• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

సోషల్ మీడియా ద్వారా పాలకుల దృష్టికి సమస్యలు

NLR: సోషల్ మీడియాతో విద్యార్థులు పెడదారిన పడుతున్న సమయంలో అదే వేదికగా తమ సమస్యలు పాలకుల దృష్టికి తీసుకువెళ్తున్న సందర్భాలు జరుగుతున్నాయి. ఇటీవల కొండాపురం(M) గజ్జలవారిపల్లికి విద్యార్థులు రోడ్డు లేదని SM ద్వారా తెలియజేయడంతో పవన్ కళ్యాణ్ స్పందించారు. అదే పందాను అనుసరిస్తూ విద్యార్థులు తమకు రోడ్లు లేవని చేతులెత్తి ముక్కుతూ వీడియో విడుదల చేయడం కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తుంది.

February 21, 2026 / 06:00 PM IST

నంద్యాలలో రోడ్డు పనులతో ట్రాఫిక్ సమస్య

నంద్యాలలోని శ్రీనివాస సెంటర్ నుండి సంజీవ నగర్ సర్కిల్ వరకు జరుగుతున్న రహదారి పనుల వల్ల ఇవాళ తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (SDPI) నేతలు అధికారుల నిర్లక్ష్యాన్ని విమర్శించారు. ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ను మళ్లించాలని కోరారు. పనులను వేగంగా పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.

February 21, 2026 / 06:00 PM IST

క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్లను అందజేసిన ఎమ్మెల్యే

SKLM: క్రీడలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతి ఇస్తుందని ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. శనివారం సాయంత్రం ఆమదాలవలస మున్సిపాలిటీ జగ్గు శాస్త్ర పేట గ్రామం వద్ద ఉన్న ఎన్టీఆర్ గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో సౌత్ జోన్ నేషనల్ సాఫ్ట్ బాల్ కోచింగ్ క్యాంపెయిన్‌ను స్థానిక ఎమ్మెల్యే రవికుమార్ ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్లను అందజేశారు.

February 21, 2026 / 05:55 PM IST

వేసవిలో విద్యుత్ కోతలు ఉండొద్దు: డైరెక్టర్

SRPT: రాబోయే వేసవిలో వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ శాఖ ఆపరేషన్స్ డైరెక్టర్ డాక్టర్ ఎన్. నర్సింహులు అధికారులను ఆదేశించారు. శనివారం సూర్యాపేటలోని 60 ఫీట్ల రోడ్డులో నిర్వహించిన ‘ప్రజా బాట’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.

February 21, 2026 / 05:55 PM IST

షెడ్యూల్ కులాల విద్యార్థులకు శుభవార్త..!

BHPL: జిల్లాలోని షెడ్యూల్డ్ కులాలకు చెందిన విద్యార్థులు, విద్యార్థినులు విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించడానికి అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి ఇందిరా ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. అర్హత గల విద్యార్థులు మార్చి 31వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఇందిర సూచించారు.

February 21, 2026 / 05:54 PM IST

ఎడ్యుకేషన్ ఫెయిర్‌ను ప్రారంభించిన మున్సిపల్ ఛైర్మన్

SRPT: హుజూర్ నగర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలు శనివారం ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహించారు. హుజూర్ నగర్ మున్సిపల్ ఛైర్మన్ శ్రీనివాస్ గౌడ్ ఈ ప్రదర్శనను ప్రారంభించారు. విద్యార్థులు రూపొందించిన సైన్స్, విజ్ఞాన నమూనాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమాలు పిల్లల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందిస్తాయని అన్నారు.

February 21, 2026 / 05:52 PM IST

నెలరోజుల తాగునీటి ఎద్దడికి పరిష్కారం

RR: షాద్ నగర్ పట్టణంలోని 20వ వార్డులో తాగునీటి ఎద్దడికి పరిష్కారం లభించింది. నెలరోజులుగా బోరు పాడు కావడంతో ప్రజలు తాగునీటి ఎద్దడి ఎదుర్కొంటున్నారు. వార్డు ప్రజలు ఈ విషయాన్ని కౌన్సిలర్ గోపాల్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కౌన్సిలర్ బోరును బాగు చేయించి తాగునీటి ఎద్దడిని తీర్చారు. దీంతో వార్డు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

February 21, 2026 / 05:52 PM IST

భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలి: MLA

TPT: చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలోని శ్రీశ్రీ ముత్యాలమ్మ వారి జాతర మహోత్సవం ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. దేవాలయం ప్రాంగణంలోని మీటింగ్ హాల్‌లో అధికారులు, పాలకమండలి సభ్యులతో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ సమీక్షించారు. జాతరకు నలుమూలల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సమగ్ర ఏర్పాట్లు చేయాలని సూచించారు.

