SRD: కంగ్టి మండలం తుర్కవడ్గం పాఠశాలలో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు విద్యాసామాగ్రిని పంపిణీ చేసినట్లు ప్రధానోపాధ్యాయులు కిషన్ పవార్ తెలిపారు. పాఠశాల, విద్యాభివృద్ధి కోసం దాతలు సహకరించారని చెప్పారు. ఈ సందర్భంగా దాత రేణీ గ్రేస్, సామాజిక సేవ కర్త చంద్రశేఖర ఆచార్యకు పాఠశాల బృందం తరపున HM కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.
మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబోలో వస్తున్న ‘మెగా-158’ చిత్రంపై అప్‌డేట్ వచ్చింది. ఈ మూవీలో నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కీలక పాత్ర పోషించనున్నట్లు టాక్. చిరు వీరాభిమాని అయిన బండ్లన్న ఎంట్రీతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఆయన పాత్ర ఫన్నీగా ఉంటుందా లేదా పవర్‌ఫుల్‌గా ఉంటుందా అన్నది సస్పెన్స్ అయినప్పటికీ, బండ్లన్న మార్క్ డైలాగులు పక్కా అని తెలుస్తోంది.
GDWL: గట్టు మండల నూతన ఏపీఎంగా మారుతి బాధ్యతలు స్వీకరించారు. మండల సమాఖ్య భవనంలో జరిగిన కార్యక్రమంలో మహిళా సంఘం అధ్యక్షురాలు మహేశ్వరి, సీసీలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. మహిళా సంఘాల బలోపేతంతో పాటు ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ చేరేలా శక్తివంచన లేకుండా కృషి చేస్తానని మారుతి హామీ ఇచ్చారు.
KMR: లింగంపేట మండల విద్యాధికారిగా వంచ అంజల్ రెడ్డి శనివారం బాధ్యతలు చేపట్టారు. రామారెడ్డి మండలం అన్నారం గ్రామానికి చెందిన ఆయన, కామారెడ్డి ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. ఇప్పటివరకు లింగంపేట ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా ఉన్న గోపాల్ రెడ్డి నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. మండలంలో విద్యా వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.
AP: విజయనగరం జిల్లా చీపురుపల్లి సామాజిక ఆరోగ్య కేంద్రానికి సీఎం చంద్రబాబు వెళ్లారు. చీపురుపల్లి సీహెచ్‌సీలో హెచ్‌పీవీ వ్యాక్సిన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. గర్భాశయ క్యాన్సర్ నివారణే లక్ష్యంగా 14, 15 ఏళ్ల బాలికలకు ఉచితంగా హెచ్‌పీవీ టీకాల కేంద్ర ఆరోగ్యశాఖ ఇస్తున్న విషయం తెలిసిందే.
KDP: రాజుపాలెం (M)లోని కొర్రపాడు గ్రామానికి చెందిన మండల పరిషత్ మాజీ కో ఆప్షన్ సభ్యుడు కమాలుద్దీన్ అనారోగ్యంతో మృతి చెందారు. మరణవార్త తెలుసుకున్న ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి కొర్రపాడు గ్రామానికి చేరుకుని కమాలుద్దీన్ మృతదేహానికి నివాళులర్పించి కమాలుద్దీన్‌తో 60 ఏళ్లుగా కొనసాగుతున్న స్నేహాన్ని గుర్తుచేసుకుని కంటతడి పెట్టారు.
MNCL: మందమర్రి మండలం సారంగపల్లి సమీపంలో శనివారం జరిగిన ప్రమాదంలో ఓ ఆటో అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. మలుపు వద్ద అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో డ్రైవర్కు స్వల్ప గాయాలు కాగా, ఆ సమయంలో ఆటోలో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు.
MBNR: మహబూబ్ నగర్ పట్టణంలోని ఐటీఐ/ఏటీసీ(బాలుర)లో స్వల్పకాలిక కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ శాంతయ్య తెలిపారు. 1.CNC ఆపరేటర్, 2. Electrical Vehicle Service Technician, 3. 3D Printing ఆపరేటర్ కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. 18 ఏళ్లు నిండిన వారు అర్హులని, ఉమ్మడి జిల్లా నుంచి అర్హులైన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
PDL: రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అధ్యక్షతన అన్ని జిల్లాల కలెక్టర్లతో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌తో పాటు చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్, డీవీఏపీ యూనిట్ సభ్యులు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, సీవీఏపీ యూనిట్ సభ్యులు అన్ని నియోజకవర్గాల అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో జీరో పావర్టీ–పి 4 ఫ్రేమ్‌వర్క్ పై సమావేశం జరిగింది.
KMM: పశువైద్య శిబిరాలను పాడిపోషకులు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ ఛైర్మన్ సామినేని సుజాత అన్నారు. శనివారం మధిర మున్సిపాలిటీ పరిధిలోని ఇల్లందులపాడులో ఏర్పాటు చేసిన పశువైద్య శిబిరాన్ని మున్సిపల్ ఛైర్మన్ ప్రారంభించారు. నోరులేని జీవుల పట్ల సేవాభావం పెంపొందించుకుని పశుగణాభివృద్ధికి తోడ్పడాలని ఇదే పరమాత్ముడి సేవని మున్సిపల్ ఛైర్మన్ పేర్కొన్నారు.
SKLM: లావేరి ఎంపీడీవో కార్యాలయంలో శనివారం స్వచ్ఛ రథాన్ని ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వరరావు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పరిసరాలలో పరిశుభ్రంగా ఉంచడంలో పారిశ్రామిక కార్మికులకు కీలకపాత్ర అన్నారు. ఎప్పటికప్పుడు చెత్తను శుభ్రం చేయాలన్నారు. అనంతరం పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
PPM: జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు అత్యంత పారదర్శకంగా, పకడ్బందీగా జరుగుతున్నాయని కలెక్టర్ ప్రభాకర రెడ్డి వెల్లడించారు. శనివారం సీతానగరం మండలం జోగింపేటలోని ఏపి గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేశారు. పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు కల్పించిన వసతులను స్వయంగా పరిశీలించారు.
VSP: ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, దీర్ఘకాలిక రోగులకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నాయని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు తెలిపారు. శనివారం పెందుర్తి జోన్ 96వ వార్డు యాతపేటలో పింఛన్లు పంపిణీ చేశారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో అర్హులందరికీ ప్రతి నెల పింఛన్ అందజేస్తున్నామని అన్నారు.
PPM: జిల్లాలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి వద్దనే పింఛన్లు అందజేయడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి పేర్కొన్నారు. బలిజిపేట మండలం పెదపెంకి గ్రామంలో ఇవాళ ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పలువురు వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు వారి నివాసాల వద్దకే కలెక్టర్ వెళ్లి నేరుగా పింఛన్లను పంపిణీ చేశారు.
తల్లిదండ్రుల మాటలను కాదని, ప్రేమించిన వారి కోసం ఇళ్లు వదిలి వెళ్లిన ముగ్గురు అమ్మాయిల కథే ‘ది కేరళ స్టోరీ 2’. తాము నమ్మిన ప్రేమే ఒక పెద్ద మోసమని తెలుసుకున్న వాళ్లు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారనే దర్శకుడు ఇందులో చూపించాడు. నటీనటుల ప్రతిభ, ఎమోషనల్ కథాంశం, సెకండాఫ్, క్లైమాక్స్ సన్నివేశాలు మూవీకి ప్లస్. కథను ఒకే కోణం నుంచి చూపడం, కొన్ని చోట్ల మితిమీరిన సినిమాటిక్ లిబర్టీ మైనస్.