• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

YCP నేతలకు TTD లీగల్ నోటీసులు!

నిన్న శాసనమండలిలో YCP ఎమ్మెల్సీలు అవలంభించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లు TTD బోర్డ్ మెంబర్ భానుప్రకాశ్ రెడ్డి తెలిపారు. శ్రీవారిని అవమానించేలా ప్రవర్తించిన నేతలకు TTD నుంచి లీగల్ నోటీసులు పంపుతామని హెచ్చరించారు. జగన్ కోసం YCP సభ్యుల దైవద్రోహానికి పాల్పడ్డారని మండిపడ్డారు. చెప్పులు వేసుకుని స్వామివారి చిత్రపటాలను ప్రదర్శించడమేంటంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.

February 21, 2026 / 12:30 PM IST

‘ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి’

KMM: ప్రభుత్వ పథకాలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే రాగమయి తెలిపారు. తల్లాడ మండల పరిధిలోని అంజనాపురం గ్రామంలో నూతన నిర్మించిన ఇందిరమ్మ గృహాన్ని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయ దయానంద్ శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తాహసీల్దార్ టి. కర్ణాకర్ రెడ్డి, ఎంపీడీవో శ్రీధర్ రాజు, ఎంపీవో ఏనుగు సురేష్ బాబు, హౌసింగ్ ఏఈ పాల్గొన్నారు.

February 21, 2026 / 12:30 PM IST

బాన్సువాడలో ప్రశాంతత.. పుకార్లను నమ్మవద్దు: SP

KMR: బాన్సువాడలో ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా ప్రశాంతంగా ఉందని, ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని SP రాజేశ్ చంద్ర స్పష్టం చేశారు. నిన్న జరిగిన సంఘటనపై పోలీసులు ఇప్పటికే కేసులు నమోదు చేసి, లోతైన దర్యాప్తు జరుపుతున్నారన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి, చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని SP పేర్కొన్నారు.

February 21, 2026 / 12:28 PM IST

‘గ్రంథాలయంలో వసతులు కల్పించాలి’

SRPT: నడిగూడెం మండలం కేశవపురంలో ఇంటి పన్నుతో పాటు గ్రంథాలయ పన్ను వసూలు చేస్తున్న అధికారులు వసతుల కల్పనలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారని బీజేపీ నాయకులు, నిరుద్యోగులు ఆరోపించారు. కనీసం దినపత్రికలు కూడా లేకపోవడంతో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారని మండిపడ్డారు. వెంటనే గ్రంథాలయంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని వారు కోరుతున్నారు.

February 21, 2026 / 12:27 PM IST

ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

రచ్చమల్లపాడు ఉన్నత పాఠశాలలో శనివారం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అరుణకుమారి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భాష అనేది కేవలం సంభాషణ సాధనం మాత్రమే కాకుండా ఒక జాతి సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్రను సంరక్షించే అత్యంత కీలకమైన ఆధారం అని తెలిపారు. మాతృభాషను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆమె పేర్కొన్నారు

February 21, 2026 / 12:27 PM IST

‘మొదటి ప్రయత్నంలోనే సాధించడం అభినందనీయం’

ప్రకాశం: ఇటీవల గ్రూప్ -1కు ఎంపికైన విజేతలకు APUWJ ఆధ్వర్యంలో మార్కాపురం ప్రెస్ క్లబ్లో శనివారం అభినందన సభ కార్యక్రమాన్ని చేపట్టారు. ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, అధ్యక్షులు ఐ వి సుబ్బారావు హాజరై, వారిని అభినందించారు. మొదటి ప్రయత్నంలోనే అత్యంత ఉన్నత ఉద్యోగాన్ని సాధించడం అభినందనీయమనీ కొనియాడారు. కార్యక్రమంలో జేసీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

February 21, 2026 / 12:26 PM IST

రాములబండ బ్రహ్మోత్సవాలు ప్రారంభం

NLG: నల్గొండ మండలంలోని రాములబండ శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలు శనివారం నుంచి మార్చి మూడవ తేదీ వరకు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఇవాళ తోరణం, 22న అధ్యయన ఉత్సవాలు, 23న పరమపదోత్సవం, మార్చి 1న రథయాత్ర జరుగుతుందని ఆలయ కమిటీ వివరించింది. భక్తులు పాల్గొని ఆ స్వామి వారిని దర్శించుకోవాలని కోరారు.

