ADB: ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్‌లో సోమవారం సీసీఐ పత్తి ధర క్వింటా రూ.8,010గా, ప్రైవేట్ పత్తి ధర రూ.7,000గా నిర్ణయించారు. గత వారం ధరతో పోలిస్తే సోమవారం సీసీఐ ధరలో ఎలాంటి మార్పు లేదు. ప్రైవేట్ ధరలో సైతం వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు తెలియజేశారు.
VZM: రాజాం శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి 100వ జాతరలో సోమవారం రాత్రి జబర్దస్త్ టీం సందడి చేయనున్నారు. జబర్దస్త్ నటుడు హైపర్ ఆది, రేంజింగ్ రాజ్, శాంతి స్వరూప్, దొరబాబు, సౌమ్య రావు, తదితరులు తమ కామెడీతో అలరించనున్నారు. ఈవెంట్ వద్ద ఎటువంటి ఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని పోలీసులు, కమిటీ నిర్వాహకులు తెలిపారు.
TG: ఆదిలాబాద్ జిల్లా శ్యామ్‌పూర్‌లో ఆసిఫాబాద్ డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ విచారం వ్యక్తం చేశారు. ప్రమాదానికి సంబంధించిన కారణాలపై ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్, ఎస్పీతోనూ మాట్లాడారు.
SRPT: కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఈరోజు నియోజకవర్గంలో పలు సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యంగా మధ్యాహ్నం 3:00 గంటలకు కోదాడ మున్సిపల్ కార్యాలయంలో నూతన చైర్మన్, కౌన్సిలర్ల బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి హాజరవుతారు. అనంతరం లారీ ఓనర్స్ అసోసియేషన్ సమావేశంలో పాల్గొంటారని పిఆర్ఓ వెంకట రెడ్డి తెలిపారు.
SKLM: ఎచ్చెర్ల మండలం ఎస్ ఎం పురం గ్రామంలో దివంగత నేత, మాజీ మంత్రి కింజరావు ఎర్రం నాయుడు 69వ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ జిల్లా టీడీపీ అధ్యక్షులు చౌదరి నారాయణమూర్తి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ ఛైర్మన్ ధనలక్ష్మి, డీసీఎంఎస్ ఛైర్మన్ అవినాష్, తదితరులు పాల్గొన్నారు.
AP: రాజమండ్రిలో అనూరియా వ్యాధితో ముగ్గురు మృతి చెందారు. మృతులలో కృష్ణవేణి(85), రాధాకృష్ణామూర్తి(74), శేషగిరిరావు(72) ఉన్నారు. మరో 11 మంది బాధితులు వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు.
KMR: ట్విన్స్ డే రోజే ట్విన్స్ వివాహం చేసుకున్న అరుదైన సంఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలో జరిగింది. ఘన్పూర్‌కు చెందిన భాస్కర్- సుజాత దంపతుల కవల కుమారులు విజయ్‌కుమార్, వినయ్‌కుమార్‌కు తాడ్వాయి మండలం దేమే గ్రామానికి చెందిన కుమ్మరి రాజమణి- సాయన్న కవల కుమార్తెలు కీర్తన, కీర్తితో వివాహం జరిగింది. అంతర్జాతీయ కవలల దినోత్సవం రోజే వారికి పెళ్లి అయింది.
ATP: గుత్తి దాసరి కాలనీకి చెందిన వెంకటేష్ అదృశ్యమైనట్లు కుటుంబసభ్యులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యులు మాట్లాడుతూ..చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు బంధువుల ఇళ్లలో వెతికిన ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
MNCL: చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని జన్నారం మండలంలోని చింతగూడ గ్రామ సర్పంచ్ సుతారి సుమలత వినయ్ కోరారు. సోమవారం చింతగూడ గ్రామంలోని భగత్ సింగ్ నగర్ ప్రభుత్వ పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి ఆమె పూజ చేశారు. వీబీజీ రాం జీ ద్వారా మంజూరైన రూ. 10 లక్షల నిధులతో పాఠశాల ప్రహరీ గోడను నిర్మించడం జరుగుతుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఉన్నారు.
JN: రఘునాథపల్లి గ్రామపంచాయతీ నందు కోతుల బెడద నివారణకు స్థానిక సర్పంచ్ వెంకటయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. విన్నూతంగా కొండెంగ గెట్ అప్‌లో సర్పంచ్, సిబ్బంది ఊరంతా తిరుగుతూ కోతులను తరిమికొట్టారు. గ్రామ సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, అభివృద్ధికి ప్రజలంతా సహకరించాలని కోరారు.
TPT: నాయుడుపేటలో ఇవాళ ఉదయం జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలను డీఎస్‌పీ చెంచుబాబు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పరీక్షలు నిర్వహించాలని పోలీస్ యంత్రాంగాన్ని ఆదేశించారు. తెలియని వారిని పరీక్ష కేంద్రంలోనికి పంపకూడదని తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలన్నారు.
KMM: HYD గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడల్లో తల్లాడ మండలం రంగంబంజరకు చెందిన రామ్ చరణ్ సత్తా చాటాడు. నిన్న జరిగిన జూడో పోటీల్లో రామ్ చరణ్ అద్భుత ప్రతిభ కనబరిచి కాంస్య (బ్రౌన్) మెడల్ సాధించాడు. రామ్ చరణ్ 4 నుంచి 10వ తరగతి వరకు స్పోర్ట్స్ పాఠశాలలో శిక్షణ పొందినట్లు తండ్రి ధర్మసోత్ దశరథ్ నాయక్ తెలిపారు.
BHPL: గోరికొత్తపల్లి మండలం నిజాంపల్లి గ్రామంలోని అంబేద్కర్ కాలనీలో “లీకైన పైప్‌లైన్” సమస్య పై HIT TVలో నిన్న ప్రచురితమైన కథనానికి గ్రామ సర్పంచ్ సునీత-రవీందర్ స్పందించారు. ఇవాళ సర్పంచ్ సొంత ఖర్చులతో GP పంప్ ఆపరేటర్ అంజి పర్యవేక్షణలో పైప్‌లైన్ మరమ్మతు పనులు చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు గ్రామ సర్పంచ్‌కు, ముఖ్యంగా HIT TVకి కృతజ్ఞతలు తెలిపారు.
AP: శాసనమండలిలో వైసీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. వైసీపీ వాయిదా తీర్మానాన్ని ఛైర్మన్ మోషేన్ రాజు తిరస్కరించారు. ఇందాపూర్ – హెరిటేజ్ అంశంపై చర్చకు వైసీపీ సభ్యులు పట్టుపట్టారు. ఈ క్రమంలో ఛైర్మన్ పోడియాన్ని వైసీపీ సభ్యులు ముట్టడించారు. ఈ క్రమంలో శాసనమండలిని ఛైర్మన్ వాయిదా వేశారు.
NLG: గన్యానాయక్ తండాకు చెందిన నేనావత్ రాము నాయక్ కుమార్తె వివాహానికి బీఆర్ఎస్ నాయకుడు నేనావత్ కిషన్ నాయక్ రూ.50,016 నగదును పెళ్లి కానుకగా అందజేశారు. పదవుల కంటే ప్రజల కష్టసుఖాల్లో తోడుండటమే తనకు సంతృప్తినిస్తుందని ఆయన పేర్కొన్నారు. తండా బిడ్డల అభివృద్ధి, వారి కుటుంబాల్లో ఆనందం నింపడమే తన ప్రధాన లక్ష్యమని కిషన్ నాయక్ స్పష్టం చేశారు.