PPM: మార్చి 16 నుండి జిల్లాలో జరగబోయే పదవ తరగతి పరీక్షలకు పక్కా ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవిన్యూ అధికారి కె. హేమలత అధికారులను ఆదేశించారు. సోమవారం పదవ తరగతి ఏర్పాట్లపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలన్నారు.
AP: రేపటి నుంచి మూడు రోజులపాటు లెజిస్లేచర్ క్రీడా పోటీలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించారు. క్రీడాకారులకు (శాసనసభ్యులు, మండలి సభ్యులు, సిబ్బందికి) ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. ప్రజా ప్రతినిధుల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందించడం, శారీరక దృఢత్వంపై అవగాహన కల్పించడం ఈ పోటీల ముఖ్య ఉద్దేశ్యం.
TPT: ఏర్పేడు మండలం సరస్వతి కండ్రిగ గ్రామంలో YSR కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీని ఏర్పాటు చేశారు. గ్రామ పార్టీ అధ్యక్షుడిగా రెడ్డివారి చంద్రశేఖర్ రెడ్డి ఎన్నికయ్యారు. వివిధ విభాగాలకు అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులను ఎంపిక చేశారు. మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు మండల నాయకుల ఆధ్వర్యంలో ఈ ఎన్నిక జరిగింది.
VZM: ఈనెల 23, 24వ తేదీలలో సీడీపీవో కార్యాలయం వద్ద చేపట్టవలసిన దీక్షలపై సోమవారం వియ్యంపేట ఐసీడీఎస్ అంగన్వాడీ కార్యకర్తలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 2019 నుంచి జీతాలు పెంచలేదని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా తమ సమస్యలను పరిష్కరించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ మేరకు 42 రోజులు దీక్షలు చేసినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం లేదన్నారు.
MDCL: ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఎంతోమంది కాంగ్రెస్‌లో చేరుతున్నారని ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఉప్పల్ నియోజకవర్గం HMT నగర్ డివిజన్ పరిధిలో సామాజిక కార్యకర్త భావన గౌడ్ తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ASR: జిల్లా ఎస్పీ శ్రీ అమిత్ బర్ధర్ ఆదేశాలతో పెదబయలు ఎస్సై వెంకటేష్ అడుగులపుట్టు గ్రామంలో అవగాహన సదస్సు నిర్వహించారు. రోడ్డు భద్రత, సైబర్ మోసాలు, మహిళల రక్షణతో పాటు గంజాయి, నాటుసారా (ID Arrack) అనర్థాలపై గ్రామస్తులను అప్రమత్తం చేశారు. నేర రహిత సమాజం కోసం ప్రజలు పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.
అగ్రి గోల్డ్ బాధితుల సమస్యను పరిష్కరించేందుకు విజయవాడలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని అగ్రి గోల్డ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. పార్వతీపురంలో ఆయన మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్ సంస్థ ఈ జనవరి నాటికి మూసి 12 ఏళ్ళు పూర్తి అయిందన్నారు. అయినా కానీ ఆ సమస్య అలాగే ఉందన్నారు.
ఏలూరు: జిల్లాలో 10 పబ్లిక్ పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం చేస్తున్నట్లు కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు 133 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయని, మొత్తం 14,019 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు జరుగుతాయని, విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
TG: హైదరాబాద్ మెట్రోను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎల్ అండ్ టీ నుంచి స్వాధీనం చేసుకునేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇకపై మెట్రో పూర్తిగా ప్రభుత్వ రంగ సంస్థగా మారనుంది. దీంతో ఫేజ్-2 విస్తరణ పనుల్లో వేగం పెరిగే అవకాశం ఉంది.
MHBD: నాగర్ కర్నూల్ మండలం కుమ్మేర మల్లన్న జాతరలో రజక కుటుంబంపై దాడి చేసి, రెండు నెలల పసికందు మృతికి కారకులైన అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని రజక సంఘం జిల్లా కార్యదర్శి పున్నం సారయ్య డిమాండ్ చేశారు. మల్లన్న దర్శనం కోసం వెళ్లిన చాకలి చంద్రకళ కుటుంబాన్ని అడ్డుకోవడం సభ్య సమాజం తలదించుకోవలసిన విషయమని మండిపడ్డారు.
ADB: గంజాయి కేసులో ఇద్దరు నిందితులు జాధవ్ సాయినాథ్, బనియా గోవింద్ అరెస్ట్ చేసినట్లు CI గురుస్వామి సోమవారం తెలియజేశారు. ఈ మేరకు నిందితులపై బోథ్ పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. మాదక ద్రవ్యాల విక్రయం, వినియోగంపై కఠిన చర్యలు కొనసాగుతాయన్నారు. ప్రజలు అనుమానాస్పద సమాచారాన్ని వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.
KMM: హైదరాబాద్‌లోని మొయినాబాద్ ఐఐటీఏ (IITA) శిక్షణ కేంద్రంలో 8 నెలల పాటు కఠినమైన శిక్షణ పూర్తి చేసుకున్న పింకీ (Pinky), రోక్సీ (Roxy) అనే రెండు పోలీస్ జాగిలాలు విధుల్లో చేరాయి. ఈ సందర్భంగా ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మాట్లాడుతూ.. నేరాల పరిశోధన, పేలుడు పదార్థాల గుర్తింపు, నిందితుల వేటలో ఈ జాగిలాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.
MBNR: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి నియోజకవర్గంలోని ప్రతి తండాకు బీటీ రోడ్లు నిర్మించి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. నవాబుపేటలో జరిగిన సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల్లో పాల్గొని, గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. గిరిజన తండాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామని స్పష్టం చేశారు.
BDK: హైదరాబాద్ సెక్రటేరియట్లో సీఎం సహాయనిధి విభాగాన్ని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సోమవారం సందర్శించారు. అశ్వారావుపేట పరిధిలోని ఐదు మండలాలకు చెందిన అనారోగ్య బాధితులు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన బిల్లులను ఆర్థిక సహాయం కోసం సంబంధిత అధికారులకు అందజేశారు. త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను కోరారు.
KNR: సైబరాబాద్లో జరిగిన 4వ రాష్ట్రస్థాయి పోలీస్ స్పోర్ట్స్ మీట్లో కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు 35 పతకాలతో సత్తా చాటారు. ఇందులో 9 స్వర్ణ, 13 రజత, 13 కాంస్య పతకాలు ఉన్నాయి. ఏసీపీ మాధవి, పీసీలు స్వప్న, శ్రీజ, శ్రీధర్ పలు విభాగాల్లో అగ్రస్థానంలో నిలిచారు. విజేతలను సీపీ గౌష్ ఆలం అభినందిస్తూ.. విధి నిర్వహణలో ఉంటూనే క్రీడల్లో రాణించడం గర్వకారణమని కొనియాడారు.