మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం సాయిబాబా ఆలయం వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గమనించి వెంటనే లక్షెట్టిపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుడి వివరాలు తెలిసిన వారు 8712656546 నంబర్‌ను సంప్రదించాలని SI తహసీనుద్దీన్ పేర్కొన్నారు.
JGL: బంజారాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాలలోని బంజారా భవన్‌లో శుక్రవారం సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన బంజారా సర్పంచ్‌లను ఘనంగా సన్మానించారు.
KNR: తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ కరీంనగర్ డైరీని అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్ ఈరోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రెవెన్యూ శాఖ ఉద్యోగులు ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించేందుకు కృషి చేయాలని సూచించారు. శాఖ చరిత్ర, ముఖ్య సమాచారం, ఉపయోగకరమైన వివరాలతో డైరీని రూపొందించినట్లు తెలిపారు.
GDWL: గడువులోగా పని పూర్తి చేయకుంటే మిమ్మల్ని ఇంటికి పంపడానికైనా వెనుకాడం అని కలెక్టర్ సంతోష్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా తహసీల్దార్ అధికారులతో ఓ సమావేశం ఏర్పాటు చేశారు. ఆర్డీవో స్థాయిలోనే 1370 భూభారతి ఫైళ్లు మూలన పడటంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సామాన్యుడి కన్నీరు తుడవని రెవెన్యూ వ్యవస్థ ఎందుకని ప్రశ్నించారు.
SRD: ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. భవిత కేంద్రాలు, కస్తూర్బా పాఠశాలలో మరమత్తులను వెంటనే పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
MDCL: ఆశా కార్యకర్తల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ CITU జిల్లా నాయకులు ఫిబ్రవరి 23న నిర్వహించే “ఛలో హైదరాబాద్” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా కార్యదర్శి ఎం. రేవతి కళ్యాణి, ఉపాధ్యక్షురాలు కె. కోమలత అల్వాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెమోరాండం సమర్పించారు.
BDK: హైదరాబాద్‌లో ఇటీవల నిర్వహించిన పాఠశాల స్థాయి క్రీడా పోటీలలో పరుగు పందెంలో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించి అశ్వారావుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న కే. నాగరంజిత్ తన ప్రతిభను చాటిచెప్పాడు. పాక్షికంగా వికలాంగుడు అయినప్పటికీ చదువుల్లోను ఆటల్లోను ముందంజలో ఉండడం అతని ధైర్యసాహసాలకు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఇవాళ అభినందించారు.
BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా మూడో రోజు శుక్రవారం సాయంత్రం స్వామివారు శేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. జగత్ రక్షకుడైన శ్రీవారు ఆదిశేషులుపై తిరువీధి సేవలో మంగళ వాయిద్యాలతో, శాస్త్రీయ నృత్యాలతో, కనుల పండగగా ఊరేగించారు. భక్తులు స్వామి వారిని దర్శించి తరించారు.
MBNR: దేవరకద్ర మున్సిపాలిటీ నూతన ఛైర్‌పర్సన్‌గా దమయంతి గోవర్ధన్ రెడ్డి, వైస్ ఛైర్మన్ యుగంధర్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు. స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి హాజరై, నూతన పాలకవర్గాన్ని వారి కుర్చీలలో కూర్చోబెట్టి ప్రత్యేక అభినందనలు తెలిపారు. పట్టణ సమగ్ర అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు.
PDPL: కమాన్పూర్ PSలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న మట్ట రమేష్ తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడల్లో ప్రతిభ చాటారు. సైబరాబాద్ కమిషనరేట్లో జరుగుతున్న 4వ తెలంగాణ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ & గేమ్స్ అర్చరీ వ్యక్తిగత విభాగంలో సిల్వర్ మెడల్, టీం విభాగంలో బ్రాంజ్ మెడల్ సాధించారు. ఆయన విజయంపై ఎస్సై కొట్టే ప్రసాద్, ఏఎస్సై బాలాజీ నాయక్ అభినందించారు.
ASF: రెబ్బెన మండలంలో అక్రమ ఇసుక రవాణాను పోలీసులు అడ్డుకున్నారు. నంబాల నుంచి తక్కలపల్లికి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్‌ను శుక్రవారం పట్టుకున్నారు. ఎస్సై వెంకట కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం తనిఖీల్లో అనుమతి పత్రాలు లేకపోవడంతో వాహనాన్ని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ట్రాక్టర్ డ్రైవర్, యజమానిపై కేసు నమోదు చేశామన్నారు.
KNR: చిన్నారుల ఎదుగుదలపై తల్లిదండ్రులు ప్రత్యేక నిఘా ఉంచాలని RBSK వైద్యులు డాక్టర్ సురేశ్ సూచించారు. గంగాధర(M) ఆచంపల్లిలో సర్పంచ్ ఆరె. తేజశ్రీ ఆధ్వర్యంలో శుక్రవారం సభా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం వైద్యులు చిన్నారులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, బరువు తక్కువగా ఉన్న వారిని ఎన్ఆర్సీకి రిఫర్ చేశారు.
JGL: క్రీడలతో స్నేహ భావం పెంపొందుతుందని, ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస అన్నారు. మేడిపల్లి మండలం కల్వకోట గ్రామంలో ఉమ్మడి మేడిపల్లి మండల క్రికెట్ ప్రీమియం లీగ్ పోటీలను రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. క్రీడలతో శారీరక దారుఢ్యం మానసిక ఉల్లాసం అలవడుతుందన్నారు.
MDK: మెదక్ స్టేడియంలో సీఎం కప్-2025 సాఫ్ట్ బాల్ క్రీడలను అదనపు కలెక్టర్ నగేష్ ప్రారంభించారు. 25 జిల్లాల నుంచి 700 మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు జిల్లా యువజన క్రీడల అధికారి రమేష్ గంగాల తెలిపారు. జిల్లా అదనపు ఎస్పీ మహేందర్, జిల్లా విద్యాధికారి విజయ, సైన్స్ అధికారి రాజిరెడ్డి, సాఫ్ట్ బాల్ అసోసియేషన్ జాతీయ కార్యదర్శి శోభన్ బాబు పాల్గొన్నారు.
వనపర్తి మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన కౌన్సిలర్లను సన్మానించిన తెలంగాణ రాష్ట్ర ఏఐసీసీ అధ్యక్షులు డాక్టర్ జిల్లెల ఆదిత్య రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పట్టణాలు అభివృద్ధి చేసుకుందాం అని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విశ్వసిస్తూ ప్రజలు మరోసారి మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారని అన్నారు.