February 21, 2026 / 12:25 PM IST

విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి

MBNR: రాజాపూర్ మండలం చెన్నవల్లి గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి పిట్టల శ్రీకాంత్ (25) అనే యువకుడు మృతి చెందాడు. తన ఇంటి బాత్రూంపై తెగిపడిన విద్యుత్ వైరు సరిచేస్తుండగా బలమైన షాక్ తగిలింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే MBNR ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

February 21, 2026 / 12:24 PM IST

చీపురు పట్టిన ఎమ్మెల్యే

SKLM: రణస్థలం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో స్వచ్ఛ ఆంధ్రా – స్వర్ణ ఆంధ్రా కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే ఈశ్వరరావు శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చీపురు పట్టి మండల పరిషత్ కార్యాలయ ప్రాంతాల్లో శుభ్రం చేశారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు.

February 21, 2026 / 12:23 PM IST

స్వచ్ఛ రథ ప్రారంభోత్సవంలో జిల్లా అధికారులు

CTR: జీడీనెల్లూరు ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో స్వచ్ఛ రథం వాహనాన్ని పారిశుద్ధ్య కార్మికుల చేతుల మీదుగా జడ్పీ సీఈవో రవికుమార్, డీపీవో సుధాకర్, ఆర్డీవో శ్రీనివాసులు, ఎంపీడీవో మనోహర్ గౌడ్ శనివారం ప్రారంభించారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర (SASA) కార్యక్రమంలో భాగంగా దీనిని ప్రారంభించినట్లు తెలిపారు.

February 21, 2026 / 12:23 PM IST

బంగారు పతకం సొంతం చేసుకున్న ఏసీపీ జోడి

WGL: తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో వరంగల్ కమిషనరేట్ ఏసీపీలు సత్తా చాటారు. 55 ఏళ్ల గెజిటెడ్ అధికారుల బ్యాడ్మింటన్ విభాగంలో ఏసీపీలు జితేందర్ రెడ్డి, మధుసూదన్‌ల జోడీ అద్భుత ప్రదర్శనతో బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. అద్భుతమైన ఆటతీరుతో వారు బంగారు పతకం సొంతం చేసుకోగా శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి.

February 21, 2026 / 12:21 PM IST

తుని-అన్నవరం మధ్య రానున్న కొత్త ఎయిర్ పోర్టులు

KKD: రాష్ట్రవ్యాప్తంగా నూతనంగా 9 ఎయిర్ పోర్టులు నిర్మించే ప్రణాళికలో భాగంగా తుని – అన్నవరం మధ్య విమానాశ్రయ నిర్మాణానికి ప్రభుత్వం మొగ్గు చూపింది. తొలుత కరప మండలం గురజానాపల్లిలోని సాల్ట్ భూములను పరిశీలించినా, సాంకేతిక కారణాలతో తుని ప్రాంతాన్ని ఎంపిక చేస్తూ డీపీఆర్ సిద్ధం చేశారు.భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ప్రభుత్వం ఇక్కడే నిర్మాణం చేయనున్నారు.

February 21, 2026 / 12:21 PM IST

‘బహిరంగ మలమూత్ర విసర్జనను అరికట్టాలి’

AKP: బహిరంగ మలమూత్ర విసర్జనను అరికట్టాలని కోటవురట్ల డిప్యూటీ ఎంపీడీవో కూర్మారావు విజ్ఞప్తి చేశారు. శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర‌ కార్యక్రమంలో భాగంగా ‌కోటవురట్లలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రతిజ్ఞ చేయించారు. ఈ కూర్మారావు మాట్లాడుతూ.. ప్రజలు ప్లాస్టిక్ వినియోగానికి దూరంగా ఉండాలన్నారు. చెత్తను ‌ ఎప్పటికప్పుడు తొలగించి సంపద కేంద్రాలకు తరలించాలన్నారు.

February 21, 2026 / 12:20 PM IST

ఇంటింటా తడి–పొడి చెత్త సేకరణలో కలెక్టర్

GNTR: పరిశుభ్రమైన పరిసరాలే మన లక్ష్యమని గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. స్వర్ణ ఆంధ్రా–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా మేడికొండూరు మండలం పేరిచర్లలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద మొక్కలు నాటి, గ్రామంలో చెత్త ఊడ్చే కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు.

February 21, 2026 / 12:19 PM IST

పలమనేరులో “స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంద్ర” ర్యాలీ

CTR: పలమనేరు మున్సిపల్ కమిషనర్ రమణా రెడ్డి ఆధ్వర్యంలో “స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంద్ర” ర్యాలీ శనివారం నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి టవర్ క్లాక్ వరకు కొనసాగింది. కమిషనర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ పారిశుద్ధ్య కార్మికులకు తడి, పొడి చెత్తను వేర్వేరుగా అందించాలని కోరారు. ప్రతి వార్డులో శానిటేషన్ సిబ్బంది స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు.

February 21, 2026 / 12:18 PM IST