• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

గుమ్మలక్ష్మీపురంలో జీవనోపాధుల సర్వేపై సమీక్ష.

PPM: జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలో డీఆర్‌డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ సుధారాణి జీవనోపాధుల సర్వే, ప్రాజెక్ట్ ప్రాధాన్యతా పనులు, రికవరీలపై మండల సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. మహిళా మార్ట్‌ను సందర్శించి అమ్మకాలు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీపీఎం ఫైనాన్స్, మండల సిబ్బంది పాల్గొన్నారు.

February 24, 2026 / 01:41 PM IST

మహిళా భవన నిర్మాణానికి భూమి పూజ

VKB: దోమలో MLA రామ్మోహన్‌రెడ్డి సహకారంతో రూ.10 లక్షల వ్యయంతో మహిళా డ్వాక్రా వర్క్ షెడ్జ్ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించినట్లు సర్పంచ్ మాలి శివకుమార్‌రెడ్డి తెలిపారు. మహిళల స్వయం ఉపాధి అభివృద్ధికి ఈ వర్క్ షెడ్జ్ ఉపయోగపడుతుందని, మహిళా సంఘాల కార్యకలాపాలకు తోడ్పడుతుందన్నారు. వార్డు సభ్యులు, గ్రామ ప్రజా ప్రతినిధులు, నాయకులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

February 24, 2026 / 01:40 PM IST

అతిగా ఫోన్ చూస్తున్నారా?

నేటి కాలంలో స్మార్ట్‌ఫోన్ వాడకం వ్యసనమైంది. అతిగా ఫోన్ వాడటం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. నిరంతరం స్క్రీన్ చూడటం వల్ల కళ్లు పొడిబారడం, చూపు మందగించడం జరుగుతుంది. సోషల్ మీడియా వాడకం వల్ల  ఆందోళన, నిద్రలేమి వంటివి పెరిగి మానసిక ఒత్తిడికి గురవుతారు. మెడ, వెన్నునొప్పి వస్తుంది. అందుకే డిజిటల్ డిటాక్స్ పాటించడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.

February 24, 2026 / 01:38 PM IST

రజక సంఘం ఆధ్వర్యంలో బెజ్జంకిలో నిరసన

SDPT: రజకులపై జరిగిన దాడిలో చిన్నారి మృతి చెందిన ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బెజ్జంకి మండల రజక సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. నిందితులను తక్షణం అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని, న్యాయం చేయాలని మండల అధ్యక్షుడు ధీటి రాజు డిమాండ్ చేశారు. వివిధ కుల సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

February 24, 2026 / 01:38 PM IST

పేద కుటుంబాలకు అండగా నిలబడతాం: ఎమ్మెల్యే

MDCL: అవసరంలో ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా వచ్చే సహాయాలను సమర్థవంతంగా అందిస్తామని మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖరరెడ్డి తెలిపారు. పేద కుటుంబాలకు అండగా నిలవడం తమ బాధ్యత అని మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ రూ. 2 లక్షల 25 వేల విలువైన ఎల్‌వోసీని అందజేశారు.

February 24, 2026 / 01:38 PM IST

గడువులోపే పనులు పూర్తి చేయాలని: ఎమ్మెల్యే

HYD: జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్దే లక్ష్యంగా చేపట్టిన పనులు ప్రజలకు సకాలంలో అందేలా నాణ్యతతో, గడువులోపే పూర్తి చేయాలని MLA నవీన్ యాదవ్ అన్నారు. మంగళవారం యూసుఫ్ గూడ క్యాంపు కార్యాలయంలో యూసఫ్‌గూడ సర్కిల్ DGM రవీంద్రనాథ్ వర్మ , బోరబండ సర్కిల్ DGM సురేష్ కుమార్ తదితరులు ఆయనను కలిశారు. ప్రజాసమస్యలపై సమన్వయంతో పనిచేస్తూ మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు.

February 24, 2026 / 01:37 PM IST

గడువులోపే పనులు పూర్తి చేయాలి: ఎమ్మెల్యే

HYD: జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్దే లక్ష్యంగా చేపట్టిన పనులు ప్రజలకు సకాలంలో అందేలా నాణ్యతతో, గడువులోపే పూర్తి చేయాలని MLA నవీన్ యాదవ్ అన్నారు. మంగళవారం యూసుఫ్ గూడ క్యాంపు కార్యాలయంలో యూసఫ్‌గూడ సర్కిల్ DGM రవీంద్రనాథ్ వర్మ , బోరబండ సర్కిల్ DGM సురేష్ కుమార్ తదితరులు ఆయనను కలిశారు. ప్రజాసమస్యలపై సమన్వయంతో పనిచేస్తూ మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు.

February 24, 2026 / 01:37 PM IST

ముఖ్యమంత్రి సొంత జిల్లాలో కుల హత్య సిగ్గుచేటు

BDK: భద్రాచలం లో POW డివిజన్ కమిటీ మహిళ నాయకులు సమావేశమయ్యారు. పాయం రాజమ్మ పాల్గొని మాట్లాడుతూ.. మల్లన్న జాతరలో చాకలి కుటుంబంపై , ఐదు నెలల పసికందు ను కాలితో గొంతు నలిమి చంపడం దారుణమని మండిపడ్డారు. రెడ్డి దొరలు ఇప్పటివరకు హంతకులను పట్టు కోక పోవడం పోలీసులు హంతకుల కే కొమ్ములు కాయడం చాలా బాధాకరమన్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో హత్య సిగ్గుచేటు అన్నారు.

