• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

వరదయ్యపాలెం–తడ రోడ్డు దుస్థితిపై ఆందోళన

TPT: తిరుపతి జిల్లా సత్యవేడు మండలంలోని వరదయ్యపాలెం–తడ రహదారి పూర్తిగా దెబ్బతిని ప్రమాదకరంగా మారింది. భారీ గుంతలు, దుమ్ముతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. Sri City కార్మికులు, బస్సులు ప్రయాణించడం కష్టమై ప్రమాదాలు జరుగుతున్నాయి. వెంటనే రోడ్డు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

February 28, 2026 / 06:37 AM IST

ఉచిత రేషన్.. కీలక నిర్ణయం

TG: మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉచిత రేషన్ కింద ఇచ్చే బియ్యాన్ని ఫోర్టిఫీకేషన్ చేసే ప్రాసెస్‌ను కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ బియ్యాన్ని ఎక్కువ కాలం స్టోర్ చేసినప్పుడు అందులోని పోషక విలువలు తగ్గిపోతున్నట్లు IIT ఖరగ్పూర్ స్టడీలో తేలిందని సమాచారం. అయితే రేషన్ కోటలో మాత్రం ఎలాంటి తగ్గింపు ఉండబోదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

February 28, 2026 / 06:37 AM IST

వరంగల్‌కు 100 ఎలక్ట్రిక్ బస్సులు: కలెక్టర్

WGL: ప్రజా రవాణాను మెరుగుపరిచేందుకు గ్రేటర్ వరంగల్ నగరానికి ప్రభుత్వం 100 ఎలక్ట్రిక్ బస్సులను మంజూరు చేసిందని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ తెలిపారు. ఆర్టీసీ, రెవెన్యూ అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. పర్యావరణ హితమైన రవాణా సౌకర్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.

February 28, 2026 / 06:34 AM IST

‘EHS అమలులో చిత్తశుద్ధి చూపాలి’

JN: ఉద్యోగులు, పెన్షనర్ల కోసం ప్రవేశపెట్టిన ఆరోగ్య పథకాన్ని(EHS) ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేయాలని టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. పెండింగ్ బిల్లులు, డీఏలను తక్షణమే చెల్లించాలని కోరారు. పీఆర్‌సీ నివేదికను వెంటనే విడుదల చేయాలని, ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం జాప్యం చేయకూడదని స్పష్టం చేశారు.

February 28, 2026 / 06:34 AM IST

కన్నుల పండువగా శ్రీవారి తెప్పోత్సవాలు

తిరుమలలో శ్రీవారి తెప్పోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. రెండో రోజైన శుక్రవారం రుక్మిణీ సమేత శ్రీకృష్ణావతారంలో తిరుమలేశుడు భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా శ్రీవారిని ఆలయం నుంచి తిరుమాడ వీధుల్లో ఊరేగిస్తూ పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. అర్చకులు స్వామివారికి హారతులిచ్చి ప్రదక్షిణ ప్రారంభించారు.

February 28, 2026 / 06:33 AM IST

ఎస్ కోటలో ప్రారంభమైన జనసేన పార్టీ సభ్యత్వ నమోదు

VZM: జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎస్ కోటలో పట్టణ పార్టీ అధ్యక్షులు మోపాడ చిన్న ఆధ్వర్యంలో శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నియోజకవర్గ జనసేన నాయకులు వబ్బిన సన్యాసినాయుడు, సత్యనారాయణ పాల్గొన్నారు. గ్రామ గ్రామాన జనసేన పార్టీ బలోపేతమే ప్రధాన లక్ష్యంగా పార్టీ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

February 28, 2026 / 06:32 AM IST

పౌరసరఫరాలపై నిరంతర నిఘా ఉంచాలి: కలెక్టర్

HNK: కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధ్యక్షతన శుక్రవారం సివిల్ సప్లైస్ విజిలెన్స్ కమిటీ సమావేశం జరిగింది. రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు తరచుగా దాడులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. విజిలెన్స్ విభాగం క్షేత్రస్థాయిలో నిఘా పెంచాలని సూచించారు. సమావేశంలో అ.కలెక్టర్ రవి, DCSO వాజిద్ అలీ, కమిటీ సభ్యురాలు అనిత రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.

February 28, 2026 / 06:32 AM IST

‘నేటి నుంచి పెన్షన్ల పంపిణీకి సర్వం సిద్ధం’

NLR: గుడ్లూరు మండలంలో శనివారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి సర్వం సిద్ధంగా ఉన్నట్లు ఎంపీడీవో వెంకటేశ్వరరావు తెలిపారు. మార్చి 1వ తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. సాధ్యమైనంత వరకు శనివారం అందరికీ పెన్షన్లు పంపిణీ చేసేందుకు సిబ్బంది సన్నద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు.

