క్రికెట్ ప్రేమికులకు మెట్రో రైలు సంస్థ తీపి కబురు చెప్పింది. టీ20 ప్రపంచకప్ -2026లో భాగంగా ఇవాళ భారత్, జింబాబ్వే తలపడనున్నాయి. ఈ క్రమంలో మ్యాచ్ టికెట్లు ఉన్నవారు ఒకసారి ఫ్రీగా ప్రయాణించడానికి అవకాశం కల్పించింది. కాగా ఈ మ్యాచ్ చెన్నై చేపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనున్న విషయం తెలిసిందే.
పొట్టి మెగా టోర్నీలో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన తమ రెండో సూపర్ 8 మ్యాచులోనూ శ్రీలంక ఓడింది. తొలుత కివీస్ 168/7 స్కోర్ చేయగా.. లక్ష్యచేధనలో లంక ఆరంభం నుంచే తడబడుతూ వచ్చి 115/9 మాత్రమే చేయగలిగింది. టోర్నీ తొలి 3 మ్యాచుల్లోనూ విజయం సాధించిన ఆ జట్టు.. ఆ తర్వాత మూడింటిలోనూ పరాజయంపాలైంది. దీంతో ఆ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది.
భారత్ తుది జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ మండిపడ్డాడు. అసలు కోచ్ గంభీర్ ఏం చేస్తున్నాడో తనకు అర్థం కావడం లేదని అన్నాడు. వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్‌ను జట్టు నుంచి ఎందుకు తప్పించారని ప్రశ్నించాడు. ఇలాంటి చెత్త ప్రయోగాలతో ఇప్పుడు మొదటికే మోసం వచ్చిందని వ్యాఖ్యానించాడు. మిగిలిన మ్యాచ్‌ల్లోనైనా సరైన నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తున్నానన్నాడు.
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్, జింబాబ్వే జట్ల మధ్య రేపు కీలక మ్యాచ్ జరగనుంది. తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిన భారత జట్టుకు ఈ మ్యాచ్ ‘డూ ఆర్ డై’గా మారింది. ఇందులో భారత్ ఓడితే సెమీస్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. దీంతో ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో భారీ ఉత్కంఠ నెలకొంది. రాత్రి 7 గంటలకు ఈ పోరు ప్రారంభం కానుంది.
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచకప్ తర్వాత కూడా సూర్యనే కెప్టెన్‌గా కొనసాగించాలని అభిప్రాయపడ్డాడు. సూర్యకుమార్ ఒక అద్భుతమైన ఆటగాడని, అంతకు మించి గొప్ప కెప్టెన్ అని కొనియాడాడు. అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించడం అంటే అది మూర్ఖత్వమే అవుతుందని వ్యాఖ్యానించాడు.
శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ముగిసింది. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి ఆ జట్టు 168 పరుగులు చేసింది. ఒక దశలో 12.1 ఓవర్లలో 84 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును సాంట్నర్ (47), మెక్‌కాంచీ (31) ఆదుకున్నారు. వీరిద్దరూ 7వ వికెట్‌కు 47 బంతుల్లో 84 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. చమీర, తీక్షణ తలో 3 వికెట్లు పడగొట్టారు.
జింబాబ్వేతో రేపు జరగనున్న మ్యాచ్‌లో అభిషేక్ శర్మతో కలిసి సంజూ శాంసన్‌ను ఓపెనర్‌గా ఆడించాలని మాజీ కోచ్ అనిల్ కుంబ్లే తెలిపాడు. ఇషాన్ కిషన్‌ను వన్ డౌన్‌లో పంపించాలన్నాడు. దీంతో లెఫ్ట్&రైట్ ఓపెనింగ్ జోడీతో బౌలర్లపై ఆధిపత్యం సాధించవచ్చన్నాడు. ఒకవేళ శాంసన్‌కు తుది జట్టులో చోటు దక్కకపోతే.. వన్ డౌన్‌లో సూర్య రావాలని సూచించాడు.
రేపు జింబాబ్వేతో జరగనున్న మ్యాచ్‌కు ముందు టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. శాంసన్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉందన్నాడు. అలాగే, అభిషేక్, తిలక్ ఫామ్ విషయంలో తమకు ఎటువంటి ఆందోళన లేదని పేర్కొన్నాడు. ‘వారు రెండు బౌండరీలు బాదితే అంతా సర్దుకుంటుంది’ అని తెలిపాడు. పిచ్ పరిస్థితిని బట్టి తుది జట్టు ఎంపిక ఉంటుందని స్పష్టం చేశాడు.
