ప్రకాశం: జరుగుమల్లిలో శనివారం నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి స్వయంగా చెత్త ఊడ్చి పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామంలో పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించి, పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
CTR: అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని శనివారం పుంగనూరు కొత్తయిండ్లు మున్సిపల్ ఉన్నత పాఠశాలలో తెలుగు భాషా విజ్ఞాన వికాస సమితి అధ్యక్షలు రెడ్డప్ప రెడ్డి యాదవ్ నిర్వహించారు. ఈసందర్భంగా అయన విద్యార్థులను ఉద్దేశించి అయన ప్రశాంగించారు. అమ్మ వంటి మాతృభాషను ఎన్నటికీ మరవకూడదన్నారు. తెలుగు భాష యొక్క ఔన్నత్యం గురించి వివరించారు.
JGL: కోరుట్ల పట్టణ శివారు డీ- 40 కెనాల్ సమీపంలోని ఓ వ్యవసాయ బావిలో ఓ మృతదేహం లభించింది. ఆ మృతదేహం మేడిపల్లి మండలం కంట్లకుంట గ్రామానికి చెందిన గుండంపల్లి శంకర్‌గా పోలీసులు గుర్తించారు. కాగా శంకర్ ఈ నెల 13న మెట్‌పల్లిలో అత్తగారింటికి వెళ్తానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరి రాలేదని, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై చిరంజీవి తెలిపారు.
SRPT: గరిడేపల్లి మండలం పొనుగోడులో ఇవాళ అగ్రికల్చర్ జాయింట్ డైరెక్టర్ సుందర్ కిరణ్ కుమార్ (మాజీ DRDA PD) నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో ఆయన స్వగృహం, కార్యాలయాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు తెలియల్సి ఉంది.
TG: రాష్ట్రంలో పత్తి రైతులకు ఊరట లభించింది. ఈ నెలాఖరు వరకు పత్తి కొనుగోళ్ల గడువును సీసీఐ పొడిగించింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై మంత్రి హర్షం వ్యక్తం చేస్తూ, రైతులందరూ ఈ పొడిగించిన గడువును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో కొనుగోలు ప్రక్రియ వేగంగా జరిగేలా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు.
మహబూబ్ నగర్లో DDU-GKY & స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ద్వారా నిరుద్యోగ యువతులకు నర్సింగ్ అసిస్టెంట్ కోర్సులో ఉచిత శిక్షణ అందిస్తున్నారని కో-ఆర్డినేటర్ రవికుమార్ తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులు. ఎంపికైన వారికి ఉచిత శిక్షణ, వసతి, భోజన సదుపాయం కల్పిస్తారు. దరఖాస్తులు ఈ నెల 23వ తేదీకి ముందే చేయాలని, 9949698592లో సంప్రదించాలని ఆయన సూచించారు.
T20 WC: సూపర్-8లో భాగంగా రేపు భారత్ vs సౌతాఫ్రికా మ్యాచ్ జరగనుంది. ఇందులో అన్న ఆల్బీ మోర్కెల్(SAస్పెషలిస్ట్ కన్సల్టెంట్), తమ్ముడు మోర్నే మోర్కెల్(IND బౌలింగ్ కోచ్) కూడా కోచ్‌గా తలపడనున్నారు. అంతర్జాతీయ స్థాయిలో కలిసి ఆడిన బ్రదర్ జోడీలు ఎన్నో ఉన్నా కోచ్‌లుగా ప్రత్యర్థి స్థానంలో తలపడటం దాదాపు ఇదే తొలిసారి. మరి ఈ అన్నదమ్ముల్లో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.
KDP: బద్వేలులో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కార్యాలయంలో కేక్ కట్ చేసి ఎమ్మెల్యే డా. సుధ శుభాకాంక్షలు తెలిపారు. యద్దారెడ్డి స్వగృహంలో మాజీ కుడా చైర్మన్ గురుమోహన్ అభినందనలు తెలియజేశారు. ఆనంద నిలయంలో వైసీపీ నాయకులు సింగనమల వెంకటేశ్వర్లు కేక్ కట్ చేసి వృద్ధులకు అన్నదానం చేశారు.
