• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో మెరిసిన ఖేడ్ వాసి

SRD: హైదరాబాద్‌లో జరుగుతున్న తెలంగాణ 4వ పోలీస్ స్పోర్ట్స్ మీట్ బాడ్మింటన్ సింగల్స్ విభాగంలో రేంజ్-1 నుంచి పాల్గొని నారాయణఖేడ్ బాడ్మింటన్ క్రీడాకారుడు అబ్దుల్ సాజిద్ బ్రాంజ్ మెడల్ సాధించాడు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఐజీపీ గజరావ్ భూపాల్ బహుమతి ప్రదానం చేశారు. సాజిద్ విజయం పట్ల 4వ బేటాలియన్ కమాండెంట్ D.శివప్రసాద్ రెడ్డి, అధికారులు అభినందించారు.

February 20, 2026 / 04:34 PM IST

వైసీపీ విద్యుత్ వ్యవస్థను నాశనం చేసింది: గొట్టిపాటి

AP: అసెంబ్లీలో బడ్జెట్‌పై మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడారు. విద్యుత్ రంగం.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభమని తెలిపారు. దేశంలో విద్యుత్ సంస్కరణలకు నాంది పలికిన వ్యక్తి చంద్రబాబు అని కొనియాడారు. వైసీపీ ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థను సర్వనాశనం చేసిందని మండిపడ్డారు. గత ప్రభుత్వం ట్రూఅప్ ఛార్జీల పేరుతో రూ.30 వేల కోట్లు భారం వేసిందని ఆరోపించారు.

February 20, 2026 / 04:34 PM IST

SBI సీఎస్ఆర్ నిధులతో రేణిగుంట PHCకి వైద్యపరికరాలు

TPT: రేణిగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి SBI తిరుపతి రీజనల్ కార్యాలయం సీఎస్ఆర్ నిధులతో శుక్రవారం వైద్య పరికరాలు అందజేసింది. ఈ సందర్భంగా రీజనల్ మేనేజర్ వేంకటేశ్వర్లు మాట్లాడుతూ.. సామాజిక సేవలో భాగంగా ప్రతి ఏడాది ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సమాజానికి సేవ చేయాలనే దృక్పథంతో స్టేట్ బ్యాంక్ ముందుంటుందని చెప్పారు.

February 20, 2026 / 04:34 PM IST

ఆ క్షణాలు భావోద్వేగభరితం: కోమటిరెడ్డి

TG: నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల దశాబ్దాల కల సాకారమైన వేళ.. ఆనాటి పోరాట స్మృతులు నేటికీ తన కళ్లముందే కదలాడుతున్నాయని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఇవాళ పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన రోజును ఆయన గుర్తు చేసుకున్నారు. దాశరథి గారు అన్నట్లు ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అనే మాటలు ఇవాళ అక్షర సత్యాలవుతుంటే మనసు గర్వంతో నిండిపోతోందన్నారు.

February 20, 2026 / 04:33 PM IST

ఆహ్వాన పత్రిక అందజేసిన డిప్యూటీ సీఎం

KMM: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కుటుంబ సమేతంగా శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. మార్చి 5న HYDలో జరగనున్న తన కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహ వేడుకకు హాజరుకావాలని కోరుతూ వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి హాజరై ఆశీర్వచనాలు అందజేయాలని కోరారు.

February 20, 2026 / 04:33 PM IST

‘ఉద్యోగ భద్రత కల్పించాలి’

PPM: గిరిజన ప్రాంతంలో వైద్యసేవలు అందిస్తున్న “ఫీడర్ అంబులెన్స్” సర్వీస్‌ల టెండర్ రెన్యువల్ చేయాలని, కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించాలని ఫీడర్ అంబులెన్స్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) డిమాండ్ చేశారు. శుక్రవారం మన్యం కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. మారుమూల గిరిజన గిరి శిఖర గ్రామాల నుంచి గర్భిణీలు, రోగులను PHCకు తరలిస్తున్నామని చెప్పుకొచ్చారు.

February 20, 2026 / 04:32 PM IST

సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న కలెక్టర్

WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలో నిర్వహించిన సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల్లో జిల్లా కలెక్టర్ డా. సత్య శారద పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సేవాలాల్ మహారాజ్ బోధనలు సమాజానికి మార్గదర్శకమని, గిరిజనుల ఆత్మగౌరవానికి ఆయన జీవితమే ప్రేరణగా నిలిచిందని పేర్కొన్నారు. గిరిజనుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.

February 20, 2026 / 04:31 PM IST

అగ్నిమాపక శాఖ తరపున ప్రజలకు సూచనలు

CTR: ప్రజలకు అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలని ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు పేర్కొన్నారు. పుంగనూరులోని అగ్నిమాపక కార్యాలయంలో శుక్రవారం ఆయన కేసి టీవీతో మాట్లాడారు. వేసవి ఎండలు ప్రారంభమవుతున్నాయని, అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఎక్కువని, వాటి నివారణకు జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. ప్రమాదాలు జరిగితే 08581-253101 సమాచారం ఇవ్వాలన్నారు.

