• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

జిల్లా వ్యాప్తంగా భగ్గుమంటున్న ఎండలు..!

సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. పగటి పూట ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. వేడి గాడ్పులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం నుంచే భానుడు భగ భగ మండిపోతున్నాడు. ఇళ్లలో నుంచి బయటకు రావాలంటేనే ఎండ వేడిమికి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్న పరిస్థితి. ఉదయం 9 గంటల నుంచే సూర్యుడు ఠారెత్తిస్తున్నాడు.

February 22, 2026 / 12:26 PM IST

రేపటినుండి సర్పంచులకు, వార్డు సభ్యులకు శిక్షణ

MNCL: జన్నారం మండలంలోని సర్పంచ్‌లకు, వార్డు సభ్యులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎంపీడీవో ఉమర్ షరీఫ్, ఎంపీవో జలంధర్ తెలిపారు. మంచిర్యాల మండలంలోని ముల్కాల ఐజా ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం నుంచి సర్పంచ్‌లకు శిక్షణ కార్యక్రమం ఉంటుందన్నారు. మండలంలోని 10 గ్రామాలలో నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులకు పోన్కల్ రైతు వేదికలో శిక్షణ ఉంటుందన్నారు.

February 22, 2026 / 12:24 PM IST

మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట

SRD: శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అమీన్పూర్ డివిజన్ పరిధిలో నూతనంగా ఏర్పాటవుతున్న కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని MLA గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అమీన్పూర్ డివిజన్ పరిధిలోని ప్రైడ్ పార్క్ కాలనీలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు ఫాల్గొన్నారు.

February 22, 2026 / 12:18 PM IST

మేయర్, డిప్యూటీ మేయర్ బాధ్యతల స్వీకరణ

MNCL: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా దరణి మధుకర్, డిప్యూటీ మేయర్‌గా సల్ల రమ్య మహేష్ ఆదివారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్, మాజీ డీసీసీ అధ్యక్షురాలు సురేఖ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ.. MLA సహకారంతో కార్పొరేషన్‌ను అభివృద్ధి పథంలో పయనించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.

February 22, 2026 / 12:16 PM IST

కేటీఆర్‌ను కలిసేందుకు పాదయాత్ర

MBNR: కోయిలకొండ అంకిళ్ల గ్రామానికి చెందిన కావలి రామచందర్ ముదిరాజ్ తన అభిమాన నేత కేటీఆర్‌ను కలిసేందుకు హైదరాబాద్‌కు పాదయాత్ర చేపట్టాడు. కేటీఆర్ నాయకత్వానికి గౌరవం చూపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అతడు తెలిపారు. బంజారాహిల్స్ తెలంగాణ భవన్లో ఆయన కేటీఆర్‌ను కలిసిన తర్వాత మద్దతు తెలపడం లక్ష్యమని చెప్పాడు.

February 22, 2026 / 12:15 PM IST

రేపు జిల్లాలో ప్రజావాణి యథాతథం

SRCL: జిల్లాలో ప్రజల సమస్యల సత్వర పరిష్కారం కోసం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం నుంచి ప్రజావాణి కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగించనున్నట్లు ఇంఛార్జ్ కలెక్టర్ గరిమ అగర్వాల్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

February 22, 2026 / 12:15 PM IST

నూతన ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి

JGL: ధర్మపురి మండలం దోనూరు గ్రామంలో శ్రీ సీతా లక్ష్మణ హనుమత్ సమేత రామచంద్ర స్వామి వారి నూతన ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆదివారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి రూ. 5 లక్షలు నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.

February 22, 2026 / 12:11 PM IST

‘బీజేపీ పార్టీతోనే అభివృద్ధి’

JN: బీజేపీ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ వెంకటేశ్వర్లు అన్నారు. ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఘనపూర్లో నేతలతో కలిసి వెంకటేశ్వర్లు పరిశీలించారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, ప్రజలంతా బీజేపీ వెంటే ఉన్నారని అన్నారు.

