GDWL: మహిళా విద్య, రాజ్యాంగ అవగాహనతోనే ఉన్నతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం గద్వాలలో జన విజ్ఞాన వేదిక (JUU) ఆధ్వర్యంలో రూపొందించిన ‘ఆడపిల్లల చదువు ఆవశ్యకత’ పోస్టర్, ‘బాలల కోసం భారత రాజ్యాంగం’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు.
NZB: నవీపేట్ మండలం బాసర గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్న మహిళ వివరాలను నవీపేట్ ఎస్సై శ్రీకాంత్ వెల్లడించారు. నాందేడ్ జిల్లా ధర్మాబాద్ తాలూకాలోని కాక్టైలి గ్రామానికి చెందిన అనసూయా దిలీప్ మోతెవాడ (23)గా నిర్ధారించారు. ఆమె దిలీప్ మోతెవాడ భార్యగా గుర్తించారు. వారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
AKP: లీజు పేరుతో ఆర్టీసీ స్థలాలను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వవద్దని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సిబ్బంది శుక్రవారం ధర్నా నిర్వహించారు. స్థానిక ఆర్టీసీ డిపో ఎదుట నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఎస్.డబ్ల్యూ.ఎస్. జిల్లా కార్యదర్శి పరమేశ్వర రావు మాట్లాడుతూ డిపోల మూసివేత చర్యలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
HNK: జిల్లాలో చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు ఏయే దశల్లో ఉన్నాయో కలెక్టర్ స్నేహ శబరీష్ అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం అధికారులతో సమీక్ష నిర్వహించగా.. మార్క్ అవుట్ అయినవి ఎన్ని, ఇండ్లు మంజూరై ఇంకా పనులు మొదలు కాని వాటి వివరాలు ఆయా శాఖల అధికారులు, ఎంపీడీవోలు కలెక్టర్‌కు వివరించారు. పనుల ఆలస్యానికి కారణాలను తెలుసుకున్నారు.
AKP: మునగపాక మండలం పాటిపల్లి ఏపీ మోడల్ స్కూల్‌లో ఆరో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీలక్ష్మి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 24 నుంచి మార్చి 31వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఓసీ, బీసీ, EWS వారు రూ.200, ఎస్సీ ఎస్టీ, PHC చెందినవారు రూ.125 దరఖాస్తు ఫీజుతో చెల్లించాలన్నారు.
ADB: స్కౌట్ అండ్ గైడ్స్ వ్యవస్థాపకులు ‘బెడెన్ పావెల్’ దంపతుల జన్మదినాన్ని పురస్కరించుకొని ఈనెల 22న ‘థింకింగ్ డే’ కార్యక్రమాన్ని నిర్వహించాలని జిల్లా విద్యాశాఖాధికారి, భారత్ స్కౌట్అండ్ గైడ్స్ జిల్లా చీఫ్ కమీషనర్, ఏసీఎల్.బీ ఎస్. రాజేశ్వర్ తెలిపారు. అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో ఘనంగా నిర్వహించేలా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుడు చర్యలు తీసుకోవాలన్నారు.
KNR: కరీంనగర్ పట్టణంలోని బొమ్మకల్ ఫ్లైఓవర్ వద్ద అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. నారాయణరావుపల్లికి చెందిన కన్నం రమేష్, దుర్షేడ్‌కు చెందిన చేను రాజులను అరెస్టు చేసి, యజమానులపై కేసులు నమోదు చేశారు. నిందితులను తహశీల్దార్ ఎదుట హాజరుపరిచి రూ. లక్షకు బైండోవర్ చేసినట్లు సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు.
AP: పల్నాడు జిల్లా వినుకొండలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 12:40 గంటలకు వినుకొండకు చేరుకుంటారు. పట్టణంలోని ఎన్నెస్పీ మైదానంలో నిర్వహించే స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొననున్నారు. స్వచ్ఛరథాలను ప్రారంభించిన అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. మధ్యాహ్నం 3:05 గంటలకు టీడీపీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు.
