• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

విఘ్నేశ్వరుని ఆలయ ఆదాయం వివరాలు

కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో ఆదివారం భక్తులు చేసిన వివిధ సేవల ద్వారా రూ.4,24,197 ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 658 స్వామివారిని దర్శించుకున్నారని, 16 మంది దంపతులు లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొన్నారన్నారు. అలాగే, 5,218 మంది అన్న ప్రసాదం స్వీకరించారని పేర్కొన్నారు.

February 22, 2026 / 06:20 PM IST

శ్రీ వేంకటేశ్వర స్వామి జాతరలో ఎమ్మెల్యే వేముల

NZB: వేల్పూర్ మండలంలోని కుకునూర్ గ్రామంలో నిర్వహించిన శ్రీ వేంకటేశ్వర స్వామి జాతరలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

February 22, 2026 / 06:20 PM IST

జగన్ ముఖ్యమంత్రి కావాలని పాదయాత్ర

E.G: మాజీ సీఎం జగన్ మరోసారి ముఖ్యమంత్రి కావాలంటూ క్రైస్తవ సోదరులు రాష్ట్ర ఇంటెలెక్చువల్ విభాగం కార్యదర్శి కొడమంచిలి హరీష్ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టిన సంగతి విదితమే. రావులపాలెంలో వైసీపీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ యాత్ర ఆదివారం నాటికీ గుణదల వరకు సాగనుంది. కూటమి పాలంలో ప్రజలు విసుగు చెందారని రాబోయేది మరల YS జగన్ అని సుధాకర్ అన్నారు.

February 22, 2026 / 06:20 PM IST

తాటిపాములలో పెద్దమ్మ గుడి నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

WNP: శ్రీ రంగాపురం మండలం తాటిపాముల గ్రామంలో పెద్దమ్మ గుడి నిర్మాణానికి ఆదివారం వనపర్తి శాసనసభ్యులు మేఘారెడ్డి భూమి పూజ చేశారు.గ్రామ దేవతలను పూజించడం గ్రామాల్లో గ్రామదేవతల ఆలయాలు నిర్మించడం ఎంతో శుభసూచకమని అన్నారు. ఈ ఆలయ నిర్మాణానికి తన వంతు సహాయ సహకారాలు అందజేస్తారని ఎమ్మెల్యే చెప్పారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల, గ్రామ నాయకులు పాల్గొన్నారు.

February 22, 2026 / 06:19 PM IST

తైక్వాండలో విద్యార్థులకు బెల్టుల ప్రధానం

NLG:నార్కట్‌పల్లిలోని పీవీఆర్ చేతన పాఠశాలలో జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం విద్యార్థులకు బెల్టులు అందజేశారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా ఎస్జీఎఫ్ సెక్రటరీ విమల మాట్లాడుతూ.. క్రీడల వల్ల శారీరక దృఢత్వంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ లభిస్తుందన్నారు. ఎగ్జామినర్ సుధాకర్ ఆధ్వర్యంలో మొత్తం 65 మంది విద్యార్థులు బెల్టులు సాధించారు.

February 22, 2026 / 06:19 PM IST

T20 WC: శ్రీలంకను చిత్తు చేసిన ఇంగ్లండ్

సూపర్-8 గ్రూప్-2 మ్యాచ్‌లో శ్రీలంకపై ఇంగ్లండ్ 51 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 146 పరుగులు చేసింది. అనంతరం శ్రీలంక.. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి 95 పరుగులకే కుప్పకూలింది. లంక బ్యాటర్లలో షనక (30) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్స్ 3 వికెట్లు తీయగా.. ఆర్చర్, డాసన్, ఆదిల్ రషీద్ తలో రెండు వికెట్లతో లంక పతనాన్ని శాసించారు.

February 22, 2026 / 06:19 PM IST

భీమవరంలో ఉగాది వేడుకల బ్రోచర్ ఆవిష్కరణ

WG: మన సంస్కృతి సాంప్రదాయాలు చెరగని ముద్రలని, ఉగాది సంక్రాంతి, దసరా లాంటి పండుగలు మన సంప్రదాయ పండుగలని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఈ మేరకు ఆదివారం మార్చి 19న శ్రీభీమేశ్వర స్వామి దేవస్థానంలో జరిగే ఉగాది పురస్కార వేడుకల బ్రోచర్‌ను ఎమ్మెల్యే భీమవరం కార్యాలయంలో ఆవిష్కరించి మాట్లాడారు.