February 22, 2026 / 12:10 PM IST

దుర్బాతండాలో పర్యటించిన బోథ్ ఎమ్మెల్యే

ADB: నెరడిగొండ మండలంలోని దుర్బాతండా గ్రామంలో ఆదివారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలోనే పార్టీలు, అనంతరం అందరూ కలిసిమెలిసి ఉండాలని అన్నారు. గ్రామంలోని ప్రతి ఒక్క అర్హునికి ఇందిరమ్మ ఇళ్లు వచ్చే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

February 22, 2026 / 12:09 PM IST

ప్రజలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి: ఎమ్మెల్యే

BDK: దమ్మపేట మండలం పట్వారిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సత్తుపల్లి ప్రముఖ వైద్యశాలలు శ్రీనిధి హాస్పిటల్ , లైఫ్ కేర్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఆదివారం నిర్వహించారు. ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పాల్గొని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి రావడం సంతోషమన్నారు.

February 22, 2026 / 12:07 PM IST

కోతుల పెరుగుదలపై గ్రామస్తుల ఆందోళన

VKB: దోమలో కోతులు స్వేచ్ఛగా తిరుగుతూ స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. స్కూల్‌కు వెళ్తున్న పిల్లలు, రోడ్లపై నడిచే వాహనదారులు కోతుల దాడులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గుంపులుగా తిరిగే కోతులు ఇళ్లలోకి చొరబడి నిత్యవసర సరుకులు తీసుకెళ్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. స్థానికులు అధికారులు వెంటనే స్వైర విహారాన్ని నియంత్రించాలని కోరుతున్నారు.

February 22, 2026 / 12:03 PM IST

‘రైతు సంక్షేమానికి పెద్దపీట’

HNK: రైతు సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఛైర్మన్ జంగా రాఘవరెడ్డి అన్నారు. ఆయిల్ ఫామ్ సాగుచేస్తున్న రైతులతో రాఘవరెడ్డి సమావేశమయ్యారు. రైతులు అధిక దిగుబడులు సాధించడానికి శాస్త్రీయ పద్ధతులు, సమయానుకూల ఎరువుల వినియోగం, నీటి నిర్వహణపై అవగాహన పెంచుకోవాలని అన్నారు. అనంతరం క్యాలెండర్ ఆవిష్కరించారు.

February 22, 2026 / 12:03 PM IST

స్వచ్ఛత దిశగా అట్టేపల్లి రామప్రభు ముందడుగు

RR: మియాపూర్‌లోని 240వ డివిజన్ పెబుల్స్ బే నుంచి ప్రశాంత్ నగర్ రోడ్డు వరకు ఆదివారం ఉదయం అట్టేపల్లి రామప్రభు ఆధ్వర్యంలో ‘క్లీన్ అండ్ గ్రీన్’ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ, ప్రజల్లో తడి-పొడి చెత్త వేర్పాటుపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు అట్టేపల్లి చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ రామప్రభు తెలిపారు.

February 22, 2026 / 12:01 PM IST

జిల్లాలో డిజిటల్ సర్వేకు వాలంటీర్ల నియామకం

BHPL: భూపాలపల్లి జిల్లాలో రైతుల సాగు భూముల వివరాలు డిజిటల్ సర్వే చేసేందుకు ప్రభుత్వం వాలంటీర్లను నియమిస్తోంది. రెవెన్యూ గ్రామానికి ఒకరు చొప్పున 12 మండలాల్లో 186 మందిని నియమించేందుకు ప్రతిపాదనలు పంపినట్లు జిల్లా వ్యవసాయ అధికారి (DAO) బాబురావు తెలిపారు. భవిష్యత్తులో పంటల నమోదు డిజిటల్ విధానంలో జరుగుతుందని DAO బాబురావు వెల్లడించారు

February 22, 2026 / 12:01 PM IST

‘ఝాన్సీ రెడ్డిపై తిరుపతి రెడ్డి వ్యాఖ్యలు మానుకోవాలి’

MHBD: టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సీ రెడ్డిపై ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని కాంగ్రెస్ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అమీజ్ పేర్కొన్నారు. పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డిలు నిస్వార్ధంగా పని చేస్తున్నారని అన్నారు.

February 22, 2026 / 12:01 PM IST