• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘నాయీ బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది’

TPT: నాయీ బ్రాహ్మణుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని కార్పొరేషన్ ఛైర్మన్ రుద్రకోటి సదాశివం తెలిపారు. వరదయ్యపాలెంలో సెలూన్ షాపులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలును పరిశీలించి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బీసీలకు బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయించామని చెప్పారు.

February 26, 2026 / 08:01 PM IST

మెగా జాబ్ మేళా వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించిన జూపల్లి

ADB: మార్చి 10న ఆదిలాబాద్‌లోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న మెగా జాబ్ మేళా వాల్ పోస్టర్‌ను జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గురువారం ఆవిష్కరించారు. జాబ్ మేళాలో 50కి పైగా పాల్గొననున్న కంపెనీలలో 2000 పైగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. యువతీ, యువకులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

February 26, 2026 / 08:01 PM IST

వాడపల్లి ఆలయంలో సినీ తారల సందడి

కోనసీమ: కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామిని ప్రముఖ సినీ నటులు అన్నపూర్ణ, రజిత గురువారం సాయంత్రం దర్శించుకున్నారు. వారికి అర్చకులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి, తీర్థప్రసాదాలు స్వీకరించిన వారు ఆలయ ప్రాంగణంలో కొంతసేపు గడిపారు. వీరి రాకతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది.

February 26, 2026 / 07:59 PM IST

గంగవరంలో పర్యటించిన పెద్దిరెడ్డి

CTR: వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గంగవరంలో గురువారం పర్యటించారు. పలువురు పార్టీ నాయకులు ఆయనను మర్యాద పూర్వకంగా కలిశారు. పార్టీ కార్యకలాపాలపై వారికి ఆయన దిశా నిర్దేశం చేశారు. పెద్దిరెడ్డిని కలిసిన వారిలో జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యేలు వెంకటేష్ గౌడ, సునీల్ కుమార్, మాజీ ఎంపీ రెడ్డప్ప తదితరులు ఉన్నారు.

February 26, 2026 / 07:58 PM IST

జక్కాపూర్లో ఎన్ఎస్ఎస్ స్వచ్ఛ భారత్ ర్యాలీ

SDPT: ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ 3వ యూనిట్ ఆధ్వర్యంలో జక్కాపూర్ గ్రామంలో ప్రత్యేక శీతాకాల శిబిరం కొనసాగుతోంది. శిబిరం రెండో రోజు వాలంటీర్లు గ్రామంలోని అన్ని వీధుల్లో స్వచ్ఛ భారత్ ర్యాలీ నిర్వహించారు. నినాదాలు, పాటల ద్వారా పరిసరాల పరిశుభ్రతపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. గ్రామాన్ని నిర్మలంగా ఉంచుకోవడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.

February 26, 2026 / 07:57 PM IST

BREAKING: అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ

టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న అతడు, జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్‌లో కేవలం 26 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌లో అభిషేక్ 3 ఫోర్లు, 4 సిక్సర్లతో బాదాడు. దీంతో భారత్ భారీ స్కోరు దిశగా దూసుకుపోతోంది. ప్రస్తుతం టీమిండియా 10.4 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది.

February 26, 2026 / 07:56 PM IST

అనుమానాస్పద స్థితిలో ఒకరు మృతి

శ్రీకాకుళం వాంబే కాలనీకి చెందిన పైల మోహన్ రావు (40) పొన్నాడ వంతెన సమీపంలో గురువారం శవమై కనిపించారు. గత రెండు రోజులుగా ఆచూకీ లేని మోహన్ రావు కోసం కుటుంబ సభ్యులు గాలిస్తుండగా, రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్నాడు. మృతుని తలపై తీవ్ర గాయాలు ఉండటంతో ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

February 26, 2026 / 07:56 PM IST

‘నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు’

ప్రకాశం: ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని దర్శి మోటార్ వాహనాల తనిఖీ అధికారి రవికుమార్ హెచ్చరించారు. గురువారం పామూరులో నిర్వహించిన తనిఖీల్లో టాక్స్ చెల్లించని ఒక స్కూల్ బస్సు, రెండు టిప్పర్లకు మొత్తం రూ.1.55 లక్షల జరిమానా విధించినట్లు తెలిపారు. రవాణా వాహనాలు విధిగా ట్యాక్స్ చెల్లించి, రోడ్డు భద్రతా నిబంధనలు తప్పక పాటించాలని సూచించారు.

