తనిఖీ చేశారు. విద్యార్థులు తయారుచేసిన ఆర్ట్ క్రాఫ్ట్ ప్రదర్శన గురించి పలు సూచనలు ఇచ్చారు.

February 20, 2026 / 05:09 PM IST

వైభవంగా విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం

WGL: సంగెం మండలంలోని గవిచర్ల శ్రీ గుండ బ్రహ్మయ్య స్వామి దేవాలయంలో వైభవంగా విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలను నిర్వహించారు. నేడు మహోత్సవాలకు కుడా ఛైర్మన్ వెంకటరామిరెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. గవిచర్ల గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని, స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఛైర్మన్ ఆకాంక్షించారు.

February 20, 2026 / 05:08 PM IST

రైతులకు నేరుగా యూరియా ఇవ్వాలి: సీపీఎం

SRPT: సహకార సంఘాల ద్వారానే రైతులకు నేరుగా యూరియా సరఫరా చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. శుక్రవారం పెన్‌పహాడ్ మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. యాప్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. కేంద్రం ఉపాధి హామీని నిర్వీర్యం చేస్తోందని, విద్యుత్ సవరణ చట్టం కార్పొరేట్లకు మేలు చేసేలా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఉన్నారు.

February 20, 2026 / 05:08 PM IST

సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే

WNP: మదనాపురం మండలం దుప్పల్లి గ్రామానికి చెందిన బత్తుల లక్ష్మన్న కుమారుడి వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరైన రూ.లక్ష CMRF చెక్కును దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి శుక్రవారం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని, ఆపదలో ఉన్న వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

February 20, 2026 / 05:07 PM IST

మైనార్టీ కార్పొరేషన్ నుంచి రూ.60 వేల సబ్సిడీ

NRML: తెలంగాణ మైనార్టీ కార్పొరేషన్ ద్వారా తుర్క కాషా ముస్లిం సమాజానికి చెందిన రాయి కోత పనులు చేసే అర్హులకు రూ.60 వేలును 100% సబ్సిడీతో అందించనున్నట్లు మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి మోహన్ సింగ్ తెలిపారు. ఆసక్తి గల వారు మార్చి 1లోపు అవసరమైన ధ్రువీకరణ పత్రాలతో ఆన్లైన్‌లో దరఖాస్తు చేయాలని, మరిన్ని వివరాలకు జిల్లా కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

February 20, 2026 / 05:05 PM IST

మోడల్ మున్సిపాలిటీగా ఘనపూర్: ఎంపీ

JN: స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ మాడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు మనమంతా కష్టపడి పనిచేద్దామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కడియం కావ్య అన్నారు. ఘనపూర్ మున్సిపాలిటీ ప్రత్యేక సమావేశానికి వారు హాజరై మాట్లాడుతూ.. ఎన్నికలతోనే రాజకీయాలు ముగిసాయని, రాజకీయాలకు అతీతంగా అన్ని వార్డులను అభివృద్ధి చేసుకుందామన్నారు.

February 20, 2026 / 05:05 PM IST

‘నాణ్యతతో ఇంటి నిర్మాణం చేయాలి’

ADB: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా నాణ్యతతో ఇంటి నిర్మాణం చేయాలని బీజేపీ మండల అధ్యక్షుడు రాథోడ్ భిక్కు అన్నారు. శుక్రవారం నార్నూర్ మండల కేంద్రంలోని PVTGలకు మంజూరైన ఇళ్లను ఆయన పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వ అనేక పథకాలు కల్పిస్తుందని, ప్రజలు వాటిని సద్వినియోగం చేసి లబ్ది పొందాలన్నారు.

February 20, 2026 / 05:05 PM IST