• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

విద్యుత్ సరఫరాలో నేడు అంతరాయం

SRPT: కోదాడ పట్టణంలోని శ్రీమన్నారాయణ కాలనీ, అంబేద్కర్ కాలనీ, టీచర్స్ కాలనీ ప్రాంతాల్లో బుధవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని మంగళవారం సాయంత్రం పట్టణ విద్యుత్ ఆపరేషన్ ఏఈ నరసింహనాయక్ పేర్కొన్నారు. కావున విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.

February 25, 2026 / 07:45 AM IST

రైల్వే గేట్ వద్ద వాహనదారులకు కౌన్సిలింగ్

కృష్ణా: గుడివాడ మండలం మల్లాయిపాలెం రైల్వే గేట్ వద్ద ఎస్సై చంటిబాబు బుధవారం వాహన తనిఖీలు చేపట్టారు. ప్రజల భద్రత దృష్ట్యా ఓవర్ లోడ్‌తో ప్రయాణిస్తున్న ప్రయాణికుల వాహనాలను గుర్తించి డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎస్సై మాట్లాడుతూ.. వాహనదారులు రోడ్డు భద్రత నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, అనుమతించిన పరిమితికి మేరకే ప్రయాణికులను తీసుకువెళ్లాలన్నారు.

February 25, 2026 / 07:45 AM IST

నేడు డయల్ యువర్ డీఎం

RR: మియాపూర్-2 డిపో పరిధిలో ఇవాళ డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు డిపో మేనేజర్ వెంకటేశంగౌడ్ తెలిపారు. మియాపూర్, బాచుపల్లి, మల్లంపేట్, నిజాంపేట్ పరిసర ప్రాంతాల ప్రజలు సమస్యలతో పాటు సూచనలు, సలహాలు తెలిపేందుకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 9959226420 నెంబర్‌కు కాల్ చేయాలన్నారు.

February 25, 2026 / 07:43 AM IST

POSH చట్టం పోస్టర్ను ఆవిష్కరించిన అధికారులు

BHPL: జిల్లా IDOC కార్యాలయంలో POSH Act–2013పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా POSH చట్టం పోస్టర్‌ను అధికారులు ఆవిష్కరించారు. సంక్షేమ అధికారి మల్లేశ్వరి మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటివరకు 44 అంతర్గత ఫిర్యాదు కమిటీలు (ICs), 7 ప్రైవేట్ సంస్థల్లో ICలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మిగిలిన ప్రైవేట్ సంస్థలు కూడా తప్పనిసరిగా IC ఏర్పాటు చేయాలన్నారు.

February 25, 2026 / 07:43 AM IST

అక్రమంగా మట్టి తరలిస్తున్న జేసీబీ, రెండు ట్రాక్టర్లు పట్టివేత

SRCL: బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తున్నారనే సమాచారంతో ఎస్సై రమాకాంత్ చేరుకున్నారు. సంఘటనా స్థలంలో జేసీబీ, రెండు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించి, కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. మండలంలో అక్రమంగా మట్టి, ఇసుక తరలిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.

February 25, 2026 / 07:42 AM IST

సీఎంను కలిసిన మున్సిపల్ ఛైర్ పర్సన్, ఎమ్మెల్యేలు

JGL: జగిత్యాల మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా ఎన్నికైన సమిండ్ల వాణి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో కలిసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేయగా సీఎం శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నరసింగరావు పాల్గొన్నారు.

February 25, 2026 / 07:42 AM IST

ప్రమాదవశాత్తు చెరువులో పడి ఒకరు మృతి

MNCL: హాజీపూర్ మండలం టీకానపల్లి చెరువులో పడి ఒకరు మృతి చెందినట్లు SI కిరణ్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. మృతుడిని అదే గ్రామానికి చెందిన మెడపట్ల పోచయ్యగా గుర్తించారు. మేకల కాపరి అయిన పోచయ్య చెరువు గట్టుపై నుంచి వెళ్తూ ప్రమాదవశాత్తు పడి మృతి చెందినట్లు అనుమానం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

February 25, 2026 / 07:42 AM IST

గాలివానకు నేలకొరిగిన మొక్కజొన్న

KMR: రాజంపేట మండలంలో కురిసిన గాలివానకు పలు గ్రామాల్లో రైతులు సాగు చేసిన మొక్కజొన్న పంట నేలకొరిగింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మండలంలోని పెద్దపల్లి, బసన్నపల్లి గ్రామాల్లో రైతులు పెద్ద ఎత్తున మొక్కజొన్న పంటను సాగు చేశారు. గాలి వాన వల్ల మొక్కజొన్న పంట నేలకొరిగింది. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరారు.

