• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ప్రమాదకరంగా ఉన్న కంపచెట్ల తొలగింపు

NLG: చిట్యాల 8వ వార్డులో కరెంటు వైర్లకు కంప చెట్లు తాకుతూ ప్రమాదకరంగా ఉండడంతో ఆ వార్డు కౌన్సిలర్ కుక్కల మోహన్ సొంత ఖర్చులతో ఇవాళ జేసీబీ సాయంతో తొలగింపజేశారు. వార్డులో ఉన్న సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తానని, వార్డు ప్రజలకు హామీ ఇచ్చారు. కాలనీవాసులు మారగోని యాదగిరి, నరసింహ, పెద్దులు, లింగస్వామి అమరోజు మదన్‌లు కౌన్సిలర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

February 20, 2026 / 05:49 PM IST

‘దశాబ్దాల సొంతింటి కల నెరవేరింద’

NRPT: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా అర్హులైన నిరుపేదలకు గృహాల పంపిణీ కొనసాగుతోంది. ఏనుముల తిరుపతి రెడ్డి సాకారంతో పెదిరిపహాడ్ గ్రామానికి చెందిన చాకలి మల్లేశ్‌కు ఇందిరమ్మ ఇల్లు కేటాయించారు. శుక్రవారం కుటుంబ సభ్యులు ఘనంగా గృహప్రవేశం నిర్వహించారు. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న సొంతింటి కల నెరవేరిందని మల్లేశ్ కుటుంబం ఆనందం వ్యక్తం చేసింది.

February 20, 2026 / 05:46 PM IST

ఏడో తరగతి విద్యార్థిని కన్నుమూత

GDWL: ఆడుతూ పాడుతూ పాఠశాలకు రావాల్సిన చిన్నారి.. అనారోగ్యంతో తిరిగిరాని లోకాలకు వేలింది. మల్దకల్ మండలం సద్దలోనిపల్లి గ్రామానికి చెందిన పేగుల గోపాల్ కుమార్తె చందు(13) శుక్రవారం కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. అమరవాయి జడ్పీహెచ్ఎస్ స్కూల్‌లో 7వ తరగతి చదువుతున్న ఈ విద్యార్థిని మరణవార్త తెలియగానే పాఠశాలలో విషాద ఛాయలు అలముకున్నాయి.

February 20, 2026 / 05:46 PM IST

రోడ్డు నిర్మాణానికి రూ.2.53 కోట్ల నిధులు మంజూరు

SDPT: హుస్నాబాద్ మండలం తోటపల్లి గ్రామం నుంచి పూస వేర్లపల్లె వరకు తారు రోడ్డు నిర్మాణానికి 2.53 కోట్ల నిధులు మంజూరైనట్లు గ్రామ సర్పంచ్ బంక లక్ష్మీ చందు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం రోజున రోడ్డు పనులు ప్రారంభించారు. నిధులు మంజూరు చేసినందుకు మంత్రి పొన్నం ప్రభాకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

February 20, 2026 / 05:45 PM IST

రైతు సంక్షేమానికి పెద్దపీట: MLA

JN: రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. స్టేషన్ ఘనపూర్లో సబ్సిడీపై అర్హులైన రైతులకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యవసాయ పనిముట్లను అందజేశారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన రైతులు సద్వినియోగం చేసుకొని లబ్ధి పొందాలని, దేశానికి వెన్నెముక రైతు అని ఎమ్మెల్యే అన్నారు.

February 20, 2026 / 05:44 PM IST

‘ఇంటర్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ను అరికట్టాలి’

NZB: జిల్లాలో జరగబోయే ఇంటర్మీడియట్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. కొన్ని ప్రైవేట్ కళాశాలలు పరీక్షా కేంద్రాలతో కుమ్మక్కై మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతున్నాయని ఆయన ఆరోపించారు.

February 20, 2026 / 05:42 PM IST

హరీష్ రావును కలిసిన వర్ధన్నపేట బీఆర్ఎస్ నాయకులు

HNK: హసన్‌పర్తి మండలం దేవన్నపేటలో మాజీ మంత్రి టీ. హరీష్ రావును శుక్రవారం వర్ధన్నపేట బీఆర్ఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అధికారులు ప్రవర్తించిన తీరు గురించి ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ మార్గం బిక్షపతి, తుమ్మల యాకయ్య, కుమారస్వామి, ఏకాంతం, పిట్టల రాజు, తదితరులు పాల్గొన్నారు.

February 20, 2026 / 05:42 PM IST

హైకోర్టులో పైలెట్‌కు ఊరట

VKB: మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కౌంటింగ్ కేంద్రం వద్ద జరిగిన గొడవలో తాండూర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయనకు ఊరట లభించింది. పైలెట్‌తో పాటు మరో ఏడు మందిపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. హైకోర్టు బెయిల్ ద్వారా తాండూరు పోలీసులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.