RR: తలకొండపల్లి ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న అజయ్ అనే విద్యార్థి సబ్ జూనియర్ U16 వాలీబాల్ గేమ్స్‌లో జాతీయస్థాయికి సెలెక్ట్ అయినట్లు పీడీ పాండు తెలిపారు. వారం రోజుల నుంచి నిజామాబాద్ జిల్లాలోని నేషనల్ క్యాంపులో అజయ్ పాల్గొని ఉత్తమ ప్రదర్శన కనబరిచాడు. ఈ నెల 23 నుంచి కలకత్తాలో జాతీయస్థాయి వాలీబాల్ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.
NGKL: శ్రీశైలం ఘాట్ రోడ్డులోని వటవర్లపల్లి గ్రామ శివారులో శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, మినీ ట్రావెల్స్ బస్సు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో 18 మంది ప్రయాణికులు గాయపడగా, లక్ష్మయ్య అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
MDK: తూప్రాన్ పట్టణంలో APకి చెందిన మధుసూదన్ (32) శుక్రవారం రాత్రి అనుమానాస్పదంగా మృతి చెందాడు. చేగుంట మండలంలోని ఓ కంపెనీలో పనిచేస్తున్న అతను తూప్రాన్ పట్టణంలో అద్దెకు ఉంటున్నాడు. నిన్న కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా.. లిఫ్ట్ చేయకపోవడంతో తెలిసిన వాళ్లకు ఫోన్ చేశారు. రాత్రి అద్దె గది కిటికీలోంచి చూడగా మృతి చెంది ఉన్నట్లు గమనించారు. ఈ ఘటణపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
PDPL: జాతీయ మానవ హక్కుల కమిటీ నూతన సంవత్సర క్యాలెండర్‌ను, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా శుక్రవారం ఆవిష్కరించారు. జిల్లా మానవ హక్కుల కమిటీ జిల్లా ప్రతినిధులు సీపీని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజల, కార్మికుల హక్కులకు ఎక్కడ భంగం కలగకుండా చూసుకుంటామన్నారు. ప్రతినిధులు ఎజ్జ రాజయ్య, సభ్యులు పాల్గొన్నారు.
NDL: గ్రామ పంచాయతీలు సొంత ఆదాయ వనరులు పెంపొందించుకోవాలని ఎంపీడీవో మేరీ సూచించారు. శుక్రవారం కొత్తపల్లి ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులకు ప్రత్యేక కార్యాచరణ, ప్రణాళిక శిక్షణ నిర్వహించారు. గ్రామాల్లో ఆస్తి, ఇతర పన్నుల ద్వారా ఆదాయం సృష్టించాలని ఆమె కోరారు. పంచాయతీల ఆర్థిక స్థిరీకరణకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు.
TPT: రేణిగుంట పట్టణంలో ఎంటీఆర్ సర్కిల్ వద్ద శుక్రవారం సాయంత్రం వాహనాల తనిఖీలు నిర్వహించారు. సీఐ జయచంద్ర ఆధ్వర్యంలో SI ధర్మారెడ్డి, ఆర్టీవో శ్రీనివాసరావు, సిబ్బంది సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. అధిక కాంతి వెలువరించే LED బల్బులు అమర్చిన వాహనాలను గుర్తించి తొలగించేశారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అల్లూరి: స్వయం సహాయక సంఘాల గిరిజన మహిళలు, హస్తకళల వస్తువులను విక్రయించే మహిళలకు వచ్చేనెల 9,10వ తేదీల్లో ఆధునిక 3D ప్రింటింగ్ సాంకేతికతపై రెండు రోజులు శిక్షణ ఇవ్వనున్నట్లు ఐటీడీఏ పీవో శ్రీపూజ తెలిపారు. పాడేరు కాఫీ హౌస్‌లో జరిగే శిక్షణకు 10వ తరగతి అర్హత కలిగిన మహిళలు ధరఖాస్తు చేసుకోవాలన్నారు. మహిళలు మార్చి 5లోగా పాడేరు ఐటీడీఏ కార్యాలయంలో ధరఖాస్తులు అందించాలన్నారు.