February 21, 2026 / 05:49 PM IST

ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య

JGL: ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఇబ్రహీంపట్నంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన లక్కం రాజశేఖర్ (45) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు లుంగీతో ఉరివేసుకున్నాడు. మృతుడి అన్న లక్కం శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి దర్యాప్తు ప్రారంభించారు.

February 21, 2026 / 05:48 PM IST

లిక్కర్ స్కాం.. విచారణ వాయిదా

AP: లిక్కర్ స్కాం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టు విచారణ చేపట్టింది. ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప బెయిల్ పిటిషన్లపై విచారణ జరిగింది. ఈ క్రమంలో ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం విచారణను ఈనెల 27కి వాయిదా వేసింది.

February 21, 2026 / 05:48 PM IST

రాష్ట్రంలో దుర్మార్గపు పాలన: సట్టు తిరుమలేశ్‌

BHNG: రాష్ట్రంలో దుర్మార్గపు దౌర్జన్య పాలన కొనసాగుతుందని బీఆర్ఎస్ రాజాపేట‌ మండలాధ్యక్షుడు సట్టు తిరుమలేశ్ అన్నారు. శనివారం రాజాపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యలపై నిలదీస్తున్నాడనే కక్ష‌తోనే బాల్క సుమన్‌పై కాంగ్రెస్ ప్ర‌భుత్వం అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపడం దుర్మార్గపు చర్య అని అన్నారు.

February 21, 2026 / 05:48 PM IST

అప్పన్న సన్నిధిలో అశోక్ గజపతిరాజు దంపతులు

VSP: గోవా గవర్నర్‌ అశోక్ గజపతిరాజు దంపతులు శుక్రవారం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంను దర్శించుకున్నారు. దేవస్థానం తరఫున కార్యనిర్వహణాధికారి జే. వెంకట్రావు ఘన స్వాగతం పలికారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు, సీతారామాచార్యులు వేదపండితులతో కలిసి పూర్ణకుంభ స్వాగతం అందించారు.

February 21, 2026 / 05:47 PM IST

ఉచిత శిక్షణకు దరఖాస్తులు స్వీకరణ: కలెక్టర్

PDPL: జిల్లాలోని నిరుద్యోగ యువతకు టాస్క్ రీజియన్ సెంటర్ ఆధ్వర్యంలో జావా, వెబ్ డెవలప్మెంట్, సీ, HTML, CSS, జావా స్క్రిప్ట్, టాలీ విత్ జీఎస్టీ, మొదలైన కోర్సుల్లో ఉచిత శిక్షణ అందివ్వనున్నట్లు కలెక్టర్ శ్రీహర్ష శనివారం తెలిపారు. డిగ్రీ పూర్తి చేసిన ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 28 లోపు పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు 9059506807లో సంప్రదించాలి.

February 21, 2026 / 05:47 PM IST

మున్నూరుకాపు సంఘం నూతన కమిటీ ఎన్నిక

JNG: బచ్చన్నపేట మండలం పొచ్చన్నపేట గ్రామ మున్నూరుకాపు సంఘం నూతన కమిటీ ఎన్నిక జరిగినట్లు సంఘం సభ్యులు శనివారం తెలిపారు. అధ్యక్షులుగా జుల కిష్టయ్య, ప్రధాన కార్యదర్శిగా చింతపండు బాలకృష్ణ ప్యానెల్ విజయం సాధించింది. ఉపాధ్యక్షులుగా గోపాల నర్సిములు, సభ్యులుగా ముదం సిద్దయ్య, జుల భాస్కర్లు, సలహాదారులుగా చింతపండు ఆంజయ్య, మట్టి బిక్షపతి, క్రిష్ణలు ఎన్నికయ్యారు.

February 21, 2026 / 05:44 PM IST

బీఆర్ఎస్‌కు భారీ షాక్..!

MDK: చిన్న శంకరంపేట మండలంలో బీఆర్ఎస్‌కు భారీ షాక్ తగిలింది. ఖాజాపూర్ సర్పంచ్ బాలస్వామి, ఉపసర్పంచ్ అక్బర్, కాజాపూర్ తండాకు చెందిన ప్రియనాయక్ సహా సుమారు 80 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి మైనంపల్లి హనుమంత రావు, మండల నాయకుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

February 21, 2026 / 05:44 PM IST