NLG:చిట్యాల మున్సిపాలిటీ 11వ వార్డు కు చెందిన కాంగ్రెస్ నాయకులు మన్నెం సైదులు తమ సేవాగుణాన్ని చాటుకున్నారు. ఐదేళ్ల వరకు వార్డులోని ప్రతి ఇంటి ఆడబిడ్డ వివాహానికి రూ.10,116 కానుకగా అందజేస్తామన్న మాటను నెరవేర్చుకుంటున్నారు. ఇవాళ జరిగిన ముప్పా ముత్తిరెడ్డి-మంజుల దంపతుల కుమార్తె అఖిల వివాహానికి హాజరై ఆయన ఈ కానుకను అందజేశారు.
రంజీ ట్రోఫీ ఫైనల్లో కర్ణాటక బ్యాటర్ మయాంక్ అగర్వాల్ సెంచరీ బాదాడు. స్టార్ ప్లేయర్లు రాహుల్(13), పడిక్కల్(11), కరుణ్ నాయర్(0) విఫలమైనప్పటికీ అగర్వాల్ 110 పరుగులతో ఒంటరీ పోరాటం చేస్తున్నాడు. ఈ క్రమంలో అతడు రంజీల్లో 5000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్(584) తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు కర్నాటక(174/5) మరో 410 పరుగులు వెనుకబడి ఉంది.
MHBD: తొర్రూర్ మున్సిపాలిటీ కార్యాలయంలో గురువారం మున్సిపల్ ఛైర్మన్ తునం శ్రవణ్ కుమార్, వైస్ ఛైర్‌పర్సన్ సోమ రజిని రాజశేఖర్ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్యఅతిథులుగా హాజరైన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, పాలకుర్తి MLA యశస్విని రెడ్డి, TPCC వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి, వారిని అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ నేతలు ఉన్నారు.
ATP: రాప్తాడు నియోజకవర్గంలో దేవాలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డికి గురువారం ఎమ్మెల్యే పరిటాల సునీత వినతి పత్రం అందజేశారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మంత్రిని ప్రత్యేకంగా కలిసి ఆలయాల పరిస్థితి గురించి చర్చించి, నిధుల మంజూరు కోసం విజ్ఞప్తి చేశారు.
E.G: ఉమ్మడి తూ.గో జిల్లా వ్యాప్తంగా మార్చి 14న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జాతీయ న్యాయసేవాధికార సంస్థ ఛైర్మన్ గంధం సునీత గురువారం తెలిపారు. జాతీయ లోక్ అదాలత్‌లో రాజీ పడదగ్గ క్రిమినల్, సివిల్, కుటుంబ వివాదాలు, చెక్ బౌన్స్ తదితర కేసులకు సంబంధించిన వివాదాలను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
జింబాబ్వేతో ఇవాళ జరగబోయే కీలక మ్యాచ్‌లో భారత్ జట్టులో మూడు మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. తిలక్ వర్మ స్థానంలో సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్ స్థానంలో కుల్దీప్ యాదవ్, రింకూ సింగ్ స్థానంలో అక్షర్ పటేల్ జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది. తుది జట్టు అంచనా: అభిషేక, శాంసన్, ఇషాన్, సూర్య, దూబే, పాండ్యా, అక్షర్, కుల్దీప్, చక్రవర్తి, బుమ్రా, అర్ష్‌దీప్
WNP: అమరచింత మున్సిపాలిటీ కేంద్రంలోని అతి పురాతన ఆంజనేయస్వామి దేవాలయ కొండ నిర్మాణం ప్రారంభమైంది. ఈ నిర్మాణానికి మంత్రి డా. వాకిటి శ్రీహరి ఎండోమెంట్ ద్వారా రూ.50 లక్షలు మంజూరు చేశారు. దేవాలయ గర్భగుడి గడప ముహూర్తం ఈ నెల 28న గ్రామ దాతల నిధులతో నిర్వహిస్తారని నిర్వాహకులు తెలిపారు.
ఏలూరు జిల్లాలో ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని ఆర్ఐవో యోహాన్ తెలిపారు. గురువారం జరిగిన ఇంటర్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 15,972 హాజరయ్యారని చెప్పారు. 385 మంది వివిధ కారణాలతో గైర్హాజరు అయ్యారని వివరించారు. జనరల్ విద్యార్థులు 14,128, ఒకేషనల్ విద్యార్థులు 1,844 మంది పరీక్ష రాశారని వెల్లడించారు.
JGL: గోదావరి మహా పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించి సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో సమీక్ష సమావేశంలో అధికారులను ఆదేశించారు. 2027 సంవత్సరంలో జూన్ 26-జూలై 7వరకు జరిగే పుష్కరాల దృష్ట్యా ఘాట్ నిర్మాణం, రోడ్లు, లైటింగ్, పారిశుద్ధ్యం, భద్రతా ఏర్పాట్లు, ఆలయాల అభివృద్ధిపై ప్రతిపాదనలు సమర్పించాలన్నారు.
MNCL: బెల్లంపల్లి పట్టణంలో జరుగుతున్న గోదావరి పైప్ లైన్ పనులను మున్సిపల్ ఛైర్మన్ దావా స్వాతి-రమేష్ బాబు గురువారం పరిశీలించారు. వేసవి కాలం దృష్టిలో ఉంచుకొని త్రాగునీరు సమస్య తలెత్తకుండా పైప్ లైన్ పనులు తొందరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనులు తొందరగా పూర్తి చేసి ప్రజలకు త్రాగునీరు అందించాలని సూచించారు.
PDPL: జిల్లా వ్యాప్తంగా ఇవాళ జరిగిన ఇంటర్ రెండో సంవత్సరం తెలుగు/ ఉర్దూ/ హిందీ పరీక్షలో 98% విద్యార్థులు హాజరయ్యారని ఇంటర్మీడియట్ జిల్లా విద్యాధికారి కల్పన తెలిపారు. మొత్తం 4815 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావలసి ఉండగా 4731 మంది హాజరయ్యారని, 74 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. అన్ని కేంద్రాలలో పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు ఆమె వెల్లడించారు.
SRPT: తుంగతుర్తిలోని రిటైర్డ్ ఉద్యోగుల భవనంలో తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఉపేందర్, కార్యదర్శిగా కరుణాకర్, కోశాధికారిగా కేదారి ఎంపికయ్యారు. ఉపాధ్యక్షులుగా సోమయ్య, సంజీవ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యవర్గం సీనియర్ సిటిజన్ల సమస్యల పరిష్కారానికి నూతన కార్యవర్గం కృషి చేస్తుందన్నారు.
ASF: కాగజ్‌నగర్ పట్టణంలో నెలకొన్న పలు సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ వైస్ ఛైర్మన్ అనిత, BRS కౌన్సిలర్లు కలిసి జాయింట్ కలెక్టర్‌ని కలిసి వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ లోపాలు, తాగునీటి సరఫరా అంశాలను జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. సమస్యలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ హమీ ఇచ్చారు.
ADB: జిల్లాలోని హట్టిఘాట్ పంప్ హౌస్, చనాకా-కోరాట బ్యారేజ్ ప్రాంతాల వద్ద ఇన్‌ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసి రైతులకు సమృద్ధిగా సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.