February 26, 2026 / 07:55 PM IST

బాధిత కుటుంబానికి CMRF చెక్కు పంపిణీ

NGKL: కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మరాశిపల్లి గ్రామానికి చెందిన సుద్ధకంటి బాలమ్మకు మంజూరైన సీఎం సహాయ నిధి (CMRF) చెక్కును కౌన్సిలర్ కరుణాకర్ రెడ్డి గురువారం అందించారు. అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన బాధితురాలికి MLA కసిరెడ్డి నారాయణరెడ్డి సాకారంతో ఈ ఆర్థిక సాయం అందింది. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

February 26, 2026 / 07:54 PM IST

‘నిరుపేద వృద్ధి వ్యవసాయ కూలీకి సహాయం చేయాలి’

KNRL: వెల్దుర్తి(మం) రామళ్లకోట గ్రామానికి చెందిన 63 ఏళ్ల కూలీ బోయ నాగయ్య ఎడమ కాలికి గాయమై సెప్టిక్ కావడంతో పిక్కల వరకు తొలగించాల్సి వచ్చింది. ప్రస్తుతం వికలాంగుడిగా మారి ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హెల్పింగ్ హాండ్స్ సేవా సంస్థ అధ్యక్షుడు హరి సింహనాయుడు ఇవాళ పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు.

February 26, 2026 / 07:52 PM IST

నల్గొండ కార్పొరేషన్ తొలి మేయర్‌ను సత్కరించిన ఎంపీ

నల్గొండ తొలి మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవలే నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ తొలి మేయర్ ఎన్నికైనటువంటి శ్రీమతి శ్రీ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా మేయర్ భువనగిరి ఎంపీ చామలను ఘనంగా సత్కరించారు.

February 26, 2026 / 07:51 PM IST

ఎల్విన్‌పేట వద్ద ముమ్మర తనిఖీలు

PPM: గుమ్మలక్ష్మీపురం మండలం ఎల్విన్‌పేట చెక్‌పోస్ట్ వద్ద సీఐ హరిబాబు ఆధ్వర్యంలో ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించారు. హెల్మెట్ లేకుండా, పత్రాలు లేని వాహనదారులకు జరిమానాలు విధించి పెండింగ్ చలానాలు చెల్లించాలని హెచ్చరించారు. అక్రమ రవాణా నిరోధానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని, మద్యం సేవించి వాహనం నడిపితే భారీ జరిమానాలు విధిస్తామని తెలిపారు.

February 26, 2026 / 07:51 PM IST

లిక్కర్ కేసు.. వెలుగులోకి కీలక అంశాలు

AP: లిక్కర్ కేసులో A7గా ఉన్న ముప్పిడి అవినాష్ రెడ్డికి రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ‘ఆర్థిక లావాదేవీల్లో అవినాష్ కీలక పాత్ర పోషించారు. లిక్కర్ కంపెనీల నుంచి ముడుపులు తీసుకున్నారు. కొత్త బ్రాండ్లు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. APBCLను అవినాష్ నడిపించారు. రూ.21 కోట్ల నకిలీ బిల్లులు సృష్టించారు’ అని సిట్ అధికారులు వెల్లడించారు.

February 26, 2026 / 07:50 PM IST

టెన్త్ విద్యార్థులకు నగదు బహుమతికి హామీ

NLG: చిట్యాల మండలం గుండ్రాంపల్లి ZPHSలో ఎన్పీ ఫౌండేషన్ పదవ తరగతి మెరిట్ విద్యార్థులకు రూ.5,116 నగదు బహుమతిని ప్రకటించారు. ఫౌండేషన్ ఛైర్మెన్, సెక్రెటరీ తన్నీరు నిర్మలాదేవి, రాం ప్రభు విద్యార్థులకు ఇవాళ రాత సామాగ్రిని పంపిణీ చేయడంతో పాటు పాఠశాలకు కుర్చీలను విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రంలో హెచ్‌ఎం రమాదేవి, నర్సింగ్ రాజు, చిట్టిబాబు పాల్గొన్నారు.

February 26, 2026 / 07:47 PM IST

రూ.151 కే భద్రాచలం తలంబ్రాలు

NZB: భద్రాచలంలో మార్చి 27న జరిగే శ్రీసీతారాముల కళ్యాణం తలంబ్రాలను భక్తుల ఇంటికే చేరవేస్తామని నిజామాబాద్ ఆర్ఎం జోత్స్న తెలిపారు. సంబంధించిన గోడపత్రికలను ఆవిష్కరించి మాట్లాడారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల భక్తులు కేవలం రూ.151 చెల్లించి ఆర్టీసీ కార్గో కేంద్రాల్లో ఈ నెల 25 నుంచి మార్చి 31 వరకు బుక్ చేసుకోవచ్చన్నారు.

February 26, 2026 / 07:47 PM IST