• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘జీవించే హక్కును హరిస్తే దళితుల ఆగ్రహానికి గురికాక తప్పదు’

HNK: జీవించే హక్కును హరిస్తే దళితుల ఆగ్రహానికి గురికాక తప్పదని డీబీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజేందర్ అన్నారు. 11వ డివిజన్ భద్రకాళి ఆలయం సమీపంలో ఉన్న చెరబండరాజు నగర్లో DBF నేతలు పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాజ్యాంగ బద్దంగా అధికారులు తమ విధులను సక్రమంగా వినియోగించి దళిత కుటుంబాలకు మంచి పాలన అందించాలని కోరారు.

February 20, 2026 / 07:17 PM IST

తడి పొడి చెత్తను వేరు చేయడంపై శిక్షణ

AKP: సబ్బవరం గ్రామపంచాయతీ పరిధిలో పారిశుద్ధ్య కార్మికులకు తడి పొడి చెత్తను వేరు చేయడంపై శుక్రవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఇనుము ప్లాస్టిక్ అట్టపెట్టెలు కాగితాలు తదితర వాటిని పొడి చెత్తగా పరిగణిస్తారని ఆర్.డబ్ల్యూ.ఎస్ కన్సల్టెంట్ లోవరాజు, కార్యదర్శి ఆనందరావు అన్నారు. సేకరించిన చెత్తను సంపద కేంద్రాలకు తరలించాలని సూచించారు.

February 20, 2026 / 07:15 PM IST

‘మార్చి 1 వరకు దరఖాస్తులు సమర్పించాలి’

PPDL: తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా అందిస్తున్న వివిధ పథకాలకు సంబంధించి అర్హులైన మైనారిటీలు మార్చి 1 లోపు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి నరేష్ కుమార్ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు పత్రంతో పాటు, ముఖ్యమైన పత్రాలను సంబంధిత ఎంపీడీవో/మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో అందజేయాలని సూచించారు.

February 20, 2026 / 07:13 PM IST

బాధితుడికి LOC కాపీని అందజేత

NZB: ఆర్మూర్ మండలం గోవింద్ పేట గ్రామానికి చెందిన రోహిత్ రానాకు CMRF ద్వారా అందిన సాయం ఊరటనిచ్చింది. ఇటీవలే అనారోగ్యం బారినపడి శస్త్రచికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చేరిన రోహిత్ పరిస్థితిని తెలుసుకున్న ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి తక్షణమే స్పందించారు. ప్రభుత్వానికి విన్నవించి ఎల్ఓసీ కాపీని మంజూరు చేయించారు.

February 20, 2026 / 07:13 PM IST

అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి

కర్నూలు జిల్లా గడివేముల మండలం మంచాలకట్ట గ్రామానికి చెందిన హుస్సేన్ బాషా (22) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. నగరంలోని రైల్వే ట్రాక్‌పై శుక్రవారం ఓ యువకుడి మృత దేహం ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత యువకుడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

February 20, 2026 / 07:12 PM IST

ప్రభాస్‌కు ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్ ఇదే..!

‘కపుల్ ఫ్రెండ్లీ’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ఇంటర్వ్యూలో రెబల్ స్టార్ ప్రభాస్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా విజయవాడలో దొరికే పునుగులు తన ఆల్‌టైమ్ ఫేవరెట్ అని ప్రభాస్ తెలిపాడు. చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్‌లో ఫ్రెండ్స్‌తో కలిసి పునుగులు తినేవాడినని పేర్కొన్నాడు. అయితే, ఇప్పుడు బిజీగా ఉండటం వల్ల తినడం కుదరడం లేదని వ్యాఖ్యానించాడు.

February 20, 2026 / 07:12 PM IST

గ్రామ గ్రామాన మారుమ్రోగనున్న రామ నామం..!

SDPT: భద్రాచల దేవస్థానం నుంచి వచ్చిన 3 క్వింటాల వడ్లు గోటి తలంబ్రాలకు ఇవాళ అద్దాల మందిరం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజలు శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు దంపతుల ఆధ్వర్యంలో జరిగాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భక్తులకు అందించడానికి వడ్ల ప్యాకెట్లు సిద్ధిం చేశామన్నారు.

February 20, 2026 / 07:10 PM IST

సమిష్టి కృషితోనే గెలుపు సాధ్యం: జూపల్లి కృష్ణారావు

ADB: ఆదిలాబాద్ జిల్లా ఇంఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావును DCC అధ్యక్షుడు నరేష్ జాదవ్ హైదరాబాదులో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన్ను స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి శాలువాతో ఘనంగా సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు. నాయకులు, కార్యకర్తల సమిష్టి కృషి వల్లే మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు సాధ్యమైందని జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.