HNK: హోలీ పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైలు సర్వీసులను ప్రకటించింది. కాజీపేట జంక్షన్ మీదుగా చర్లపల్లి-దానాపూర్ మార్గంలో మొత్తం 12 ప్రత్యేక రైళ్లను ఫిబ్రవరి 23, 25, 27, 28, మార్చి 1, 3, 5, 7, 9వ తేదీల్లో నడవనున్నాయి. ఈ రైళ్లలో 2ఏసీ, 3ఏసీ, స్లీపర్, జనరల్ ఉన్నాయి.
ASF: బెజ్జూర్ మండలం రెబ్బెనలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద రూ.10 లక్షల అంచనాతో మంజూరైన మహిళా సమాఖ్య భవనానికి MLA హరీష్ బాబు శనివారం శంకుస్థాపన చేశారు. MLA మాట్లాడుతూ.. ప్రతి గ్రామపంచాయతీకి మహిళా సమాఖ్య భవనం, ప్రతి మండలంలో రూ.30 లక్షల అంచనాతో గిడ్డంగి నిర్మాణం చేపట్టనున్నామని తెలిపారు. సర్పంచ్ నందిపేట రాజయ్య, మహిళా సమాఖ్య సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు నటించిన ‘విష్ణు విన్యాసం’ మూవీ FEB 28న రిలీజ్ కానుంది. దాదాపు రూ.19 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీకి ప్రీ రిలీజ్ బిజినెస్ ద్వారా రూ.26 కోట్లు వచ్చినట్లు సమాచారం. థియేట్రికల్ హక్కులు రూ.10 కోట్లు, నాన్ థియేట్రికల్ రైట్స్ రూ.16 కోట్లకు అమ్ముడైనట్లు టాక్. దీంతో విడుదలకు ముందే నిర్మాతలకు రూ.7 కోట్లు లాభాల వచ్చినట్లు తెలుస్తోంది.
PPM: ఈనెల 23వ తేదీ నుంచి మార్చి ఒకటో తేదీ వరకు మన్యం జిల్లా లో 33 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయని DIEO వై.నాగేశ్వరరావు శనివారం ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. 17,530 మంది విద్యార్థులు హాజరవుతారని తెలిపారు. రెండు ఫ్లయింగ్, రెండు సిట్టింగ్ స్క్వాడ్స్, DEC మెంబర్స్ కన్వీనర్ DIEO మొత్తం నాలుగు వాహనాల్లో పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో తనిఖీలు నిర్వహిస్తారు.
E.G: రాజమండ్రి రూరల్ మండలం సుబ్బారావు పేటలో జరిగిన అగ్ని ప్రమాదంలో మద్దా నూతయ్య, వనులమ్మకు చెందిన తాటాకు ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. విషయం తెలుసుకున్న రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ యానాపు ఏసు తదితరులు బాధిత కుటుంబ సభ్యులను శనివారం పరామర్శించి నిత్యవసర సరుకులు అందజేశారు. దృష్టి తీసుకెళ్ళి బాధితులకు న్యాయం చేస్తామన్నారు.
SKLM: స్వచ్ఛ ఆంధ్రా-స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం పట్టణంలో ప్రత్యేక శుభ్రతా కార్యక్రమం నిర్వహించారు. డీసీబీ కాలనీలో మొక్కలు నాటడం, ఉమా రుద్ర కోటేశ్వర స్వామి ఆలయం పరిసరాల్లో శుభ్రతా పనులు చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ కార్మికులతో కలిసి స్వయంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజల సహకారం అవసరమని ఆయన అన్నారు.
సత్యసాయి: లేపాక్షి పోలీస్ స్టేషన్ పరిధిలోని చౌవలసముద్రం టోల్ ప్లాజా వద్ద పోలీసులు శనివారం ప్రత్యేక వాహన తనిఖీలు చేపట్టారు. హిందూపురం రూరల్ సీఐ జనార్ధన్, ఎస్సై నరేంద్ర వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచిస్తూ, పలువురికి హెల్మెట్లు పంపిణీ చేశారు.