February 22, 2026 / 06:18 PM IST

జమ్మికుంటలో గుప్తనిధుల తవ్వకాలు కలకలం

KNR: జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ఆబాది జమ్మికుంటలో గుప్తనిధుల కోసం జరిగిన తవ్వకాలు స్థానికంగా కలకలం రేపాయి. మహబూబ్ అలీ అనే వ్యక్తికి చెందిన పట్టా భూమిలో శనివారం అర్ధరాత్రి కొందరు అక్రమంగా తవ్వకాలు చేపట్టారు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన కోయ, ముస్లిం పూజారులతో క్షుద్ర పూజలు నిర్వహించినట్లు సమాచారం.

February 22, 2026 / 06:16 PM IST

హన్వాడలో రోడ్డు భద్రత అవగాహన

MBNR: హన్వాడ మండల కేంద్రంలో ఆదివారం రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు పోలీసులు మాట్లాడుతూ.. ట్రాఫిక్ నియమాలు పాటిస్తే ప్రమాదాలను తగ్గించి ప్రాణాలు కాపాడుకోవచ్చని తెలిపారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, సీట్ బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు.

February 22, 2026 / 06:16 PM IST

రేపు చిత్తూరులో పోలీస్ పబ్లిక్ గ్రీవెన్స్

చిత్తూరు జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో “పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్” కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ కార్యాలయం తెలిపింది. రేపు ఉదయం 10.30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలు, ఫిర్యాదులను పోలీస్ ఉన్నతాధికారులకు నేరుగా తెలియజేసే అవకాశం ఉంటుందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

February 22, 2026 / 06:16 PM IST

కార్యకర్తను పరామర్శించిన ప్రభుత్వ విప్

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జోన్-1 కోఆర్డినేటర్‌గా ఉన్న నాగేశ్వరరావు హార్ట్ స్ట్రోక్‌కు గురై మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న కురుపాం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

February 22, 2026 / 06:15 PM IST

మున్సిపల్ కమిషనర్‌కు సన్మానం

NDL:  డోన్ మున్సిపల్‌లో మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ గౌడ్ మున్సిపల్ కార్మికులు, సీఐటీయు నాయకులు పూలమాలలు, శాలువాలతో ఘనంగా ఆదివారం సన్మానించారు. గతంలో తప్పుగా రిటైర్మెంట్ లిస్ట్‌లో వచ్చిన కార్మికురాలు వెంకటలక్ష్మీ ఉద్యోగంలో తిరిగి చేరడం, కార్మికుల సమస్యలకు కమిషనర్ తక్షణ స్పందనకు ధన్యవాదాలు తెలిపారు.

February 22, 2026 / 06:15 PM IST

ప్రజల తీర్పు చూసినా.. BRS తీరు మారట్లేదు: రేవంత్

TG: అసెంబ్లీ, ఎంపీ, జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు, సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల తీర్పు చూసిన తర్వాతైనా బీఆర్ఎస్ నేతలు మారకపోవడం విచారకమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. BRSకు మళ్లీ ఓటు వేయకపోవడమే ప్రజల తప్పన్నట్లుగా వారు వ్యవహరిస్తున్నారని ఆగ్రహించారు. ఓటు వేసిన ప్రజలను బహిష్కరించినట్లు చేయడం సరికాదన్నారు.

February 22, 2026 / 06:15 PM IST

రేపటి నుంచి ప్రజావాణి

MDK: 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేసిన ప్రజావాణి కార్యక్రమం రేపటి నుంచి ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయంలో యథావిధిగా కొనసాగుతుందని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. కలెక్టరేట్ కార్యాలయంలో హెల్ప్ డేస్ ద్వారా మాత్రమే ప్రజావాణి దరఖాస్తులు స్వీకరించిన జరుగుతుందన్నారు. మార్చి 02 నుంచి కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణి జరుగుతుందని వెల్లడించారు.

February 22, 2026 / 06:13 PM IST

ఘనంగా శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి

SDPT: శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని ఘనంగా అక్కన్నపేట మండలంలోని చాపగాని తండాలో గిరిజన అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షులు భూక్య వీరన్న నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సేవాలాల్ మహారాజ్ చిత్రిపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పీఠాధిపతి మహారాజ్ తో కలిసి వీరన్న నాయక్ విచ్చేసి భోగ్ బండార్ నిర్వహించారు.

February 22, 2026 / 06:12 PM IST