February 28, 2026 / 06:30 AM IST

నేడు మున్సిపాలిటీలో ప్రత్యేక బడ్జెట్ సమావేశం

ATP: గుంతకల్లు మున్సిపాలిటీ కౌన్సిలింగ్ హాల్‌లో శనివారం ప్రత్యేక బడ్జెట్ సమావేశం జరుగుతుందని మున్సిపల్ చైర్ పర్సన్ భవాని శుక్రవారం తెలిపారు. ఈ సమావేశం శనివారం ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. కావున మున్సిపాలిటీ అధికారులు, ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, సిబ్బంది తప్పక హాజరుకావాలని ఆమె పేర్కొన్నారు.

February 28, 2026 / 06:30 AM IST

‘మినీ జెట్టి, కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలి’

AKP: పాయకరావుపేట మండలం వెంకటనగరంలో మినీ జెట్టీ, కోల్డ్ స్టోరేజ్, ఫిష్ సెల్లింగ్ సెంటర్, డ్రై ఫిష్ ఫ్లాట్ ఫామ్స్ ఏర్పాటు చేయాలని మత్స్యకారులు విజ్ఞప్తి చేశారు. మత్స్యశాఖ అధికారిణి శృతి శుక్రవారం గ్రామంలో పర్యటించి మత్స్యకారులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు పంచాయతీ తీర్మానం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. 

February 28, 2026 / 06:30 AM IST

‘విద్యార్థులు చదువుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి’

కోనసీమ: ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు చదువుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ప్రముఖ సినీ నటులు, రచయిత తనికెళ్ల భరణి సూచించారు. ఆలమూరు మండలం చెముడులంక స్కూల్ వార్షికోత్సవ వేడుకలకు శుక్రవారం ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. సెల్ ఫోన్లు, సోషల్ మీడియాలకు విద్యార్థులను దూరంగా ఉంచేందుకు తల్లిదండ్రులు తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు.

February 28, 2026 / 06:30 AM IST

బాపట్ల పాల డైరీల్లో ఆకస్మిక తనిఖీలు

BPT: రాజమండ్రిలో కల్తీ పాలు తాగి చిన్నారులు మృతి చెందిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో ఆహార భద్రతా శాఖ అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో బాపట్ల జిల్లా ఆహార భద్రత అధికారి ప్రణీత్ కుమార్ శుక్రవారం పలు పాల డైరీల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పాల నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపిన ఆయన, నాణ్యతలో లోపాలు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

February 28, 2026 / 06:30 AM IST

వరంగల్ నగరానికి వంద ఎలక్ట్రిక్ బస్సులు

TG: ప్రజా రవాణాలో భాగంగా గ్రేటర్ వరంగల్ నగరానికి ప్రభుత్వం వంద ఎలక్ట్రిక్ బస్సులను మంజూరు చేసింది. RTC, రెవెన్యూ శాఖల అధికారులతో ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ కోసం మడికొండలో ప్రతిపాదిత స్థలం, నిర్వహణ అంశాలకు సంబంధించిన వివిధ అంశాలపై కలెక్టర్ సమీక్షించారు.

February 28, 2026 / 06:27 AM IST

విద్యారంగ సమస్యలపై పోరాడాలి: కేటీఆర్

GDWL: జిల్లాలోని విద్యారంగ సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో పోరాడాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్వీ జిల్లా కో-ఆర్డినేటర్ కురువ పల్లయ్య HYDలో కేటీఆర్ను కలిశారు. అలంపూర్ నియోజకవర్గంలోని పాఠశాలల్లో మౌలిక వసతులు, టాయిలెట్లు లేక విద్యార్థినులు పడుతున్న ఇబ్బందులను దృష్టికి తీసుకెళ్లారు.

February 28, 2026 / 06:27 AM IST

కనిగిరిలో నేడు ప్రత్యేక బడ్జెట్ సమావేశం

ప్రకాశం: కనిగిరి మున్సిపల్ కార్యాలయంలో ఇవాళ ఉదయం 11.00 గంటలకు మున్సిపల్ కౌన్సిల్ హాల్లో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీధర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్ గఫార్ అధ్యక్షతన సమావేశం జరుగుతుందని, సమావేశానికి వైస్ ఛైర్మన్లు, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, అధికారులు హాజరుకానున్నారు.

February 28, 2026 / 06:27 AM IST