కర్నూలు : పౌరుల బాధ్యతాయుత సహకారంతోనే నదుల సంరక్షణ ఫలప్రదమవుతుందని, నదులను కాపాడటం ప్రతి పౌరుని కర్తవ్యం అని జిల్లా కలెక్టర్ ఏ.సిరి పేర్కొన్నారు. శనివారం వినాయక ఘాట్ సమీపంలో కెసి కెనాల్‌లో కొనసాగుతున్న శుభ్రత పనులను నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్‌తో కలిసి కలెక్టర్ పరిశీలించారు.
ADB: గ్రామస్తులందరూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టడం గొప్ప విషయం అని బోథ్ MLA అనిల్ జాదవ్ అన్నారు. శనివారం తలమడుగు మండలంలోని కుచులాపూర్ గ్రామంలో నిర్వహించిన సాయిబాబా ఆలయ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు.
కృష్ణా: గుడివాడ మండలం మోటూరు గ్రామంలో రెగ్యులేటర్ పునః నిర్మాణ పనులకు ఎమ్మెల్యే వెనిగండ్ల రాముతో కలిసి ఎంపీ వల్లభనేని బాలశౌరి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఈ రెగ్యులేటర్ పునః నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రాంతీయ రైతులకు నీటి సరఫరా మెరుగుపడి వ్యవసాయానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.
NGKL: జిల్లాలోని వసతి గృహాల్లో పర్యవేక్షణ కరువైందని బీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు సాయిబాబు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఈ మేరకు జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి ఉమాపతికి వినతిపత్రం అందజేశారు. అధికారులు సమయపాలన పాటించకపోవడం వల్ల విద్యార్థులు రాత్రివేళల్లో బయట తిరుగుతున్నారని, మెనూ సరిగ్గా అమలు కావడం లేదని ఆరోపించారు.
MHBD: కురవి మండలం పెద్దతండలో గోవింద్ స్మారక విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. గుగులోతు విజయ్- దుర్గ కుమారుడు గోవింద్ సంవత్సరం క్రితం హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన జ్ఞాపకార్థం గ్రామంలో విగ్రహాన్ని ఏర్పాటుచేసి ఈరోజు ఆవిష్కరించారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ హాజరై గోవింద్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
NGKL: కల్వకుర్తికి చెందిన స్వామి వివేకానంద యూత్ అధ్యక్షుడు శివకుమార్ ఇటీవల జాతీయ యువజన అవార్డు సాధించినందుకు గాను అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు శనివారం ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శివకుమార్.. మాజీ ఎమ్మెల్యేకు వివేకానంద సేవా కార్యక్రమాల బ్రోచర్‌తో పాటు ‘నరేంద్ర మోదీ 2.0’ పుస్తకాన్ని అందజేశారు.
MBNR: గిరిజనుల ఆరాధ్య దైవమైన సేవాలాల్ మహారాజ్ సమాజానికి ఆదర్శంగా నిలిచారని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పద్మావతి కాలనీలోని అయ్యప్పకొండపై నిర్వహించిన సేవాలాల్ జయంతి వేడుకలలో మేయర్ మమత, డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. సమాజంలో నైతికవిలువలు, సేవాభావం, ఐక్యత, సామరస్యం, సద్గుణాలను సేవాలాల్ పెంపొందించారని కొనియాడారు.
TG: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో రైతులకు కన్నీరు మిగిలింది. గూడూరు మండలం భూపతిపేట రైతులు 1,200 కిలోల టమాటాలను విక్రయానికి తీసుకురాగా.. 20 కిలోల పెట్టెను రూ.50కి కూడా కొనేవారు కరువయ్యారు. విసుగు చెందిన రైతులు తమ కష్టాన్ని వృథా చేయలేక, మహిళలందరికీ టమాటాలను ఉచితంగా పంపిణీ చేశారు. కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
HNK: వేలేరు గ్రామ సర్పంచ్ బిల్లా యాదగిరి మంచి నిర్ణయం తీసుకున్నారు. తన సర్పంచ్ పదవీకాలం మొత్తం వచ్చే గౌరవ వేతనాన్ని గ్రామ పంచాయతీ సిబ్బందికి కేటాయిస్తున్నట్లు తెలిపారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు నిత్యం కృషి చేస్తున్న జీపీ సిబ్బంది సేవలను గుర్తించి వారికి బహుమతిగా ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనను అభినందిస్తున్నారు.
సత్యసాయి: తలుపుల మండల పరిషత్ కార్యాలయం వేదికగా ‘స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర’ లక్ష్య సాధనలో భాగంగా ‘చెత్త నుంచి సంపద’ సృష్టించే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ప్రారంభించారు. ఇంట్లోని వ్యర్థాలను అందజేస్తే, ప్రతిగా ఉపయోగపడే వస్తువులను స్వచ్ఛ రథం ద్వారా పంపిణీ చేస్తున్నారు. ఈ వినూత్న సేవల పట్ల పల్లె ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ATP: అనంతపురం ఓల్డ్ టౌన్‌లో శనివారం నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ-వేస్ట్ సేకరణ కేంద్రాన్ని ప్రారంభించిన ఆయన, ఎలక్ట్రానిక్ వ్యర్థాలు పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తాయని హెచ్చరించారు. పాత ఎలక్ట్రానిక్ వస్తువులను ఇక్కడ ఏర్పాటు చేసిన కౌంటర్లలోనే అందజేయాలని కోరారు.
BHPL: కొడవటంచ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయాన్ని రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఛైర్మన్ జంగా రాఘవరెడ్డి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పరిసరాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను ఛైర్మన్ పరిశీలించారు. లక్ష్మీనరసింహస్వామి వారి ఆశీస్సులు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని, రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్లాలని ఆయన ఆకాంక్షించారు.
నల్గొండ: నకిరేకల్ పట్టణం సాయిబాబా గుడి సమీపంలో శనివారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఓ మెకానిక్ షాప్ అగ్నిప్రమాదంలో దగ్ధమైంది. భారీ మంటలు వ్యాపించడంతో స్థానికులు, దుకాణ యజమానులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఫైర్ సిబ్బందికి సమాచారం అందడంతో మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
GNTR: నల్లచెరువులో బాలుడిపై వీధి కుక్క దాడి చేసిన ఘటనపై శనివారం కమిషనర్ మయూర్ అశోక్ స్పందించారు. ఈ నెలలోనే ఏబీసీ (ABC) సెంటర్‌ను అందుబాటులోకి తెచ్చి కుక్కల నియంత్రణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. యానిమల్ బోర్డ్ అనుమతులు వచ్చినందున డాక్టర్లు, సిబ్బందిని సిద్ధం చేయాలన్నారు. గాయపడిన బాలుడికి మెరుగైన వైద్యం అందేలా పర్యవేక్షించాలని సూచించారు.
సూపర్-8 పోరులో రేపు భారత్, దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా హెడ్ కోచ్ కాన్రాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సొంతగడ్డపై జరుగుతున్న మ్యాచ్ కావడంతో భారత్ జట్టుపైనే ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని చెప్పాడు. ఈ ఒత్తిడితోనే భారత్ ఓడిపోయే అవకాశం ఉందన్నాడు. కాగా, రెండు జట్లు బలంగా ఉండటంలో రేపటి మ్యాచ్ హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది.