VZM: బొబ్బిలి తారక రామ కాలనీను ఆదివారం పోలీసులు చుట్టుముట్టారు. డీఎస్పీ భవ్య రెడ్డి ఆదేశాలు మేరకు టిఆర్ కాలనీలో పట్టణ, రూరల్ సీఐలు ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అపరిచితులను గుర్తించేందుకు కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు పోలీసులు చెప్పారు. నేరాలను నివారించేందుకు అనుమానిత గుర్తు తెలియని వ్యక్తులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.
VKB: పట్టణంలోని 26వ వార్డు ఇస్తా ఖాన్‌భాగ్ కాలనీలో కుక్కలు గుంపులుగా స్వైర విహారం చేస్తున్నాయి. ఎక్కడపడితే అక్కడ ప్రజలను కరిచి గాయాలపాలు చేస్తున్నాయి. కుక్కల బెడదతో బయటికి రావాలంటే భయాందోళనకు గురవుతున్నామని కాలనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుక్కలను నిర్మూలించి రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను కోరుతున్నారు.
JGL: ధర్మపురి పట్టణంలోని గోదావరి నది ఒడ్డున నూతనంగా నిర్మించిన గంగమ్మ తల్లి ఆలయ ప్రతిష్ట కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి బోరుబావి, ప్రహరీ గోడ నిర్మాణానికి నిధులు సమకూర్చుతానని ఆయన హామీ ఇచ్చారు.
KNR: ఆబాది జమ్మికుంట శ్రీ మహాదేవ లింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల్లో మున్సిపల్ నూతన ఛైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు కౌన్సిలర్లు, ఆలయ అర్చకులు ఘనంగా సన్మానం చేశారు. ఆలయ పరిసరాల సమస్యలపై కమిటీ సభ్యులు వినతిపెట్టగా, పరిష్కరిస్తామని ఛైర్మన్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారు.
HYD: సైక్లింగ్ ఈవెంట్ విజయవంతంగా ముగిసింది. ఆదివారం ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 400 మంది సైక్లిస్టులు పాల్గొన్నారు. రాయదుర్గం ట్రాఫిక్ పోలీసులు మార్గమంతా పర్యవేక్షిస్తూ ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఫిట్ నెస్, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన ఈ ఈవెంట్ సాఫీగా పూర్తయింది.
SRCL: తంగళ్లపల్లి మండలం మండేపల్లి గ్రామ సర్పంచ్ గాధగోని సాగర్ ఆధ్వర్యంలో ఆదివారం రెడ్డి సంఘం భవనంలో కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో అన్ని రకాల కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులు సర్పంచ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
PPM: చీపురుపల్లి శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు 28 వ వార్షికోత్సవం సందర్బంగా జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) కుటుంబ సమేతంగా అమ్మవారిని ఆదివారం దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టు వస్త్రములను సమర్పించారు. ముందుగా కమిటీ సభ్యులు, ఆలయ పూజారి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనం పొందారు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘మన శంకరవర ప్రసాద్ గారు’ OTTలోనూ అదరగొడుతోంది. ప్రస్తుతం జీ5లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమా TVలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ప్రముఖ టీవీ ఛానల్ జీ తెలుగులో FEB 28న సాయంత్రం 5:30కి టెలికాస్ట్ కానుంది. ఇక దర్శకుడు అనిల్ రావిపూడి తెరక్కించిన ఈ మూవీలో నయనతార, వెంకటేష్ కీలక పాత్రలు పోషించారు.
BHPL: భూపాలపల్లి జిల్లాలోని 248 గ్రామాలకు ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. గ్రామపంచాయతీ ఎన్నికల అనంతరం తొలిసారిగా రూ.4.65 కోట్లు విడుదల చేసినట్లు DPO శ్రీలత ఇవాళ తెలిపారు. 2011 జనాభా ఆధారంగా ఒక్కో వ్యక్తికి రూ.865 చొప్పున లెక్కించి నేరుగా పంచాయతీ ఖాతాల్లోకి జమ చేశామని DPO వెల్లడించారు.
KMR: బిక్కనూరు మండల పరిధిలోగల టోల్ ప్లాజా వద్ద ఆదివారం పోలీసులు ముమ్మరంగా వాహనాలు తనిఖీలు చేపట్టారు. ఎస్సై ఆంజనేయులు ఆధ్వర్యంలో పలు వాహనాలను ఆపి తనిఖీలు చేశారు. వాహనదారులు రోడ్డు నిబంధనలు పాటించి వాహనాలు నడపాలని సూచించారు. రోడ్డు నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
NLG: మిర్యాలగూడ మండలం ఆలగడపలో నూతనంగా ఏర్పాటు చేసిన RSN రైస్ మిల్‌ను మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు ఇవాళ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ ఆధారంగా ఉన్న మన ప్రాంతంలో రైస్ మిల్లుల స్థాపన రైతులకు ఎంతో ఉపయోగకరమన్నారు. మిల్ యాజమాన్యాన్ని అభినందిస్తూ, వ్యాపారం విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు.
KDP: పెండ్లిమర్రి సమీపంలోని భైరవగుట్టపై రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. కడప వైపు నుంచి వేంపల్లి వైపు వెళ్తున్న మూడు స్కూటర్లను ప్రమాదవశాత్తు వెనుక వైపు నుంచి కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో దాదాపు ముగ్గురు గాయపడినట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
AKP: కోటవురట్ల మండలం పాములవాక పశువైద్యశాలకు వచ్చిన పశువుల దాణా లారీని వైసీపీ మండల అధ్యక్షుడు కిల్లాడ శ్రీనివాసరావు అడ్డుకున్నారు. లారీలో పశువుల దాణా బస్తాలను అర్హులైన YCP సానుభూతిపరులకు పంపిణీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. గతంలో గ్రామానికి రెండు పశువుల దాణా లారీలు రాగా వాటిని అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో టీడీపీ వారికి పంపిణీ చేశారని ఆరోపించారు.
ఆదిలాబాద్: తలమడుగు మండలం బరంపూర్ గ్రామం సమీపంలో చుట్టూ అందమైన కొండల మధ్యలో గుట్టపై వెలసిన పురాతన వేంకటేశ్వర స్వామి ఆలయం ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తోంది. ఆహ్లాదకరమైన వాతావరణం ఉండడంతో ఈ ఆలయానికి ఆదిలాబాద్ జిల్లాతో పాటు మహారాష్ట్ర నుంచి సైతం భక్తులు తరలివస్తున్నారు. కాగా, నేడు లక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల చివరి రోజు.
KRNL: చిప్పగిరిలోని శ్రీ భోగలింగేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం సందర్భంగా అలూరు MLA విరుపాక్షి రూ. 50,000 విరాళాన్ని ఇవాళ అందజేశారు. ఆలయాలు ఆధ్యాత్మిక చైతన్యానికి కేంద్రబిందువులని, దేవాలయ అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.