February 20, 2026 / 04:30 PM IST

ఉసిరితో జుట్టుకు అద్భుత ప్రయోజనాలు

జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో ఉసిరి అద్భుతంగా పనిచేస్తుంది. రోజూ ఒక ఉసిరి తినడం లేదా జ్యూస్ తాగడం వల్ల జుట్టు బలంగా, వత్తుగా పెరుగుతుంది. ఉసిరి పొడి, నిమ్మరసం మిశ్రమాన్ని తలకు పట్టించి 40 నిమిషాల తర్వాత స్నానం చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది. కొబ్బరి నూనెలో ఉసిరి రసం కలిపి నెలకు 4 సార్లు మాడుకు పట్టిస్తే జుట్టు ఒత్తుగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.

February 20, 2026 / 04:29 PM IST

‘పోలియో రహిత ప్రపంచమే రోటరీ లక్ష్యం’

VZM: రోటరీ డిస్ట్రిక్ట్ 3020 గవర్నర్ డా. వై కళ్యాణ్ చక్రవర్తి పోలియో నిర్మూలనే రోటరీ ధ్యేయమని శుక్రవారం తెలిపారు. ఇచ్చాపురం నుంచి విజయవాడ వరకు సైకిల్ యాత్ర చేపట్టి బొబ్బిలిలో ర్యాలీ నిర్వహించారు. భారతదేశాన్ని 2014లో పోలియో రహిత దేశంగా ప్రకటించారని, దీనిపై అప్రమత్తత అవసరమన్నారు. అనంతరం క్లబ్ కార్యక్రమాలు సమీక్షించి రోటరీ బస్ బే ప్రారంభించి, విద్యార్థులకు టీ షర్టులు పంచారు.

February 20, 2026 / 04:27 PM IST

బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం: SI

KDP: బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని ఎస్సై హారిక అన్నారు. శుక్రవారం సిద్ధవటం పోలీస్ స్టేషన్ వద్ద రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో బాల్యవివాహా విముక్తి ప్రచార రథాన్ని ఎస్సై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆడపిల్లలకు బాల్య వయసులో వివాహాలు చేయడం పట్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయన్నారు.

February 20, 2026 / 04:27 PM IST

వైసీపీ నేతలకు భయం, భక్తి లేవు: సోము వీర్రాజు

AP: హిందువుల మనోభావాలను వైసీపీ దెబ్బతీసిందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. చెప్పులేసుకుని దేవుడి ఫొటోలతో సభలోకి రావడం క్షమించరాని నేరమని విమర్శించారు. దేవుడి ఫొటోలు విసిరేయడం అవమానకరమన్నారు. హిందువులను అవమానించినందుకు జగన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దేవుడు అంటే జగన్‌తో సహా వైసీపీ నేతలకు భయం, భక్తి లేవన్నారు.

February 20, 2026 / 04:27 PM IST

ప్రతి రైతు ఫార్మర్ ఐడిని కలిగి ఉండాలి: ADA

NLR: దగదర్తి మండలం పెదపుతేడు గ్రామంలో పంట నమోదు కార్యక్రమంను సీహెచ్ నాగరాజు సహాయ వ్యవసాయ సంచాలకులు కావలి శుక్రవారం తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. పంట వేసిన ప్రతి రైతు పంట నమోదు కార్యక్రమంలో నమోదవ్వాలన్నారు. తద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలలో పంట అమ్ముకోవచ్చన్నారు. ప్రభుత్వం ద్వారా లభించే ఇన్‌పుట్ సబ్సిడీ, ఇతర ప్రభుత్వ పథకాలన్నిటికీ అర్హులవుతారని ఆయన తెలిపారు.

February 20, 2026 / 04:27 PM IST

దేవాదుల ప్రాజెక్టును పట్టించుకోవడం లేదు: హరీష్

TG: కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా.. దేవాదుల ప్రాజెక్టును పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. దేవాదుల ప్రాజెక్టును సందర్శించిన హరీష్.. తాము ప్రాజెక్టులు నిర్మిస్తే కాంగ్రెస్ వాటిని నిర్వహించలేకపోతోందన్నారు. ఇక్కడ మోటార్లు ఆన్ చేయకపోవడం వల్ల జనగామ, స్టేషన్ ఘన్ పూర్, పాలకుర్తి రైతులు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు.

February 20, 2026 / 04:26 PM IST

‘సర్పంచ్‌పై నిందలు వేస్తే సహించేది లేదు’

E.G: కడియం మండలం మాధవ రాయుడుపాలెం సర్పంచ్ అన్నందేవుల చంటిపై నిందలు వేస్తే సహించేది లేదని ఆ గ్రామానికి చెందిన SC, ST ఐక్యవేదిక నాయకులు శుక్రవారం హెచ్చరించారు. చైతన్యనగర్లో తలెత్తిన భూ వివాదం ఆయన వ్యక్తిగతం కాదన్నారు. ఇంగిత జ్ఞానం లేని వ్యక్తులు సర్పంచ్‌పై బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలవురు నాయకులు పాల్గొన్నారు.

February 20, 2026 / 04:25 PM IST