February 20, 2026 / 07:10 PM IST

సంకల్ప కళా గ్రామంలో ఫ్లీట్ రివ్యూ ప్రతినిధుల సందడి

VSP: భారతీయ నౌకాదళం నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూలో భాగంగా పెందుర్తి సమీపంలోని సంకల్ప కళా గ్రామంలో సహజరంగుల అద్దకంపై కార్యశాల నిర్వహించారు. నేవీ వెల్ఫేర్ అండ్ వెల్నెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విదేశీ ప్రతినిధులు చేనేత ఉత్పత్తులు, లక్క బొమ్మలు, సంప్రదాయ ఆహార తయారీ విధానాలను వీక్షించారు.

February 20, 2026 / 07:09 PM IST

కాంగ్రెస్‌లోకి బీఆర్‌ఎస్‌, బీజేపీ నేతల చేరిక

KMR: తాడ్వాయి మండలంలోని భ్రమణపల్లికి చెందిన పలువురు కీలక నాయకులు శుక్రవారం ఎమ్మెల్యే మదన్ మోహన్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వార్డు సభ్యులు నవీన్ గౌడ్, నారాయణ, గైని రాజుతో పాటు బీఆర్‌ఎస్ నాయకుడు మరాఠీ శ్రీనివాస్, బీజేపీ నాయకుడు అబ్బగొని రామాగౌడ్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వీరికి ఎమ్మెల్యే పార్టీలోకి సాదర స్వాగతం పలికారు.

February 20, 2026 / 07:09 PM IST

అసైన్డ్ భూమి స్వాధీనం.. నలుగురిపై కేసు నమోదు: CI

ADB: అసైన్డ్ భూమిని స్వాధీనం చేసుకున్న నలుగురిపై కేసు నమోదు చేయడం జరిగిందని మావల CI కర్రె స్వామి శుక్రవారం తెలియజేశారు. నిందితులలో హమీద్, షరీఫ్ ను అరెస్ట్ చేయగా అంజుం, మెహరున్నీసా పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. కేఆర్కే కాలనీకి చెందిన పట్పెల్లీ లలితకు అందజేసిన ప్రభుత్వ ఇంటి స్థలాన్ని నకిలీ ధ్రువపత్రాలతో నిందితులు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

February 20, 2026 / 07:09 PM IST

ఆర్‌ఐ కారు బోల్తా.. తప్పిన ముప్పు..!

GDWL: మానవపాడు మండల పరిధిలోని బోరవెల్లి స్టేజి వద్ద 44వ జాతీయ రహదారిపై శుక్రవారం ప్రమాదం చోటుచేసుకుంది. ఎర్రవల్లి మండల రెవెన్యూ ఇన్స్‌పెక్టర్ (RI) శ్రీనివాసులు కర్నూలు జిల్లా ఆత్మకూరులో బంధువుల వివాహానికి హాజరై తిరిగి గద్వాలకు వస్తున్నారు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్థానికులు తెలిపారు.

February 20, 2026 / 07:09 PM IST

ఆర్తి అసోసియేషన్ అధ్యక్షుడిగా రవీందర్ ఎన్నిక

WGL: నర్సంపేట వ్యవసాయ మార్కెట్ ఆర్తి అసోసియేషన్‌కు జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా రవీందర్ ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా రాజిరెడ్డి, కోశాధికారిగా భాస్కర్, ఉపాధ్యక్షుడిగా పాక భాస్కర్ మల్లేశం ఎన్నికైనట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. మార్కెట్ అభివృద్ధి, వ్యాపారుల సమస్యల కోసం కృషి చేస్తామని తెలిపారు.

February 20, 2026 / 07:08 PM IST

నిరుద్యోగ క్రైస్తవ యువతకు ఉచిత శిక్షణ

SRPT: జిల్లాలోని నిరుద్యోగ క్రైస్తవ మైనారిటీ యువతకు ‘కౌంటర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్’ కోర్సులో ఉచిత శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి నర్సింహులు తెలిపారు. 18-35 ఏళ్ల లోపు వయస్సు, ఇంటర్ అర్హత కలిగిన వారు ఈ నెల 26లోగా కలెక్టరేట్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వివరాలకు 9492611057ను సంప్రదించాలని అన్నారు.

February 20, 2026 / 07:06 PM IST

రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు విద్యార్థుల ఎంపిక

NLG: నారాయణపేటలో జరగనున్న రాష్ట్ర స్థాయి సీఎం కప్ కబడ్డీ పోటీలకు చెరుకుపల్లి జెడ్పీహెచ్ఎస్ విద్యార్థినులు ఇస్లావత్ మౌనిక, జరుపుల రేణుక ఎంపికయ్యారని ఎంఈఓ గోప్యా నాయక్ తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు క్రీడల్లో రాణించడం గర్వకారణమని ఆయన అభినందించారు. విద్యార్థినులు జిల్లాకు పేరు తేవాలని ఉపాధ్యాయులు, గ్రామస్థులు ఆకాంక్షించారు.

February 20, 2026 / 07:06 PM IST