ADB: ఇచ్చోడ మండలం మన్నూర్ గ్రామంలో నిర్వహించిన ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశ కార్యక్రమానికి లబ్ధిదారుని ఆహ్వానం మేరకు బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి ఆడే గజేందర్ శుక్రవారం హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన గృహ ప్రవేశ పూజల్లో పాల్గొని, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. పేదలకు గృహ వసతి కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు.
SRCL: తమ డిమాండ్ల సాధన కోసం టీజీఎస్ ఆర్టీసీ జేఏసీ ఉద్యోగుల ఛలో సెక్రటేరియట్ పోస్టర్‌ను శుక్రవారం వేములవాడ ఆర్టీసీ డిపో ఎదుట విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ జేఏసీ నాయకులు కాళిదాస్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను మర్చిపోయిందని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్నారు.
HYD: గోల్కొండ, రాజేంద్రగనర్, గండిపేట మండలాల పరిధిలో మూసీ సుందరీకరణకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అక్కడ భూములు, స్థలాలు సేకరించాల్సి ఉంది. అయితే స్థానికులు ఇందుకు ససేమిరా అంటున్నారు. తమ స్థలాలు ఎట్టిపరిస్థితుల్లోనూ ఇచ్చేది లేదని స్థానికులు అధికారులకు తేల్చి చెబుతున్నారు. ఇదిలా ఉండగా భూముల సేకరణకు సంబంధించి రెవెన్యూ అధికారులు దాదాపు 1000 నోటీసులు ఇచ్చారు.
SRD: రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ కంగ్టి మండలం చుక్కలతీర్థం మాజీ సర్పంచ్ రమేష్ పాటిల్(49) ఇవాళ మృతి చెందారు. ఈ నెల 10న పొలం పనులపై రాసోల్ వెళ్లి తిరిగి రాత్రి తడ్కల్‌కు వెళ్తుండగా ముర్కుంజాల్ శివారులో బైకు అదుపుతప్పి ప్రమాదం జరిగి తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సంగారెడ్డిలో ఆస్పత్రిలో బ్రెయిన్ ఆపరేషన్ చేసినా పరిస్థితి విషమించి మరణించారు.
NRPT: మక్తల్ మున్సిపల్ ఛైర్ పర్సన్‌గా వాకిటి మానస హన్మంతు, వైస్ ఛైర్ పర్సన్‌గా కుమారి శైవీ రెడ్డి పదవీ బాధ్యతలు ఇవాళ స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మంత్రి వాకిటి శ్రీహరి, ఆయన సతీమణి లలిత హాజరయ్యారు. కార్యాలయంలో పూజల అనంతరం ఇరువురినీ వారి వారి కుర్చీల్లో కూర్చోబెట్టి, సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.
KMM: అధికారం అంటే గద్దె మీద కూర్చోవడం కాదు, ప్రజా సమస్యల పరిష్కారమేనని మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇంఛార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఏదులాపురం 22వ వార్డులో మున్సిపల్ ఛైర్‌పర్సన్ అనిత ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఏదులాపురం అభివృద్ధికి కృషి చేస్తూ, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని సూచించారు.
VKB: వాల్యా నాయక్ తండాలో శుక్రవారం వీధి బల్బులు బిగించారు. గత కొన్ని రోజులుగా వీధి దీపాలు వెలగక ఇబ్బందులు పడుతున్నామని తండా వాసులు కోరగా సర్పంచ్ లక్ష్మీబాయి రాథోడ్ తక్షణమే స్పందించి ఈ పనులను చేపట్టారు. దీంతో తండా వాసులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రజా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.
MBNR: చిన్న చింతకుంట మండలం పల్లమర్రిలో రూ.10 లక్షల నిధులతో నిర్మించనున్న మహిళా సమైఖ్య భవన నిర్మాణానికి ఎమ్మెల్యే జీ.మధుసూదన్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా సాధికారతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, మహిళల ఆర్థికాభివృద్ధి కుటుంబ అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.
MBNR: చిన్న చింతకుంట మండలం పల్లమర్రిలో రూ.10 లక్షల నిధులతో నిర్మించనున్న మహిళా సమైఖ్య భవన నిర్మాణానికి ఎమ్మెల్యే జీ.మధుసూదన్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా సాధికారతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, మహిళల ఆర్థికాభివృద్ధి కుటుంబ అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.
JN: కడియం శ్రీహరి నైతిక విలువలు ఉంటే రాజీనామా చేయాలని మాజీ మంత్రి తాటికొండ రాజయ్య డిమాండ్ చేశారు. స్టేషన్ ఘన్పూర్ పట్టణంలో కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో శుక్రవారం స్పందించిన ఆయన, శ్రీహరి ప్రవర్తన సభ్య సమాజం సిగ్గుపడేలా ఉందని విమర్శించారు. ఎంపీ, ఎమ్మెల్సీ, ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి వంటి కీలక పదవులు అనుభవించారని పేర్కొన్నారు.
MBNR: జడ్చర్ల మున్సిపాలిటీలో అనర్హమైన, నకిలీ ఓట్లను వెంటనే తొలగించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి మున్సిపల్ కమిషనర్‌కు కీలక ఉత్తర్వులు అందాయి. పట్టణంలోని 4వ వార్డుకు చెందిన పెద్ది వెంకటేష్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి గతంలో ఫిర్యాదు చేశారు. క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఓట్లను జాబితా నుంచి తొలగించాలని కమిషన్ స్పష్టం చేసింది.
SDPT: బెజ్జంకి మోడల్ స్కూల్ హాస్టల్‌లో ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశారు. విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రతపై సూచనలు అందించి, చేతులు శుభ్రంగా కడుక్కోవడం అలవాటు చేయాలన్నారు. పోషకాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుందని వివరించారు. కంజంక్టివైటిస్ వ్యాధి లక్షణాలు, వ్యాప్తి విధానం, నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డా. మాధురి, సులోచన, సిస్టర్ అనిత ఉన్నారు.
NGKL: కల్వకుర్తి పట్టణానికి చెందిన ఉద్యమకారుడు, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు తలసాని ప్రసాద్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఛైర్మన్ బాలాజీ సింగ్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు బృంగి ఆనంద్ కుమార్ పాల్గొన్నారు.
BHNG: రామన్నపేట మండలం ఇంద్రపాలనగరంలో మమత గణేష్ దంపతుల ఇందిరమ్మ ఇంటిని ఎమ్మెల్యే వేముల వీరేశం ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, నకిరేకల్ నియోజకవర్గానికి తొలి విడతగా 3,500 ఇళ్లు కేటాయించినట్లు తెలిపారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి విడతల వారీగా ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
NLG: కనగల్ చెందిన సామాజిక సేవకురాలు డా. కంబాల శివలీల ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అవార్డు-2026’కు ఎంపికయ్యారు. గత 12 ఏళ్లుగా ఆమె చేస్తున్న సామాజిక సేవలను గుర్తిస్తూ వాజ్‌పేయి-అద్వాని సేవా సంస్థ ఈ పురస్కారాన్ని ప్రకటించింది. ఈ నెల 22న ఉయ్యాలవాడ వర్ధంతి సందర్భంగా ఆన్‌లైన్ ద్వారా ఈ అవార్డును అందజేయనున్నారు. సంస్థ వారికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.