February 25, 2026 / 07:42 AM IST

శాసనమండలిలో ఎమ్మెల్సీ గళం

W.G: ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్, వర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యలను ఎమ్మెల్సీ గోపిమూర్తి మంగళవారం శాసనమండలిలో ప్రస్తావించారు. ఏళ్ల తరబడి సేవలందిస్తున్న వీరిని, అసిస్టెంట్ ప్రొఫెసర్లను వెంటనే క్రమబద్ధీకరించాలన్నారు. ఎయిడెడ్ కళాశాలల్లోని అన్-ఎయిడెడ్ సిబ్బందిని సైతం రెగ్యులర్ చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.

February 25, 2026 / 07:40 AM IST

పారిశుద్ధ్య కార్మికులకు పనిముట్లు అందజేత

ATP: గుంతకల్లు మున్సిపాలిటీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు బుధవారం మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి పనిముట్లను అందజేశారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ.. పారిశుద్ధ్య కార్మికుల భద్రత, సామర్థ్యాన్ని పెంచేందుకు పనిముట్లు, రక్షణ పరికరాలను అందజేశామన్నారు. ఈ పరికరాలు నగర స్వచ్ఛతకు దోహదపడతాయన్నారు.

February 25, 2026 / 07:40 AM IST

ప్రవేశ పరీక్ష ఈనెల 8కి వాయిదా

AKP: కశింకోట మండలం తాళ్లపాలెంలో బీఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకుల పాఠశాలలో మిగులు సీట్ల భర్తీకి వచ్చే నెల 2 నిర్వహించనున్న ప్రవేశపరీక్షను 8వ తేదీకి వాయిదా వేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ రత్నావళి మంగళవారం తెలిపారు. ఆరోజు 6, 7 తరగతులకు ఉదయం 10 గంటల నుంచి 11:30 గంటల వరకు, 8, 9,10 తరగతులకు మధ్యాహ్నం 2 నుంచి 3.30 గంటల వరకు జరుగుతుందన్నారు.

February 25, 2026 / 07:39 AM IST

తిరుపతికి వెళ్లే వారికి ALERT

TPT: తిరుపతి ప్రధాన స్టేషన్‌లో రద్దీ తగ్గించేందుకు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అరక్కోణం, చెన్నై సెంట్రల్ మెమూ రైళ్లు ఇకపై తిరుపతికి రావు. తిరుచానూరు రైల్వే స్టేషన్ నుంచే ఇవి రాకపోకలు సాగించనున్నాయి. ఆయా మార్గాల్లో రాకపోకలు సాగించే ప్రయాణికులు ఇకపై తిరుపతి బదులు తిరుచానూరు స్టేషన్‌కు వెళ్లాల్సి ఉంటుంది.

February 25, 2026 / 07:38 AM IST

నిమిషం నిబంధన ఎత్తివేత

SRPT: పరీక్ష కేంద్రంలోకి వెళ్లేందుకు నిమిషం నిబంధన ఎత్తివేశారు. పరీక్ష సమయానికి 5ని.ల వరకు పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. ఉ.9గంటలకు పరీక్ష ప్రారంభం కాగా 9.05గంటల వరకు అధికారులు అనుమతించనున్నారు.విద్యార్థులను ఉదయం 8గంటల నుంచే పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు. ఉదయం 8.45గంటలకల్లా ఓఎంఆర్ షీట్ పై వివరాలన్నీ సరి చూసుకోవాలి. 9గంటలకు ప్రశ్నపత్రం ఇస్తారు.

February 25, 2026 / 07:36 AM IST

వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళ అరెస్ట్

NDL: నంద్యాలలోని బాలాజీ కాంప్లెక్స్ ప్రాంతంలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ మహిళను మంగళవారం సాయంత్రం అరెస్ట్ చేసినట్లు వన్ టౌన్ సీఐ సుధాకర్ రెడ్డి తెలిపారు. వ్యభిచారం జరుగుతుందనే సమాచారం మేరకు దాడలు చేసి ఒక మహిళను అరెస్టు చేసి, ఆమె అనుచరులను అదుపులోకి తీసుకున్నామన్నారు. వారిపై కేసు నమోదు చేశామన్నారు. కాగా, ఆ మహిళపై ఇదివరకే పలు కేసులు ఉన్నాయన్నారు.

February 25, 2026 / 07:36 AM IST

పచ్చి మొలకలతో హెల్తీ బ్రేక్‌ఫాస్ట్

ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌గా మొలకెత్తిన గింజలను తింటే ఆరోగ్యంగా ఉంటారు. బరువు తగ్గాలనుకునే వారికి, షుగర్ కంట్రోల్‌ ఉండాలనుకునే వారికి మొలకలు మంచివి. వీటిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. శాఖాహారులకు మొలకలు ప్రొటీన్స్ సోర్స్‌గా చెప్పవచ్చు. వీటిలో ఉండే అమైనో యాసిడ్స్ కండరాల పెరుగుదలకు సహాయపడుతుంది. వీటిలో విటమిన్ A, C, K , బి-కాంప్లెక్స్ ఉంటాయి.

February 25, 2026 / 07:36 AM IST