February 24, 2026 / 01:36 PM IST

జిల్లాకు 2390 టన్నుల యూరియా

KDP: రబీ వ్యవ సాయ అవసరాలకు కడప, అన్నమయ్య జిల్లాలకు 2900 టన్నుల యూరియా సోమవారం కడప రైల్వే రేక్ పాయింట్‌కు వచ్చింది. ఈ మేరకు వచ్చిన ఎరువులను కడప, అన్నమయ్య నంద్యాల, కర్నూలు జిల్లాకు సరఫరా చేశారు. ఇందులో కడప జిల్లాకు 2,390 టన్నులు రాగా.. ఇందులో మార్క్‌ఫెడ్ 1,200 టన్నులు, ప్రైవేట్ డీలర్లకు 1,190 టన్నులు కేటాయించినట్లు అధికారులు తెలిపారు.

February 24, 2026 / 01:35 PM IST

CMRF చెక్కు అందజేత..!

MDK: కౌడిపల్లి మండల కేంద్రానికి చెందిన కుమ్మరి సుమలతకు రూ.53,000 విలువైన సీఎంఆర్‌ఎఫ్ (CMRF) చెక్కును జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్ పర్సన్ చిలుముల సుహాసిని రెడ్డి అందజేశారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు ఈ నిధి ఆర్థిక భరోసా కల్పిస్తుందని ఆమె తెలిపారు. వెంకటేశం, భూమయ్య తదితరులు పాల్గొన్నారు.

February 24, 2026 / 01:34 PM IST

తండాలో సమస్యలను పరిశీలించిన కమిషనర్

VKB: పరిగి మున్సిపల్ పరిధిలోని నజీరాబాద్ తండాలో పరిగి మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య సందర్శించారు. తండాలో అండర్ డ్రైనేజ్, వీధి దీపాలు, సీసీ రోడ్లు, ఎక్కడ లేవో ఆ ప్రదేశాలను పరిశీలించారు. ఈ  సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తండాలో ప్రతి ఇంటి వద్ద తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా బుట్టలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పరిగి వైస్ ఛైర్మన్ హనుమంతు పాల్గొన్నారు.

February 24, 2026 / 01:33 PM IST

ప్రాణహాని ఉంది.. భద్రత కల్పించాలి: కాటసాని

AP: తనకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్‌భూపాల్ రెడ్డి సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని ఆశ్రయించారు. కాటసాని పిటిషన్‌పై సీజేఐ ధర్మాసనం విచారణ జరిపింది. కాటసానికి భద్రతపై సెక్యూరిటీ రివ్యూ కమిటీ మరోసారి సమీక్ష చేయాలని ధర్మాసనం సూచించింది. భద్రత అవసరమో, కాదో పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

February 24, 2026 / 01:33 PM IST

మొబైల్ షాప్ దగ్ధం.. విచారణ ప్రారంభం

WNP: పెబ్బేర్ మున్సిపల్ కేంద్రంలో మొబైల్ షాప్ దగ్ధం ఘలనలో ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని మంగళవారం స్థానిక మండల రెవెన్యూ ఇన్స్‌పెక్టర్ రాఘవేందర్ రావు తెలిపారు. మున్సిపల్ ఛైర్పర్సన్ అక్కి శ్రీనివాస్ గౌడ్, షాప్ నిర్వాహకుడు మహేశ్, వడ్డే ఈశ్వర్ తదితరులు పంచనామాకు హాజరై బాధితుడికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

February 24, 2026 / 01:33 PM IST

బినోల—నందిగాం శివారులో నాలుగు ట్రాన్స్ ఫార్మర్లు

NZ: నవీపేట్ మండలం బినోల, నందిగాం శివారుల్లో గుర్తు తెలియని వ్యక్తులు పొలాల్లో అమర్చిన నాలుగు విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లను దొంగిలించారు. రైతులు మంగళవారం ఉదయం గమనించి వెంటనే విద్యుత్ అధికారులకు సమాచారం అందించారు. వారి ఫిర్యాదు మేరకు సీఐ శ్రీనివాస్, ఎస్సై శ్రీకాంత్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.

February 24, 2026 / 01:33 PM IST

చిన్నారి మృతికి నిరసనగా కొవ్వొత్తుల ప్రదర్శన

NLG: నాగర్ కర్నూల్ జిల్లాలో చాకలి మహిళపై దాడి, రెండు నెలల చిన్నారి మృతికి కారణమైన అమానుష ఘటనను నిరసిస్తూ మండలంలోని ఇర్కిగూడెంలో BC,SC,ST జేఏసీ ఆధ్వర్యంలో సంతాప సభ, కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. చిన్నారి మృతికి సంతాపం ప్రకటిస్తూ, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

February 24, 2026 / 01:33 PM IST