T20 WCలో భాగంగా కొలంబో వేదిగా శ్రీలంక, న్యూజిలాండ్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక కెప్టెన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. గ్రూప్-2లో ఇప్పటికే లంక తమ తొలి మ్యాచ్ ఓడగా.. పాక్, కివీస్ మ్యాచ్ వర్షంతో రద్దయింది. ఈ క్రమంలో ఇవాళ విజయం సాధించడం ఇరుజట్లకు తప్పనిసరిగా మారింది. ఓడిన జట్టు దాదాపుగా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.
కొలంబో వేదికగా న్యూజిలాండ్, శ్రీలంక మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే, ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉందని ఆక్యూవెదర్ పేర్కొంది. ఒకవేళ వర్షంతో మ్యాచ్ రద్దయితే, ఇరు జట్లు పాయింట్లను పంచుకోవాల్సి ఉంటుంది. అప్పుడు 2 మ్యాచ్‌ల్లో 2 పాయింట్లతో NZ.. 2 మ్యాచ్‌ల్లో ఒక పాయింట్‌తో SL, PAK ఉంటాయి. దీంతో సెమీస్ చేరాలంటే చివరి మ్యాచ్ గెలవడం వీటికి కీలకం కానుంది.
T20 WCలో ఇంగ్లండ్ చేతిలో పాకిస్తాన్ ఓడిపోవడంతో ఆ జట్టు సెమీస్ అవకాశాలు సన్నగిల్లాయి. దీంతో పాక్ జట్టుపై SMలో ఆ దేశ అభిమానులు విరుచుకుపడుతున్నారు. కెప్టెన్ సల్మాన్ అఘాతో పాటు అతడి భార్య, కుమారుడిని టార్గెట్ చేస్తూ అసభ్య కామెంట్లు చేస్తున్నారు. దీనిపై అఘా భార్య స్పందిస్తూ.. “నన్ను, నా కొడుకును దుర్భాషలాడటం వల్ల మీరు WC గెలవలేరు’ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.
రంజీ ట్రోఫీ ఫైనల్లో జమ్మూకశ్మీర్ బ్యాటర్లు దుమ్మురేపుతున్నారు. 284/2 పరుగుల ఓవర్ నైట్ స్కోర్‌తో రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన J&K.. ఆట ముగిసే సమయానికి 527/6 పరుగుల భారీ స్కోరు సాధించింది. శుభమ్ (121) సెంచరీ చేయగా.. హసన్ (88), డోగ్రా (70), అబ్దుల్ సమద్ (61), కన్హయ్య (70), సాహిల్ (57*) అర్ధ సెంచరీలతో రాణించారు. బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 3 వికెట్లు పడగొట్టాడు.
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జోస్ బట్లర్ ఫామ్‌పై ప్రస్తుత కెప్టెన్ హ్యారీ బ్రూక్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘బట్లర్ ఇంగ్లండ్ క్రికెట్‌కు ఎంతో కాలంగా సేవలు అందిస్తున్నాడు. కెప్టెన్‌గా T20 WCను కూడా అందించాడు. అతడి బ్యాటింగ్ సామర్థ్యంపై ఎవరికీ అనుమానాలు లేవు. అతడో పవర్ హౌస్. నాకౌట్ దశలో అతడి నుంచి భారీ ఇన్నింగ్స్ చూస్తారు’ అంటూ బ్రూక్ ధీమా వ్యక్తం చేశాడు.
టీమిండియాలోకి పునరాగమనం చేసిన తర్వాత ఇషాన్ కిషన్ దుమ్మురేపుతున్నాడు. దీంతో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో ఇషాన్ కిషన్ మూడో స్థానానికి దూసుకెళ్లాడు. మరోవైపు, వరుసగా విఫలమవుతున్నప్పటికీ అభిషేక్ శర్మ తన అగ్రస్థానాన్ని కాపాడుకున్నాడు. అయితే, పాక్ ప్లేయర్ ఫర్హాన్ నుంచి అభిషేక్ టాప్ ప్లేస్‌కు ముప్పు ఏర్పడింది. అతడు T20 WCలో తన ప్రదర్శనతో రెండో స్థానానికి దూసుకొచ్చాడు.