February 20, 2026 / 05:41 PM IST

నిఘా నీడలో ఇంటర్ పరీక్షలు

SRPT: ఈనెల 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలు నిఘా నీడలో నిర్వహించనున్నామని ఇంటర్మీడియట్ బోర్డ్ జాయింట్ సెక్రటరీ భీమ్ సింగ్ వెల్లడించారు. శుక్రవారం సూర్యాపేటలోని ప్రభుత్వ కళాశాలలో డీఐఈఓ భాను నాయక్ అధ్యక్షతన నిర్వహించిన సీఎస్డీఓల ఓరియంటేషన్ ప్రోగ్రాంలో పాల్గొని మాట్లాడారు. పరీక్ష కేంద్రాల్లో అన్ని వసతులు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

February 20, 2026 / 05:39 PM IST

మానవత్వం చాటుకున్న ఎస్సై నరేష్

WNP: నర్సింగయ్యపల్లి డిగ్రీ కళాశాల సమీపంలో శుక్రవారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఎస్సై నరేష్ మానవత్వం చాటుకున్నారు. రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడగా, అంబులెన్స్ అందుబాటులో లేని పరిస్థితిని గమనించిన ఎస్సై తక్షణమే స్పందించారు. క్షణ కాలం కూడా ఆలస్యం చేయకుండా బాధితుడిని తన బైక్ పైనే ఎక్కించుకుని ఆసుపత్రికి తరలించారు.

February 20, 2026 / 05:36 PM IST

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు చార్జి షీట్ వెనక్కి

HYD: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్‌ను నాంపల్లి కోర్టు మూడోసారి వెనక్కి పంపింది. అల్లు అర్జున్‌తో సహా 23 మందిని నిందితులుగా పేర్కొన్న ఈ పత్రాల్లో హార్డ్ డిస్కులు, సీడీలు, పెన్ డ్రైవ్‌లు వంటి కీలక సాంకేతిక ఆధారాలు జతపరచలేదని కోర్టు గుర్తించింది. ఈ సాంకేతిక లోపాలను సరిదిద్దాలని ఆదేశిస్తూ చార్జిషీట్‌ను రిటర్న్ చేసింది.

February 20, 2026 / 05:31 PM IST

ఉచిత వైద్య శిబిరం ప్రారంభం

KMM: మధిర మండలం సిరిపురం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఓ సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు దుంప వెంకటేశ్వర్ రెడ్డి శిబిరాన్ని ప్రారంభించారు. వైద్యులు కే. అప్పారావు ఆధ్వర్యంలో రోగులకు పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.

February 20, 2026 / 05:31 PM IST

విద్యార్థులకు ఉత్తమ వాతావరణం కల్పించాలి: కలెక్టర్

WGL: దుగ్గొండి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలను శుక్రవారం కలెక్టర్ సత్య శారద సందర్శించి, పీఎంశ్రీ పథకం కింద మంజూరైన నిధుల వినియోగం, మౌలిక సదుపాయాల అభివృద్ధిని పరిశీలించారు. తరగతి గదులు, వంటశాల, భోజనశాల, సైన్స్ ల్యాబ్, ఏటీఎల్ ల్యాబ్, గ్రంథాలయం, మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. విద్యార్థులకు ఉత్తమ విద్యా వాతావరణం కల్పించాలన్నారు.

February 20, 2026 / 05:31 PM IST

శుక్రవారం సభ ద్వారా ప్రజారోగ్య పర్యవేక్షణ: కలెక్టర్

KNR: శుక్రవారం సభల్లో అంగన్వాడి, వైద్య సిబ్బంది ద్వారా నివేదిక తెప్పించుకుని ప్రజారోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నామని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. చొప్పదండి మండలం చాకుంట అంగన్వాడి కేంద్రం ఆవరణలో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సభ జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ.. తల్లీపిల్లల ఆరోగ్యానికి సరైన పోషణ ఎంతో అవసరమన్నారు.

February 20, 2026 / 05:30 PM IST

కష్టపడిన వారికి పార్టీలో తగిన గుర్తింపు: శ్రీనివాసరెడ్డి

ADB: కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణతో పని చేసే వారికి తగిన గుర్తింపు లభిస్తుందని ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం ఆత్మ కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన సంతోష్ రావును శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. సంతోష్ రావు పనిపట్ల నిబద్ధత కలిగిన వ్యక్తి అని పేర్కొన్నారు.

February 20, 2026 / 05:30 PM IST